Sunday, July 16, 2023

శివోహం

శివ...
మనసంతా ఆలోచనల పర్వతం కింద శిధిలమై చేరింది...
జ్ఞాపకాల తుంపరులలో నా జీవన పర్యంతము అంత కలవరమే...
కలనైనా అనుకోలేదు కకావికల ఈ మౌనా నిరీక్షణా...
కలల అలలపై తేలియాడు జీవనౌక నువ్వుకట్టిన కోట చివరికి శిధిలమై మిగిలింది...
ఇకనైనా నా చేయందుకో నా మనో మందిరాన్ని పునరుద్ధరించుకో

మహాదేవా శంభో శరణు.

Saturday, July 15, 2023

శివోహం

యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్థస్యై నమస్థస్యై నమస్థస్యై నమో నమః

శివోహం

శివా!చీకటింటిని వీడి చితి మార్గమును పట్టి
వేడుచుంటిని నిన్ను వెలుగు తెలియ 
వేలుపైన నీవు దారి చూపగ కినుక ఏల ?
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుణ్ని చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే

ఓం నమః శివాయ

Friday, July 14, 2023

శివోహం

వైకుంఠ వాసా...
వైష్ణవ భక్త హృదయ నివాసా...
వేద వెద్య...
అద్యంత రహిత...
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక...
లక్ష్మీ రమణ...
గోవిందా శరణు.

ఓం నమో వెంకటేశయా.

శివోహం

శివ శివ శివ అంటూ నోరారా పిలవ లేని నోరు నోరే కాదు చెట్టు తొర్ర నే కదా జీవ...

ఓం నమః శివాయ.

శివోహం

నిరంతర శివ నామ స్మరణే ముఖ్యమనీ 
త్రివిధ తాపం రక్షించేది పరమేశ్వరుడేనని...
శోక మోహ రాహిత్యమునకు అలాగే సంసార సాగరం దాటించే దైవం నీవేనని నీ చెంత చేరా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...