శంభో!!!
నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదించిన నీ పాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు...
శివా! నన్ను నరునిగా, వానరునిగా అయినా పర్వాలేదు...
నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను...
పరమేశ్వర నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను...
దేహం ఏదైనా పర్వాలేదు ప్రభు నా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చూడు...
No comments:
Post a Comment