Monday, July 29, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీపాద ధూళిని గ్రహించి లోకాల్ని 
సృష్టించు నలువకు నీవె కర్త 
ఈ ధూళి తలదాల్చి హరిమోయు భువనాలు
ఆయాస పడకుండ  నీవె కర్త
ఈ ధూళి హరుడుయే ఒడలెల్ల పూసియు
నిను భక్తి తొ కొలుచు నీవె కర్త
త్రిముర్తి లీలల చేసేటి పనులకు
ప్రతిసృష్టి తరుణము నీవె కర్త

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, July 27, 2024

శివోహం

శివా!నీ నామ శతకాన పేరు దాల్చి
పేరు పేరున నీ నామ స్మరణ జేసి
వేడు చుంటిని కదా నిన్ను చేర
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉత్తమమైనది ఈ మానుష జన్మ...
జన్మజన్మాలుగా చేసిన పుణ్యాల ఫలం...
నీ పదసన్నిధి అది ఎంతటి భాగ్యం
విమలమైన మానసం ప్రశాంత జీవనం
నిశ్చల భక్తి నాకు ప్రసాదించు హర...
నిర్మల ఆసక్తిని కలిగించు సర్వేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

Thursday, July 25, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
నీ కృపా కటాక్ష వీక్షణ దయా భిక్ష ఆశీర్వాదాలతో...
భుజించే ముందు కొన్ని మెతుకులు
ముందుగా సమర్పించడం నీకు నైవేద్యమే కదా తండ్రీ ...

నిదురపోయే ముందు నిన్నే తలచుకుంటూ మది పాడుకునే పావననామంనీకు పవళింపు సేవే కదా తండ్రీ ...

మేలుకొలుపులో నిన్నే ఆరాధిస్తూ శ్వాసిస్తూ హృదయం ఆలపించే గీతం నీకు సుప్రభాతమే కదా తండ్రీ ...

ఇవన్నీనీవు సమకూర్చిన సుఖాలే తండ్రీ నీవిచ్చిన ఈ సౌఖ్యాలను
నీకు సమర్పించడానికి కూడా ...
సవా లక్ష సందేహాలు ఎందుకో.

మహాదేవా శంభో శరణు

Wednesday, July 24, 2024

శివోహం

ఆపద్భాంధవా ఆంజనేయ
        ఆత్మ రక్షక ఆంజనేయ
        ఆనందస్వరూపఆంజనేయ
        నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ

శివోహం

శివా!మాడు మూసి మాయ చేసి
మమ్ము మోహంలో ముంచేసి
తెలియ నీయవేమి తేట తెలివి.
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...