శంభో...
నీ నామస్మరణ లేని క్షణం అనవసరం..
నీ ఆలోచన లేని తెలివి నిరర్థకం...
నీ జపం లేని తపం నిష్ఫలం...
నీ నవ్వు లేని దర్శనం అసంపూర్ణం...
నీ ఎడబాటు లేని భక్తి అపరిపక్వం...
నీ తోడు లేని ప్రయాణమే ఒంటరితనం...
నీ జాడే కనబడని ప్రయత్నం అంధకారబంధురము...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...
No comments:
Post a Comment