Tuesday, June 30, 2020

శివోహం

తత్ప్రణమామి సదాశివలింగం
ఉపనిషత్తులు పరమాత్మను ‘సత్యం-శివం-సుందరం అని నిర్వచించాయి. అతడే పరమమైన సత్యం, పరమైన శుభము, సుందరం అన్నాయి. అతడే శివ్ఞడు పరతత్వమే శివతత్వమనీ, సర్వకారణమనీ విష్లేశించాయి. పరతత్వమైన పరమశివుని ఆరాధించడం భారతీయ సంస్కృతి, సృష్టి స్థితి లయలకు హేతువైన శివ్ఞని లింగరూపంగానూ, మూర్తిరూపంగానూ ఆరాధించడం సంప్రదాయం.

ఈ రూపాలు ‘అకల, ‘సకల తత్వానికి సంకేతాలు. లింగం ‘అకల (నిర్గుణ) తత్వానికి, మూర్తి ‘సకల (సగుణ) తత్వానికి సంబంధించిన విధానాలు నిరాకార, సాకార రూపంగా సదాశివ్ఞని ఆరాధించడం సంప్రదాయం. లింగార్చన అత్యంత ప్రాచీనం, సనాతనం నిర్గుణ, సగుణ రూపాలు, అకలము, సకలముగా చెప్పిన అన్నిరూపాలు ఆరాధనీయాలే. లింగం నిర్గుణమైతే, చంద్రశేఖర, జటాజూట త్రిశూలపాణి వంటివి సగుణరూపాలు ప్రధానంగా లింగతత్వము పరమశివ్ఞని పరమతత్వస్వరూపం. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, స్థితి భర్త విష్ణువ్ఞకు తామిరువ్ఞరులో అధికుడెవ్వరన్న వాగ్వివాదం ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధం ముల్లోకాలలో సంక్షోభానికి దారితీసింది. దేవతలు భయంకంపితులై సదాశివ్ఞని శరణు వేడారు.

సదాశివుడు హరిబ్రహ్మల మధ్య ఆది అంతములు తెలియని మహాలింగంగా ఆవిర్భవించారు. ఇరువ్ఞరు మహాతేజస్సుతో ప్రకటితమైన ఆ అగ్ని లింగాన్ని చూసి అప్రతిభులయ్యారు. ఆది అంతములు తెలుసుకున్నవారే అధికులని లింగం నుండి వాణి వినిపించింది. హరి వరహరూపంలో ఆదిని తెలుసుకోడానికి, హంసరూపంలో బ్రహ్మ అంతం కనుగొనడానికి ఉద్యమించారు. ఇరువ్ఞరూ విఫలమయ్యారు. లింగరూపంలో ఉన్న శివ్ఞడు ప్రత్యక్షమై హరి బ్రహ్మలకు తత్త్వోపదేశం చేశాడు.”వాస్తవానికి ఒకే తత్వం హరి బ్రహ్మలుగా వ్యక్తమైందనీ, అనంతమైన ఏకత్వమే అసల సత్యమనీ, ఆపరమ సత్యాన్ని తెలియజేసేటందుకు అగ్ని లిగంగా ఆవిర్భవించానీ అన్నాడు. ఆ తత్వాన్ని గ్రహించి బ్రహ్మమురారులతో పాటు సకల దేవతలు. ఋషులు సదాశివ్ఞని లింగరూపంలో ఆరాధించారు. ఈ సంఘటన మాఘశుక్ల చతుర్ధినాడు జరిగింది. రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ జ్వాలాలింగ మహారూపాన్ని దర్శించక దేవతా సమూహం ఆతేజస్వరూపాన్ని ఉపహరించమని ప్రార్ధించగా,శాంతించిన పరమశివ్ఞడు పార్థివ లింగరూపంలో పృద్వీనిపై ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి పర్వదినం. ఆ తేజస్సు ‘అగ్నికాదు. పంచభూతాలకు ఆదియైని జ్యోతిస్వరూపం శివ్ఞని జ్యోతిర్లింగంగా ప్రభవించినట్లు పురాణాలు వచిస్తున్నాయి.

జ్యోతిర్లింగ క్షేత్రాలు- సేరాష్ట్రే సోమనాధం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారమమలేశ్వరం, పరల్యాం వైధ్యనాథం చ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబంధే చ రామేశం, నాగేశం,దారుకావనే, వారాణాశ్యంతు విశ్వేశం, త్య్రయంబకం గౌతమీ తవే, హిమాలయేతు కేదారం, ఘశ్మేశంచ శివాలయే పన్నెండు స్వయంభూలింగాలుగా ఆవిర్భవించిన శివ్ఞడు లోకరక్షణ చేస్తున్నాడు. ఇవికాక, శ్రీఆది శంకరులు శివ్ఞని ద్వారా పొందిన పంచభూత్మాకమైన ఐదు స్ఫటికలింగాలను -పృథ్వీలింము(కాంచీక్షేత్రం) జలలింగం (జంబుకేశ్వరం) అగ్నిలింగం (అరుణాచలం)వాయులింగం (శ్రీకాళహస్తి), ఆకాశలింగం (చిదంబరం) క్షేత్రాలలో ప్రతిష్టించారు. తారాకా సుర సంహానంతరం, ఆ అసురుని హృదయంలో ఉన్న శివలింగం విచ్ఛిన్నమై ఐదు ప్రక్కలైంది. అవి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని శివలింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ‘లయనాత్‌ లింగముచ్చతే అని నిర్వచనం దేని యందు సర్వ జగత్తులీనమై ఉంటుందో ఈ పరతత్వమే లింగం. ‘చిహ్నమని అర్ధం. పరమశివ్ఞని ప్రతీక. అర్థనారీశ్వరతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అసాధ్యం.

శివలింగం పానీపట్టం చేత ఆవృతమై ఉంటుంది. పానీవట్టం ప్రకృతీ శక్తికి ప్రతీక. అర్ధనారీశ్వర తత్వమే పానీవట్టం చేత చుట్టబడిన శివలింగతత్వం, శక్తి సంస్పర్శచేత శివ్ఞడు వ్యక్తమేతున్నాడు. పానీపట్టమే యోనిపీఠం శక్తిపీఠం. వ్యాపకశీలమైన ప్రకృతీతత్వమే యోని ఉత్పత్తికి ఉపాధాన కారణమైన శివ్ఞడే లింగం. ‘యోనిని ‘భగము అన్నారు. ‘భగము కలవాడు భగవానుడు ఇలా ప్రకృతిశక్తులు పార్వతీ పరమేశ్వరుడు ల సంయోగం కారణంగా ఈ జగత్తు సృష్టి జరిగింది. ఉపనిషత్తులు,పురాణాలు, భగవద్గీత,లలితోపాఖ్యానం మొదలైన గ్రంధాలన్నీ ఈ విషయాన్ని స్పష్టపరిచాయి. సృష్టిస్థితి లయాత్మకమైన శక్తి సంయోగం చేతనే శివ్ఞడు ‘కర్త-కర్మ అవుతున్నాడు.

లింగనేది పార్వతి లింగం శివ్ఞడు,ఈ జగత్తుకు తల్లిదండ్రులు. లింగాన్ని అర్పించడమంటే మాతాపితురులను అర్పించినట్లే బ్రహ్మ విష్ణురుద్రాత్మకమైన పరంజ్యోతిస్వరూపమే శివలింగమని శాస్త్రాలు వచిస్తున్నాయి. లింగార్చనకు మించిన సాధన లేదు. సమస్తపాపాలను భస్మం చేసి ఇహపరభోగాలను అందించి కడప శివసాయుజ్యాన్ని ప్రసాదించే శక్తి లింగార్చనకు ఉంది. కాళిదాసు నుడివినట్లు ‘వాగార్ధసంప్త్రుకౌ వాగర్భములవలే కలిసియున్న పార్వతీ పరమేశ్వరులను అర్పించాలి. ఇంకా ఏమన్నాడంటే- ఏమిలేనివాడైనా సంపదలునిచ్చేవాడు, శ్మశానవాసియైనా త్రిలోకనాధుడు,భయాంకర రూపం కలవాడైనా మంగళస్వరూపుడు శివ్ఞడు శివ్ఞని యదార్ధ స్వరూపం తెలిసినవారు లేరు. అన్నాడు. వేదస్వరూపుడు,సంసార జనిత దుఃఖాలను హరింపజేసేవాడు,శాంతుడు,శంభుడు,శుద్ధుడు,మంగళకరుడు సదాశివ్ఞడు అట్టి మంగళమయ జీవితాన్ని ప్రసాదించే శివ్ఞని మహాశివరాత్రినాడు పనసారా ప్రార్ధిద్దాం తత్ప్రణమామి సదాశివలింగం.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...