Saturday, June 29, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
లింగ రూపం లో 
అందరికీ దర్శన మిస్తావూ
కానీ నీ నిజ రూపం 
తెలియదయ ఎవరికీ
ఆది అంతం లేని 
ఆద్యుడవు  నీవూ
పరమ శివుడవు నీవు
నీ కంటూ ఓ స్థానం లేదు
నిరాకారుడవు నీవు
నిరంజనుడవు నీవు 
సదాశివా నిను నిరతము
పూజింతు నేను మహాదేవా!
మరు భూమిలో వశించే
భూత నాధుడవు నీవు
అన్నపూర్ణనే తిరిపమడిగిన
అర్ధనారీశ్వరువు నీవు 
సర్వ శుభంకరుడవు

శివ నీ దయ,

గోవిందా

సర్వలోక నాయకా
శ్రీ ఆశ్రిత రక్షకా
శ్రీ సర్వసంపద దీపికా
శ్రీ దేవి వల్లభా
శ్రీ అభయప్రధాతా
శ్రీ పద్మనాభా
శ్రీ వేణునాదామృతా
శ్రీ వేంకటేశ్వరా శరణు...

Friday, June 28, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయలే. మరి మన కర్తవ్యం మాయలసృష్టి కర్త పరమేశ్వరుని ధ్యానించటం.

లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు  
ఇందుకు మూలం, ఈశ్వరునియొక్క మాయ కళలైనట్లే         

కొబ్బరి కాయలో, నీరుపోయక నీరు వచ్చి నట్లు   
శుభం అనేది, ఎవ్వరు తలవ కుండా వచ్చినట్లే 
గజం తిన్న వెలగపండులో, గుజ్జు మాయ మైనట్లు 
మన నుంచి పోవలసినది, విడిచి పోయి నట్లే 

శ్వేత అద్దంలో నీడ స్పష్టముగా కన బడినట్లు 
జీవులు ప్రేమ సందడిలో పుట్టుకలు వచ్చినట్లే  
చెట్టుకు పండిన పండు తెగి నేలపై పడినట్లు 
కాలము వెంబడించిన జీవులు మరణించినట్లే 

రాతిపై కడవను పెట్టగా, కుదుట పడినట్లు 
జీవి ఏకాగ్రతతో, మనసు కుదుట పడినట్లే 
ఉదయ భానుని వెలుగుకే, మంచుకరిగి నట్లు 
పరమేశ్వరుని  ప్రార్ధించితే, పాపాలు పోయినట్లే 

లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు  
ఇందుకు మూలం ఈశ్వరుని యొక్క మాయ కళలైనట్లే

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కినుక వహించావు నా ఎడ ఎందుకో...
నా దోషమేమో మరి అలక బూనినావు...
నావైపు నీచూపు ప్రసరించవైతివేలనో హర
తొందరపాటుగనో  నా పొరపాటుగనో తెలిసీతెలియకా నే చేసిన తప్పులకు ఏ శిక్ష వేసిన నే సిద్ధమే...
నా పైన దయ చూపు తండ్రి.

మహాదేవా శంభో శరణు. 

Thursday, June 27, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తి ఒక అద్భుతమైన దైవాంశ...
అది ఒక అనుభవైక వేద్యము...
పరమానంద భరితము అద్భుతము...
అపురూపమైన దివ్యా నుభవం...
యోగ శక్తి కంటే, భక్తి కివున్న శక్తి చాలా గొప్పది...
ఎందుకంటే భక్తి లో అహంకారం ,మమకారాలు  ఉండవు...
అది అద్వితీయమైన భావ సంపద...
ప్రతీ ప్రాణి దైవ స్వరూపమే...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
బతకమని పుట్టుక ఇస్తావు...
బంధాల ఉచ్చులో విసిరేస్తావు...
కష్టాల సాగరంలో తోస్తావు...
బతుకంటే ఇది అని తెలిసేలోగా...
నీ దగ్గరకు లాగేస్తావు...
నువ్వు ఆడే ఈ నాటకంలో మేమంతా ఆట బొమ్మలమనితెలిసేలా చేస్తావు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...