Sunday, April 30, 2023

శివోహం

నీతలపే నాబలం...
నీ నామమే నాకు వరం...
నీ చూపులే నామార్గమై...
ని మౌనమే  నాకు సంకేతమై...
నీ కరుణ యే నాకు అర్హతయే...
నీ సేవయే నాకు ఆరాధనా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అమ్మను నీవు సగమైతే అర్ధనారీశ్వరం
హరిని కూడి నీవుంటే హరిహర ప‌రబ్రహ్మము
నేను నీవు వొకటైతే మరి కానరాదు భేదము
మహేశా . . . . . శరణు .

శివోహం

నీ మహిమలు విని కీర్తించి స్మరించినాను...
నీ స్వరూపనికి నమస్కరించి, అర్ధించినాము...
నా మనస్సులోని భక్తి భావాన్ని నివేదించినాము...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

Saturday, April 29, 2023

శివోహం

*కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృత్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే*.

*మనస్సు ద్వారా అభ్యాసయోగం చేయలేనివారు శరీరంతో భగవంతుని కొరకు కర్మలు చేస్తూ క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. మొత్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారితీస్తుంది.*

*ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరాదు. వారివారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను (సాధనలను) చూపితే ఎవరికి కావలసిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు*.

*అయితే ఇక్కడే ఒక సందేహం. అన్నీ భగవంతుని కొరకే చేస్తుంటే మన పనులు ఎవరు చేస్తారు? మనకోసం కొన్ని పనులు తప్పవు గదా! అని. ఐతే - 'అన్నీ మన పనులే చేసుకోవాలి' - అంటే భగవంతుని కోసం పనులు చేయనక్కర్లేదా? అని ఎవరికీ సందేహం రాదు. అన్నీ భగవంతుని కొరకే పనులు చేయండి అంటేనే మరి మన పనులో? అనే సందేహం.*

*సాధారణంగా మన తిండితిప్పల కోసం, సుఖం కోసం, భోగాల కోసం, అవసరాల కోసం కొన్ని పనులు చేస్తుంటాం. ఇవి మన కొరకు చేసే పనులు. ఇక సమాజం కోసం సభలు, సమావేశాలు; దేవాలయాలు, కళ్యాణ మండపాలు కట్టించటం, భావులు త్రవ్వించటం, వృద్ధాశ్రమాలు నిర్వహించటం - ఇవన్నీ సమాజం కోసం. ఇక పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, వేదాధ్యయనం మొ॥నవి భగవంతుని కొరకు చేసేవి. ఇలా 3 రకాలుగా చేస్తుంటాం. అయితే భగవంతుడేమో అన్నీ నాకొరకే(మదర్థం) చేయాలి అంటున్నాడు. ఎలా మరి? మనం చేసే పనులన్నీ మన కోసమైనా, సమాజం కోసమైనా, భగవంతుని కోసమైనా - అన్నింటిని భగవంతుని పనులుగానే చెయ్యాలి. ఎలా? నేను కర్తను, నేనే వీటిని చేస్తున్నాను అనే అహంకారాన్ని - కర్తృత్వ భావాన్ని వదిలి, నా కర్తవ్యం అనుకుంటూ చేస్తే సరి. నావల్లనే ఈ పనులు జరుగుతున్నాయి అనే అహంకారం లేకుండా మనం భగవంతుని చేతిలో పనిముట్టులా చేస్తే అవి అన్నీ భగవత్ కర్మలే అవుతాయి. అన్ని అనర్థాలకు కర్తృత్వమే మూలం.*

*బల్బులు వెలుగుతున్నాయంటే బల్బుల గొప్పతనం కాదు. కరెంటు గొప్పతనమే. కలం కవిత్వాన్ని వ్రాస్తున్నదంటే కలం గొప్పతనం గాదు. దానిని పట్టుకున్న వాడి గొప్పతనమే.*

*అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే వాటి గొప్పతనం కాదు. వాటికి శక్తినిస్తున్న చైతన్యం యొక్క గొప్పతనమే*.

*పరిస్థితి ఇదైతే మధ్యలో మనకు లేనిపోని పెత్తనం - అహంకారం ఎందుకు? అహంకారం విడిచిపెడితే ఆత్మప్రాప్తియే.*

*కనుక కర్మలు చేస్తున్నాం అంటే అవి మనను బంధంలో పడేస్తాయి.*

*కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృత్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే*.

*మన దృష్టిని భగవంతునిపై నిలిపి ఏరకం కర్మలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ భగవత్పరమైన కర్మలే అవుతాయి.*👌


శివోహం

శివా!ఏక బిళ్వార్చన చేసి చేసి
పసి ఎద కుసమం నీ పదము నుంచేను
కూరిమికై కాదు నిన్ను కూడిన చాలు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
మరులుగొన్న నీరూపం తో నా మనసంతా నిండిందీ 
నా మనసు లోలోపల జరుగుతున్న కోలాటపు సందడిలో నువ్వేలా నిండావో తెలియదు కాని 
నామదిలో నీఆటల గారడిలో మురిసిందీ సర్వేశ్వర...
మహాదేవా శంభో శరణు.

Friday, April 28, 2023

శివోహం

పార్వతి పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు....
అన్యోన్య దాంపత్యనికి ఆదర్శ మూర్తులు...
పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే...
అమ్మ వారు విజయాన్ని చేకూరుస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ...
నీ మహిమ తెల్వదు...
నా పశుబుద్ధి మారదు...
నా జన్మసార్ధకం ఎదో తెలుసుకోలేక బ్రతికేవున్నా...
సృష్టి కర్తవు నీవు నీ ఉద్దేశ్యం నాకర్ధం కాదు...
నిన్ను చేరా నా ప్రయత్నం మారదు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఆనందం బ్రహ్మానందం పరమానందం విజయానందం సదానందం గోవిందం....
కృష్ణం ప్రేమానందం మాధవం మధుసూదనం సర్వేశ్వరం గురుం ఈశ్వరం  సకలేశ్వరం...
నారాయణం వాసుదేవం శివం శాంతం 
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే...
ఓం నమో నారాయణ..
ఓం నమో శ్రీకృష్ణపరమాత్మనే నమః.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, April 27, 2023

శివోహం

శివా!జనన మరణ బంధమెంత దృడమో
ఎన్ని జన్మలైన వీడకుంది ఈ బంధం
వేడుకుంటున్నా విడదీయవయ్యా 
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!వాదములన్నీ విడిచిపెట్టి
శోధన కొరకే సాధన చేస్తున్నా
నా వేదన వినమంటున్నా .
మహేశా . . . . . శరణు

శివోహం

శంభో...
ఎన్నిసార్లు మీ ముందర మోకరిల్లినా ఇచ్చిన ఋణం తీరిపోవునా...
ఎన్నిసార్లు చక్కని పూలతో అలంకరణ చేసినా చల్లని మీ చూపుల స్పర్శకు సాటిరాగలదా శివ...
విధిగా ఆలయ పరిసరాలు శుభ్రం చేసినా మీ సన్నిధిలో పొందిన మనశ్శాంతి మరెక్కడైనా దొరుకునా...
ఏది చేసిన,  ఏమి ఇచ్చినా అవన్నీ నీవు ఇచ్చిన భిక్షయే ప్రభూ....

మహాదేవా శంభో శరణు.


శివోహం

శివ...
నువ్వు ఆడించే ఆట నే అడలేను...
చేతికి సంకెళ్లు వేసీ పాప పుణ్యాలు చేయిస్తుంటావు...
మనస్సుకు శాంతి కల్పించకా మమ్ము ఆడిస్తూ ఉంటావు...
చలి కల్పించీ సుఖం ఇచ్చేటి వేడితో కల్వ మంటావు...
సంసార పోషణకూ, సంపద కొరకూ, తిప్పు తుంటావు...
భోగవిరాగముల చుట్టూ తిప్పి సంతోష పడతావు...
అడలేను శివ నీ ఆట అడలేను.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నా జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు...
సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు...
పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే...
మహాదేవా శంభో శరణు.

Wednesday, April 26, 2023

శివోహం

శివ...
నువ్వు ఆడించే ఆట నే అడలేను...
చేతికి సంకెళ్లు వేసీ పాప పుణ్యాలు చేయిస్తుంటావు...
మనస్సుకు శాంతి కల్పించకా మమ్ము ఆడిస్తూ ఉంటావు...
చలి కల్పించీ సుఖం ఇచ్చేటి వేడితో కల్వ మంటావు...
సంసార పోషణకూ, సంపద కొరకూ, తిప్పు తుంటావు...
భోగవిరాగముల చుట్టూ తిప్పి సంతోష పడతావు...
అడలేను శివ నీ ఆట అడలేను.
మహాదేవా శంభో శరణు.

Tuesday, April 25, 2023

శివోహం

మంచి చెడుల 
మాయ తెలియని 
సుఖ దుఃఖాల 
స్పర్శ తెలియని ...

రాగ ద్వేషాల 
రోజు తెలియని 
కలిమి లేముల 
కాలం తెలియని ...

నీ కైలాసాన్ని 
ప్రసాదించు తండ్రీ ...

శివోహం  శివోహం

శివోహం

శివా!ఆది భిక్షుని చేరి అడుగుచుంటి
జ్ఞాన భిక్షను నాకు ఒసగమంటి
క్షమా భిక్షను కోరి శరణమంటి
మహేశా ..... శరణు.

Monday, April 24, 2023

శివోహం

కాలు కదిపితే ఆటట...
నీ కన్ను తెరిస్తే మంటట...
నీ నాటకాన మేమంతా నటులట...
ఒట్టు ఒట్టు మేమంతా వట్టి చీమలమట...
ఈ ఆటయ్యాక చేరేది నీ గూటికేనట...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!స్పురణ, స్మరణ,కరుణ
అన్నింటా వెలిగేవు వెన్నంటి మసలేవు
వేయి నామాల మాకు వేల్పువైనావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో!!!ఈ మాయామోహ జగత్తులో...
సంసారం అనే సముద్రంలో వివశులై...
దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు...
మానవజన్మ ఉద్దరణకు కావలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని నువ్వే కలుగజేయాలి...

మహాదేవా శంభో శరణు...

Sunday, April 23, 2023

శివోహం

శివా!కొత్త జన్మలు కోరు కర్మలున్నాయి
పాత కర్మల ఫలము పండివున్నాయి
కర్మ ఫలములు కడతేర్చి కావుమయ్యా
మహేశా . . . . . శరణు .

Saturday, April 22, 2023

శివోహం

సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే
భయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే.

దుర్గా అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ,
ఆ నామానికిగల శక్తి అంతా ఇంతా కాదు.
సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు.
ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన సమస్త పాపాలు హరించబడతాయి.

అందుకే అంటారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం దుర్గాదేవినే నమః

శివోహం

పరమేశ్వరుడిని తప్ప తక్కిన దేవతలను కొలుచుట వలన ప్రయోజనం లేదు....
నిష్ఫలం కూడా..
సర్వేశ్వరుడిని వేడుకో...
చింతలు తొలగించుకో 
అన్యుని కొల్చినా ఫలితంలేదని తెల్సుకో...
ఎంత ఎగిరినా నేలను విడువవు మిత్రమా...
వరదలో చింతపండులా అవుతావు...
శివుడొక్కడే రక్షించునని తెలుసుకో
ఏ ఒక్కరూ రక్షించరని తెలుసుకో..
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

తల్లివి తండ్రివి నివే సకల దేవతలకు,మానవులకు...
సప్త ఋషులు, ప్రతి  ఒక్కరు మ్రోక్కెదరు నిపాదాలకు...
బ్రహ్మాండ లోకములన్ని నీనోటిలోచూపావు యశోదకు...
శ్రీహరి శరణు.

ఓం నమో వెంకటేశయా.
ఓం నమో కృష్ణపరమాత్మనే నమః.

శివోహం

జీవుడు ప్రపంచాన్ని గురించి అనేక భ్రమలలో ఉంటాడు....
ఎందుకు, మనఃశాంతికి మార్గం తెలుసుకోలేకున్నాడు

క్షణం మోనం, క్షణం జ్ణానం ఎందుకు పనికొస్తుందంటాడు...

ఈ ప్రపంచం సత్యమనుకుంటాడు.
ఇందులోని వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ నిత్యమైనవి అనుకుంటాడు...

ఇవన్నీ తనకు ఎంతో ఆనందాన్నిస్తాయి అనుకుంటాడు....

అందుకే వీటికోసం అర్రులు చాస్తూ ప్రపంచంలోనికి పరుగులు తీసి, ఎన్నో కష్టనష్టాల కోర్చి వాటిని సంపాదించుకుంటాడు, అనుభవిస్తాడు

వాటివల్ల ఆనందం పొందినట్లే పొంది చివరకు దుఃఖాన్ని పొందుతాడు.

ఇక తన గురించి కూడా భ్రమలలో ఉంటాడు.

తాను దేహమే అనుకుంటాడు.

లేదా దేహాన్ని ధరించిన జీవుణ్ణి అనుకుంటాడు.

తాను సుఖాలు, భోగాలు అనుభవించటానికే పుట్టా ననుకుంటాడు.

తాను శాశ్వతంగా ఉంటాననుకుంటాడు. రోజూ ఎందరో చనిపోతున్న…

జీవుడు ప్రపంచాన్ని గురించి అనేక భ్రమలలో ఉంటాడు.

ఎందుకు, మనఃశాంతికి మార్గం తెలుసుకోలేకున్నాడు

క్షణం మౌనం, క్షణం జ్ణానం ఎందుకు పనికొస్తుందంటాడు

వీరిని మార్చే శక్తి నీకే ఉంది కదా పరమేశ్వరా...

Friday, April 21, 2023

శివోహం

శంభో...
నాకళ్లలో శాశ్వతముగా  నిలిచిపోనీ
నీ మోహనరూపం...
నామనో భావంలో చిత్రితమైన నీస్వరూపం ఎంతో అద్బుతం...
నా హృదయంలో నీ రూపాన్నీ నిలుపుకొను భాగ్యం కలిగించు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నాకళ్లలో శాశ్వతముగా  నిలిచిపోనీ
నీ మోహనరూపం...
నామనో భావంలో చిత్రితమైన నీస్వరూపం ఎంతో అద్బుతం...
నా హృదయంలో నీ రూపాన్నీ నిలుపుకొను భాగ్యం కలిగించు...
మహాదేవా శంభో శరణు.

Thursday, April 20, 2023

శివోహం

మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు  అనిత్యమైన సుఖాల  కోసం  తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.
ఇన్నాళ్లు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు నాది కాదు
అంతా పరమాత్మే నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి.
మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

 మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని   వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.
మనలోనే ప్రపంచం ఉంది, పరమాత్మా ఉన్నాడు. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు.  బంధం, మోక్షము  కూడా మనలోనే ఉన్నాయి. అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది.

శివోహం

శివా!నీటి బుడగను మనిషిగ జేసి
మనిషి జీవితం నీటి బుడగగ జేసి
లీలగా జూపేవు ఖేలిగా మలిచేవు
మహేశా......శరణు.

శివోహం

జీవం నీవే..
నా ప్రాణం నీవే...
నాలేని ప్రతి అణువు నీవే...
ఈశ్వరా...
కనరారా నాకు కనులారా...
ఇంక చాలురా ఇన్ని జన్మలు 
నిను చేరుటకై వేచి చూసి...
ఇకనయినా కరుణించు నాన్నా 
నామీద...
నీదయ ...
నీ దయకై...
ఎదురుచూసే నీ శివుడు...

మహాదేవా శంభో శరణు.

ఓం నమో నారయణాయ

బాధలలో నున్నవారికి చుట్టము దేవుడే. 🌻*

నిద్రపోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.

బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.

అట్టివారు ఒకరియందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.  

నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.

Wednesday, April 19, 2023

శివోహం

శివా!విశ్వాని నాకు తెలియజేసావు
నన్ను విశ్వానికి తెలియజేసావు
విశ్వనాథా మరి నిన్ను తెలిసేదెలా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ చరాచర సృష్టిని లయం చేసేవాడు శివుడు. ఆ మహాదేవుడు కరుణాంతరంగుడు. కోరిన వారికి లేదనకుండా వరాలిచ్చేవాడు. అందుకే భోళా శంకరుడిగా ప్రసిద్ధుడు. శివదర్శనం ముక్తిదాయకం. శివనామం కళ్యాణ కారకం. ‘శం’అంటే మేలు అని అర్థం. ‘కర’అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడయ్యాడు’. ఆ స్వామి సర్వాంతర్యామి. భక్తితో ఆర్తిగా పిలిస్తే వచ్చి ఆదుకుంటాడు. అభీష్టాలన్నీ నెరవేర్చి అక్కున చేర్చుకుంటాడు. శివుడు అభిషేక ప్రియుడు.
భక్తితో రెండు చుక్కలు నీటిని విదిలిస్తే, అమితంగా సంతోషపడిపోతాడు. ఆ కారణంగానే ‘అభిషేక ప్రియ శివః’ అంటారు. శివుని శిరస్సుపై కాసిని నీళ్లు చల్లి, కొంత పత్రిని వేసినంత మాత్రాన కామధేనువు వారి ఇళ్ళల్లో గాటకట్టిన పశువవుతుందని, దేవతా వృక్షమైన కల్పతరువు వారి ఇళ్ళల్లోని పెరటిలో మల్లె చెట్టు అవుతుందని పురాణోక్తి.
ఆ దేవాది దేవునికి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలనిస్తుందని శాస్త్ర వచనం. లయకారుడైన పరమేశ్వరుడ్ని ఆవు పాలతో అభిషేకం చేస్తే, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయంటారు. అలాగే ఆవు పెరుగుతో చేసే అభిషేకం కీర్తిని, ఆరోగ్యాన్ని, బలాన్నిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకంచేస్తే ఐశ్వర్యవృద్ధి జరుగుతుంది. తేనెతో చేసే అభిషేకం తేజస్సును వృద్ధి చేస్తుంది. పంచదారతో చేస్తే దుఃఖాలు నశిస్తాయి. ఈ పూజావిధులవల్ల ఇన్ని విశేషాలుండడంవల్లే ‘పంచామృతాభిషేకం’ విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ధనం వృద్ధి పొందాలనుకునేవారు
స్వామిని చెరకు రసంతో అభిషేకించాలట. అలాగే సర్వసంపదలు వృద్ధిపొందడానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భస్మజలంలో అంటే విభూతిని నీటిలో కలిపి అభిషేకం చేస్తే మహాపాపాలు సైతం పటాపంచలైపోతాయట. పుష్పాలతో చేసే అభిషేకార్చన భూ లాభాన్ని, బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలనిస్తుందంటారు.
అలాగే అపమృత్యుభయంతో బాధపడేవారు శివుని నువ్వుల నూనెతో అభిషేకం చేయాలట. రోజూ ప్రాతఃకాలంలోనే నిద్ర లేచి, శుచి శుభ్రతలను పాటించి, పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే, సంతుష్టాంగుడైన ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. వైరాగ్యంతో జ్ఞానసిద్ధిని పొందాలనుకునేవారు నేరేడు పండ్లతో శివుని అభిషేకించాలి. శివుడు ఆదియోగి... ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలకు, జ్ఞాన సముపార్జనకు పాత్రులు కావడానికి నేరేడుపండ్ల రసంతో అభిషేకం ఉపయుక్తమవుతుందంటారు. స్వామిని పసుపునీళ్ళతో అభిషేకిస్తే సకల శుభాలు కలుగుతాయట. పసుపు శుభ సూచకం.
అలాగే శివుడు కూడా శుభప్రదుడు కావడంవల్ల పసుపు నీళ్ళతో చేసే అభిషేకం ఆ దేవాదిదేవుని సంతుష్టాంగుడ్ని చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చర్మ వ్యాధులు, రోగాలు కలవారు శివుని మామిడి పండ్లతో అభిషేకిస్తే చర్మవ్యాధులు మటుమాయమై, శరీరకాంతి ఇనుమడిస్తుంది. చర్మరుగ్మతలన్నీ పోయి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. నవరత్న జలాభిషేకం ధన ధాన్య పశు పుత్ర లాభాన్ని, కస్తూరికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని, ద్రాక్షపండ్లతో అభిషేకం కార్యక్రమ విజయాలను చేకూర్చి పెడుతుందట. అలాగే అన్నంతో అభిషేకం ఆయుష్షు పెరిగి, సుఖవంతమైన జీవనం సంప్రాప్తిస్తుంది.
సువర్ణోదకాభిషేకంవల్ల దారిద్య్రం పటాపంచలై, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. రుద్రాక్షోదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని, గరిక నీటితో చేసే అభిషేకంవల్ల వస్తువాహన వృద్ధి కలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. అయితే ఆయా వస్తువులు, ఫలాలు, పుష్పాలు, రసాలతో చేసే అభిషేకం వల్లనే శివుడు సంతుష్టి చెందుతాడా? అనే ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే దొరుకుతుంది. శివుడు మనోకారకుడు. ధర్మప్రబోదాత. ఎక్కడ ధర్మం నాలుగు పాదాల నడుస్తుందో అక్కడ కొలువై వుంటాడు. ఆత్మకారకుడైన ఆ స్వామిని, పాలంత స్వచ్ఛమైన మనస్సుతో అభిషేకిస్తూ, కోరినవన్నీ అనుగ్రహిస్తాడు. ఆత్మే అన్నింటికీ మూలం. ఆత్మతో చేసే పూజ సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి చేరుతుందని పురాణ వచనం.
అందువల్ల మనోకారకుడైన ఆ మహాదేవుడ్ని నిశ్చల నిర్మలమైన మనస్సుతో అభిషేకించి పూజిస్తే సద్గతులు ప్రసాదిస్తాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యుడు, భక్తకన్నప్ప, భక్త మార్కండేయుడు లాంటి ఎందరో భక్తులు శివుని నిర్మలమైన మనస్సుతో పూజించి, శివ కైవల్యాన్ని పొందినవారే. చివరికి శ్రీరాముడు సైతం శివుడ్ని భక్తితో పూజించి తరించాడు.
శివనామస్మరణం సర్వపాప హరణం... భక్తిముక్తిదాయకం... పవిత్రమైన మనస్సుతో శివనామస్మరణంతో చేసే పూజలన్నీ శివునికి చేరి ఆత్మబలం ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆ మహాదేవుని కరుణకు పాత్రమవుతుంది.

శివోహం

ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు.
ఆయనే భగవంతుడు.
పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే.
మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం.
పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు.
కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు.
నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి
నీవు నిశ్చింతగా వుండు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   
కార్మా కర్త క్రియా చెయు ధర్మాలివి     

శాంతి కలవానికి పాపము రాదు   
విరక్తి కలవానికి భయం లేదు
గురుసేవ చేసేప్పుడు కోపం రాదు 
సత్య బోధకులకు దోషం ఉండదు...

పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు 
ఆశ లేని వానికి అలుపు రాదు  
జ్ఞాన మున్నవానికి దుఃఖము లేదు 
మౌనం పాటిస్తె ఏది కలహం కాదు...

సమదృష్టికి చలించటం ఉండదు
నిర్మల మనస్సుకు లోపం తెల్వదు   
వేంకటేశా అనిన మాయ ఉండదు 
జీవితంలో సుఖమే భారం తెల్వదు...

ఓం శివోహం...సర్వం శివమయం.

Tuesday, April 18, 2023

శివోహం

శివా!ఈ ఉపవాస వాసము ఎన్నాళ్ళు
నిజ వాసమును చేర నాకు ఇంక ఎన్నాళ్ళు
బదులు చెప్పగ నీవుకాక ఇంకెవరు .
మహేశా . . . . . శరణు .

Monday, April 17, 2023

శివోహం

శివా!నీ నామమె మననము
అదే తారక మంత్రము
చేయునిమ్ము భవ బంధ నాశము
మహేశా . . . . . శరణు .

Sunday, April 16, 2023

శివోహం

శివా!ఫలాపేక్షలు నాలో పటాపంచలవనీ
ఆపేక్షలు నాలో అంతమవనీ
నిటలాక్షా నేను నీలో లయమైపోనీ
మహేశా . . . . . శరణు .

Saturday, April 15, 2023

శివోహం

హనుమంతుడు మహా బలశాలి
మనసును మించి పయనించు ధీశాలి

జ్ఞానములోన జగతిని మిన్న
సంగీతమున సర్వులకు మిన్న
వాక్కులలోన వాగ్ధేవి సుతుడు
చేష్టలందున చెలిమికి హితుడు

కార్యశూరుడు కర్మ వీరుడు
కామ్యములన్నవి ఎరుగని వాడు
నిర్మల చిత్తుడు నిష్టా గరిష్టుడు
నింగిని నేలకు తేగల ధీరుడు

బ్రహ్మ వరమును పొందినవాడు
బ్రహ్మచర్యమున ఘనుడితడు
అందరి మన్నలందిన వాడు
ఆత్మ విశ్వాసమున అధికుడు ఇతడు

స్థిర చిత్తముతో మసలెడి వాడు
చిరంజీవిగా స్థిరమయినాడు
పూజలు చేసిన పూజ్యనీయుడు
రాగల యుగమున కాగల బ్రహ్మ

శివోహం

శివా!నీ సూర్య నేత్రము విరిసిందా వికాసము
నీ సోమ నేత్రము విరిసిందా అమృత వర్షము
నీ అగ్ని నేత్రము విరిసిందా జ్ఞానానందమే
మహేశా . . . . . శరణు .

Friday, April 14, 2023

శివోహం

భగవత్ సన్నిధికి చేరుకొనుటకు నామస్మరణ ఎంతటి ముఖ్యమో సేవలు కూడా అంతే ముఖ్యం. నామస్మరణ , సేవలు ఈ రెండూ రైలు పట్టాల వంటివి. కేవలం ఒక పట్టా మీదుగా పోతే రైలు తన గమ్యస్థానం చేరుతుందా?  రెండు పట్టాలు మీదుగా వెలితేనే గమ్యస్థానం చేరుకొగలదు. అదే విధముగా మనం భగవత్సన్నిధికి చేరుకోవాలంటే నామ స్మరణతో పాటు  సేవలు కూడా చేస్తుండాలి. అపుడే ప్రయాణం సులభమౌతుంది. శీఘ్రముగా భగవంతుని సన్నిధికి చేరుకొనుటకు అవకాశం ఉంటుంది.

ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నాకు స్మరణము నీవే
నాకు స్పురణయు నీవే
సకల దుఃఖ హరణమూ నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ దేవుడు గొప్పవాడా...
ఆ దేవుడు గొప్పవాడా...
లేదా దేవత గొప్పదా?  భక్తి మార్గం గొప్పదా...
ధ్యాన మార్గం గొప్పదా?
ఈ మంత్రమా ఆ మంత్రమా ఏది గొప్పది?
రాముడా... శివుడా... కృష్ణుడా... అమ్మవారా...
ఈ మీమాంస వద్దు...
అందరూ  ఏకదైవమైన పరబ్రహ్మ వ్యక్తరూపాలే...
ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే...
అలానే, అన్ని మార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం మార్గ నిర్దేశం చేసినవే...
అన్ని భగవంతుని అనుగ్రహసారం వచ్చినవే...
ఏది ఎక్కువా కాదు, ఏది తక్కువా కాదు...
ఎవరి అర్హతకు అణుగుణముగా వారిని ఆ మార్గంలో నిలుపుతాడు...
ఎవరిని ఆరాధించిన, ఏ మార్గాన్ని అనుసరించిన చివరికి అనంత హృదయవాసంలో అణగవలసిందే.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, April 13, 2023

శివోహం

శివా!నీ అడుగులకు నే మడుగులొత్త
నీవు అడుగు తీసి అడుగు వేయగలేవే
మరి నా కోరిక తీరేది ఎలా....?
మహేశా . . . . . శరణు .

శివోహం

అవగాహన అనేది అంతరంగం నుండి జనిస్తుంది. పవిత్ర ఆధ్యాత్మిక అవగాహన అనే జలం మన స్వభావాన్ని ప్రక్షాళనం గావిస్తుంది. 

ఇది నిజమైన అవగాహన అయినప్పుడే సాధ్యం. కానీ సిద్ధాంతంగా కాదు. ఇది భగవత్ సాక్షాత్కార ఫలితంగా అనుభవంలోకి వస్తుంది. 

జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ఇక సందేహాలకు, ప్రశ్నలకు తావేలేదు. ఆ పై మనలో అనుమానాలు అంచనాలు ఉండవు. 

ఒక నూతన చైతన్యం మనలో ఉదయించి తద్వారా అమరమైన సత్యాన్ని అవగాహనకు తెస్తుంది.

Wednesday, April 12, 2023

శివోహం

నా మనస్సు ఒక కోతిలాంటిది...
దానికి స్థిరం తక్కువ...
కోతి అడవుల్లో తిరిగితే...
నామనస్సనే ఈ కోతి ఎల్లప్పుడు మోహం అనే అడవుల్లో తిరుగుతు ఉంటుంది....
ఇది చాల చంచలమైనది....
తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతో ఉంటుంది...
నా స్వాధీనంలో లేదు....
దాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు సాధ్యం కావడం లేదు...
నేను అశక్తుణ్ణి నువ్వు నా మనస్సు అనే కోతిని భక్తి అనే పగ్గాలతో గట్టిగా బంధించి నీ అధీనంలో ఉంచుకో...
నీకు భుక్తి నాకు ముక్తి రెండూ లభిస్తాయి.
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీ చెలిమి మించిన కలిమి
"నేను"మించిన నిత్యము
కలవా కలనైనా పరమునైనా
మహేశా . . . . . శరణు .

Tuesday, April 11, 2023

శివోహం

'శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు.ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదే ‘శివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ.కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు.మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది.వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటిరావడం ప్రారంభిస్తాయి.ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు.అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు ‘సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు’ అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనేశివుడయిపోయి ఉంటాడు.అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతోజాగ్రత్తగా చెప్పింది.మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికిఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమునుమీరు చదివినట్లయితే -నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చనమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చనమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చనమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చనమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈశివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమఃకపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగాఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి''నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడోఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమైమనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువులవరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలోఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినిముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూకాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులైశృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం –యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు.కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూఉండాలి.గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగావస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంతభద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలంబవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగానవనీమండలిలోపలన్శివ శివే త్యాభాషణోల్లాసికిన్శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటిశ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి,అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదోదాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

ఆ మాయ మంచిదే!...



నిస్సారమైన, నిరుపయోగమైన, నిత్యం కాని, సత్యం కాని, భ్రాంతుల కోసం సర్వం త్యాగం చేసి, ప్రేమించి.. అలమటించడం లోకంలో చాలామందికి సహజం. ఈ మాయలోపడి పరిభ్రమించడానికి కారణం అవిద్యే! భగవంతుడిపై చింతన, ఆయన బోధనలు వినాలనుకోవడం, సారాంశం కోసం పరితపించడం విద్యామాయ.

ఈ మాయలోపడిన భక్తుడు తప్పకుండా ధన్యుడు అవుతాడు. భగవంతుడి గురించి చింతించే ప్రతి మనిషీ పవిత్రుడే! ఎన్ని కష్టాలు వచ్చినా.. ఆ విద్యను అభివృద్ధి చేసుకుంటూ సార్థకతను సాధించిన వాళ్లు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటారు!

శివోహం

కష్టసుఖాల రెండింటికి....
కరిగిన గుండె....
కన్నీళ్ళని కురిపిస్తోంటే....
కోరికల బరువును తాళలేక....
కస్సుమని ఉబికి వస్తోంటే....
నీకు కమ్మగా ఉందేమో నా కన్నీరు....
అదే నీకు జలాభిషేకమనుకో తండ్రీ ...
మహేశా శరణు శరణు.......

శివోహం

శివా!కడలి కెరటాల బంధం మనది
ఎగిరి ఎగిరి ఎడమౌతున్నా
ఎటూ ఏకం అవుతూనే ఉంటాము
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...