Tuesday, March 23, 2021

ఓం

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా ! సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.

జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి   అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి. 

*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును.

*అష్టలక్ష్ములు*

1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.

స్వామి శరణం

అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
కంఠం లో మెరిసే నవరత్న మణి హారాలతో...
చెవులకు కుండలాలతో....
తెల్లని పలువరస తో దగ దగా మెరిసే...
అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

అమ్మ

అజ్ఞాన అంధ వినాశ కారిణి
మమ్ము ఆదరింపు మాత...
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు...
ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము...
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ...
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ...

అమ్మ దుర్గమ్మ శరణు...
ఓం శ్రీ దుర్గాదేవినే నమః

ఓం గం గణపతియే నమః

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం

ఓం గం గణపతియే నమః

శివోహం

మొదటి ఒడి చేసుకున్న ఋణం...
రెండవ ఒడి తీర్చుకున్న ఋణం...

రెండు ఋణాల జమాఖర్చుల మధ్య నను నడిపే నాధుడు నా శివుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, March 22, 2021

శివోహం

కారణములు లేక కార్యాలు జరుగవు.
భగవంతుడు ఏది చేసినా అందులో మంచే తప్ప చెడు ఏమీ ఉండదు. రైతు పంట చేనుకు మందు జల్లేటపుడు చీడ పురుగులు చస్తాయే తప్ప పంట మెుక్కలకు ఏమీ కాదు. భగవంతుని వాక్యములు పెడచెవిన పెట్టి గర్వోన్మత్తులై దయ దాక్షిణ్యాలు లేక హింసకు పాల్పడే చీడ పురుగులన్నీ రాలిపోవాలనే ఈ వినాశనం. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవారు భయపడవలసిన పని లేదు. భగవంతుని నామ స్మరణ చేసుకొండి. వ్యక్తి ప్రయత్నముగా పరిశుభ్రత పాఠించండి. మానవుడు చేసుకున్న మహా తప్పిదమే ఈ వినాశనం తప్ప దీనికి భగవంతుని బాధ్యుతుని చేయడం వెర్రితనం. కనీసం ఈ వినాశనం చూసైనా మనుషులలో మార్పు రావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. జీవులను హింసించడం మానుకోవాలి. లేదంటే ఇంతకంటే పెద్ద వినాశనం తప్పదు.

Sunday, March 21, 2021

శివోహం

శివ, సదాశివ, ప్రాణనాధ
నిను అర్థం చేసుకునే దారి వెదకడం అంటే...
నన్ను నేను తెలుసుకోవడం...
ఆరెండు అర్థం అయ్యే స్థితిలో నను
చేర్చుకో పరమేశ్వరా...
నామనమున నీవు నిలిచిపో...
ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...