శివా!కష్టాలు కల్పించి మనోధైర్యం పెంచావు
ప్రేమంటె రుచి చూపి భక్తి నాలో పెంపు చేసేవు
సాధన నెరిగించి నాకు సహనాన్ని నేర్పావు
మహేశా ..... శరణు.
శివా!రాకపోకల నడుమ నలిగి పోతున్నాను
ఉగ్రరథమున ఈ సారి ఊరేగినాక
గర్భవాస గండమ్ము తొలగనీయి
మహేశా . . . . . శరణు .
శివా!కనులు తెరిచి నీ కోసం కలవరిస్తున్నా
కనులు మూసుకొని నీ నామం స్మరిస్తున్నా
కామ్యమేమి లేదయ్యా సామీప్యమే చాలయ్యా
మహేశా . . . . . . శరణు.
భయం లేదు నాకు భవ హరా
నేను భద్రంగా ఉండేది నీ నీడనే కదా
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment