Saturday, November 30, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అనన్య భక్తితో నీయందె మనస్సును కలిగి ఉన్నవారము మేము
జ్ఞానమనే నలుసంత కాటుక పెట్టి అజ్ణానాన్ని తొలగించువాడవు నీవు...
ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడవు...
హృదయ క్షేత్రములో ఆద్యాత్మిక బీజాలను దృడ పరిచిన వాడవు జీవితరధాన్ని దైవమార్గంలో నడిపించి మోక్షాన్ని అందించే దేవదేవుడవు నీవు.
మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
గమ్యం ఎరుగని గాలికి తిరిగే గాలి పటాన్ని నేను...
నీవు నా కళ్ళ ముందే ఉన్నా చూడేలేనివాన్ని నేను...
మాయ మాటలకు చిక్కి మనసు చలించిన వానికినీవే రక్షః....
నీ భక్తులను ఆనంద పరిచి, వారిని కటాక్షమ్చుటకు నీవే రక్షః

మహాదేవ శంభో శరణు.

Friday, November 29, 2024

హరి ఓం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి!
కామక్రోధమదమాత్సర్యాలు వెంటాడు తున్నాయయ్యా  
నిన్నే శరణ మంటూ పార్ధిస్తున్నామయ్యా...
అజ్ఞానంకు తోడు భయమేదో కలుగుతుందయ్య...
నా భయాలన్నీ తొలగించి ధైర్యం చెప్పవయ్యా...
పాపాలు పొలంలో మృగాల్లా నాలో చేరి
పుణ్యమనే పంట నాశనం చేసి చేస్తున్నదయ్య యజమాని నీవై తరిమిగొట్టాలయ్య...

ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
ఓం నమో వెంకటేశయా.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, November 28, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా అంతరంగం నవనీతానికి ప్రతి రూపంగా నీపైనే ఉంటుంది...
నామనసు పుణ్య భావాల నీ మందిరమై అలరారుతూ ఉంటుంది...
కర్మభంధములను విడిచి నీ సన్నిధిలో నే ఉండాలని ఉంది...
నారాతను నిన్ను సేవించెవిధముగా మార్చమంటున్నాను.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అమ్మ!
జనన మరణముల జాగృతి నీవె
జయాపజయాల స్పురణవు నీవె
మార్గము చూపే దీపము నీవె
కూష్మాండవై వెలిగిన జ్యోతివినీవె
మహాగౌరి గ మూలము నీవె
నవదుర్గగ నవ నవ విధముల
కొలిచితి మమ్మ…తప్పులెన్నక..
కన్నతల్లిగ కరుణచూపుమా
అమ్మలగన్న అమ్మనీవుగా
ఆదరించు మము ఆది దుర్గగా.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
ఓం శ్రీమాత్రే నమః

Wednesday, November 27, 2024

శివోహం



శివా!నీ కేశపాశములు నిండి నింగినంత
జాలువారిన గంగను పట్టేను ఏమి వింత
చిత్రాలకు చిరునామా నీవే తెలిసినంత
మహేశా . . . . . శరణు .

శివా!నీ నేత్ర కళశాల ఒలికిన కారుణ్యమే
ఇల పుణ్య తీర్థాలై  పుడమి నెరిగె
ఏ పూజ ఫలమో ఈ రీతి మాకు దక్కె
మహేశా . . . . . శరణు .

శివా!జన్మలకు మరణమందించు
మరణానికి జన్మలు తొలగించు
ఒక్కసారికి నా మాట మన్నించు
మహేశా . . . . . శరణు .

శివా!ఈ దేహంతో ధ్యానం చేస్తూ
సోహంతో శ్వాసను చూస్తూ
కనలేని దారిలో కదిలి వెళ్తున్నా
మహేశా . . . . . శరణు .

శివా!నిజ తేజమంతా నిలువు కంట నింపి
అటు ఇటుగా వున్న అడ్డు కన్నుల పంచి
రేయి పగలుగ జగతికి అందజేసావు
మహేశా . . . . . శరణు .

శివా!సత్యం నీవుగ తెలిసేవు
శివమే తత్వంగా విరిసేవు
సుందర రూపున మెరిసేవు
మహేశా . . . . . శరణు .

శివా!ఓంకారానికీ ఆకారంగా నీవు
అరూపరూపిగా అగుపించు చున్నావు
అనుభూతికేలనో అందకున్నావు
మహేశా . . . . . శరణు .

శివా!నేను ,నీవు అంటూ పూజ చేసి
నేను, నీవేనంటు ధ్యానాన తెలిసి
దరి చేర తలచాను దయ నీది కాగా
మహేశా . . . . . శరణు .

శివా!ఈ లింగమున నిన్ను తెలుసుకున్నాను
ఆలింగనముగ నిన్ను హత్తుకున్నాను
ఆనంద డోలికల అవధి దాటేను.
మహేశా . . . . . శరణు .

శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో
పుట్టి గిట్టుటలోన  నేను మట్టినే కూడి
మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను
మహేశా . . ... . శరణు .




శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...