*సత్యవాక్పరిపాలకుడు శ్రీరాముడు*
”రకారం అంటే అజ్ఞానం, మాయ అని ”మ అంటే వాటిని నిరోధించేదనీ, అదే జ్ఞానమనీ, ”రామ శబ్దానికి అర్థం చెబుతారు పండితులు. జ్ఞానులు! పరబ్రహ్మ వాచకమే రామశబ్దమంటారు ”తత్వజ్ఞులు. నిత్యమూ క్షణం సేపైనా రామనామాన్ని ఉచ్ఛరించేవారు సమస్త సిద్ధులనూ పొందుతారని విశ్వామిత్ర సంహితలో చెప్పబడింది. రామనామస్మరణతో సమస్త పాపాలూ పరిహరింపబడతాయట. భగవంతుని నామాలు ఎన్ని ఉన్నా అత్యంత మహిమాన్వితమైనది ”రామనామం. నారదుడు ఒకసారి భగవంతుని వద్దకు వెళ్లి తరింపజేసే నామాన్ని తెలియజేయమని అడుగగా, ఇతర నామముల కన్నా శ్రేష్ఠమైన రామనామాన్ని నిర్మించి ఇచ్చినట్లుగా ”తులసీదాసు అన్నాడు. నారదుడు దాన్ని ప్రచారం చేశాడు. పరమశివ్ఞడు కాశీనగరంలో భవానీతో కలిసి నివసిస్తూ, అక్కడ మరణించే వారి చెవిలో రామనామాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని అంటారు.
రామా! నీ నామాన్ని పలికినంతనే మహాపాపియు పవిత్రుడవ్ఞతాడని మహర్షులు అన్నట్లు పురాణవచనం. ”రామోవిగ్రహాన్ ధర్మః శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మమే. పుత్రునిగా, సత్యవాక్‌పరిపాలునిగా, శిష్యునిగా, భర్తగా, రాజుగా వీరాధివీరునిగా, స్నేహశీలిగా, భక్తజనసంరక్షకునిగా ఆయన ఆదర్శపురుషుడు. తల్లిదండ్రులందరూ తమ పుత్రులు శ్రీరామునిలా ఉండాలని, ప్రతి భార్యా తన భర్త రాముని వంటి పవిత్ర మూర్తియై ఉండాలని కోరుకుంటారు. ప్రతీ భారతీయుడూ రామనామస్మరణ చేస్తూ, ఆయనను పూజిస్తూ, తన జన్మను సార్థకం చేసుకుంటాడు. పరిపాలకులు ఆ ప్రభువ్ఞను ఆదర్శంగా తీసుకున్ననాడు దేశం సుభిక్షమై, రాజ్యం రామరాజ్యంగా భాసిల్లుతుంది. రామయ్యతండ్రి జన్మించినది చైత్ర శుద్ధ నవమినాడైతే, ఆయనకు సీతమ్మ తల్లితో పెండ్లి జరిగినదీ ఆరోజునేనట. కానీ సీతారాముల పెండ్లి జరిగినది మార్గశిరమాసంలో అని శ్రీరామదాసు వసంత నవరాత్రులు జరుపుతూ రామనవమి ఉత్సవాల్లోనే కళ్యాణం జరిపే ఆనవాయితీని ప్రవేశపెట్టాడని అంటారు.
భద్రాచలంలో ఎలా జరిగితే అదే ప్రమాణం కాదుకదా మరి? భార్యాభర్తల అనురాగానికి, అన్నదమ్ముల అనుబంధానికి ఎంతటి ప్రాముఖ్యత నిచ్చాడో, స్నేహానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చాడు రామచంద్రుడు. పక్షియైనా జటాయువ్ఞకి, అంతిమసంస్కారాలు జరిపి, ముక్తిని ప్రసాదించిన దయాసాగరుడు. ఆటవికుడైనా గుహుడిని, వానరుడైనా సుగ్రీవ్ఞడిని, రాక్షసకులంలో పుట్టినవాడైనా విభీషణుడిని ఆదరించి అక్కున చేర్చుకున్న మహనీయమూర్తి. ధర్మగంటను మోగిస్తే కుక్కకు సైతం న్యాయం చేసిన ధర్మమూర్తి. అమిత పరాక్రమశాలియైన రావణాసురుని సంహరించి, తన సత్య, ధర్మ, ప్రవర్తనను ఉన్నత వ్యక్తిత్వాన్ని లోకానికి చాటిన ధీశాలి. తన ప్రజల అభిప్రాయాన్ని తలదాల్చి తాను ప్రాణ సమానంగా ప్రేమించే ఇల్లాలిని పరిత్యజించిన త్యాగమూర్తి. ఇలా ఇన్ని సుగుణాలు ఒకే వ్యక్తిలో ఉండడమనేది రామచంద్రునికే చెల్లింది. మధురంగా మాట్లాడేవాడు, శాంతచిత్తుడు. వీరాధి వీరుడైనా అహంకారం లేనివాడు. కనుకనే ఈనాటికీ ఆయనను పూజిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. రాముని గుడిలేని చిన్న పల్లె కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment