Wednesday, November 29, 2023

శివోహం

శివా!నీ కంటిలోన మంట ఆరదు
నీ గొంతులోని విషము జారదు
నీ కరుణ కురియుట ఆగదు.
మహేశా . . . . . శరణు .

Tuesday, November 28, 2023

శివోహం

శివ...
జానెడు పొట్ట నింపుకోవడం కోసం
పాట్లుపడుతూ జాలిగా నాలో నిన్ను చూసుకుంటూ ...

నీకు దూరమైపోతున్నానేమోనని‌,
గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తుని ఊహించుకుంటూ...

మధ్యమధ్య క్షణాలలో 
మహాదేవా, నమఃశివాయ అనుకుంటూ 
ఏదోలా‌ ఉబుసుపోక కాలం వెళ్ళదీస్తూ ఉన్న నన్ను మన్నించు మహాదేవా శంకరా నను మన్నించు.

మహాదేవా శంభో శరణు.

Monday, November 27, 2023

శివోహం

శివ...
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు ఈ జన్మకైనా మరే జన్మకైనా నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి నీచెంతనే నిలిచేలా అనుగ్రహించు
ఆ భారము బాధ్యత నీదే హర.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కోరచెప్పుల నూడ్చి పుక్కిట నీళ్ళు పోసి
ఆరగించగ నీకు మద్య మాంసములు  పెట్టు
జ్ఞాన అజ్ఞానములు నాకు లేవు మన్నించు
మహేశా . . . . . శరణు

శివోహం

శంకరా... 
శత సహస్ర నామాలతో అర్చించాలని తలచి
ఈ మూడు అక్షరాల వద్దే నా మనసు నిలిచి
వాటి మాధుర్యంలో ఓలలాడుతూ 
ముక్కంటిని తలుచుటకు ఈ మూడు చాలదా అని పరవశించింది...
ముల్లోకాల ఉనికి సైతం నిక్షిప్తమైన ఓంకారం 
నీ నామమే కదా.
మహాదేవా శంభో శరణు.

Sunday, November 26, 2023

శివోహం

ఉయ్యాల కి ఊరేగింపు కి మధ్యలో ఎన్ని బంధాలో...
ఈ ఊపిరి పోసినవాడు ఎవరు రేపు ఊపిరి తీసేవాడు అనే ఎరుక లెకుండా ఊపిరి సలపని బంధాలలో బందీ చేస్తావు...
నీవు గొప్ప మాయగాడివి సుమీ...
నీ మాయ ముందు మేము ఎంతటి వాళ్ళము...
ఈ మాయ నుంచి బయటకు వచ్చేలా అనుగ్రహించు తండ్రి....
నీకు శతకోటి వందనాలు...
మహాదేవా శంభో శరణు.

Saturday, November 25, 2023

శివోహం

శివా ! నిను గుర్తు చేసుకునే క్షణంలో 
నన్ను నేను మరిచిపోతాను 
నన్ను నీవు గుర్తు చేసుకునే క్షణం కోసం 
అనుక్షణం నీ కోసం నను నేను మరిచిపోతాను 
శివా ! నీ దయ

శివోహం

జీవితంలో  ప్రతి  ఒక్కటి పరమాత్మా  అనుగ్రహంతో  ఇవ్వబడ్డవి...
తల్లి  తండ్రులు , భార్య  బిడ్డలు , అస్తిపాస్తులు ఈ  జన్మ నేను  తెచ్చుకున్నది  కాదు , కాబట్టి  ఎప్పుడో  ఒకసారి  మల్లి  తీసేసుకుంటాడు  దేని  మీద  మనకి  హక్కు  లేదు , నేను  తెచ్చుకోలేదు కాబట్టి  ఇది  నాది  అని మమకారం  పెంచుకోవడం  లాంటి  భ్రమ  తగదు...
ఏది నీది కాదని తెలుసుకో ఎదో నాటికీ మనం  ఏంచేస్తున్నాం అన్ని ననావిగా భావించి  బంధించి
బడుతున్నాం...
నాది అంటే బంధము
నాది  కాదు  అంటే  మోక్షము
నాది  అంటే  అపచారము
పరమాత్మా  అంతా  నీది  అంటే ఉపచారము
నాదేది కాదు అన్నీ నీవే పరమాత్మా
నాది అంటే అపచారం
నీది అంటే ఉపచారము
ఏది చేసినా ఆ కర్మ పరమాత్మ కే చెందుతుంది.
నేను నాది అనే రెండు పఫలు  ఈ శరీరంలో ఉన్నంత కలం మృత్యువుతప్పదు.
ఆ నేను నాది అనే భావన తొలగి,
నేను కర్తని కాను పరమాత్మ  కర్త నేను భోక్తని కాను పరమాత్మా భోక్త అనే సత్ భావనతో అన్ని పరమాత్మకే అర్పిస్తే విముక్తిని
పొందుతాడు.
అటువంటి వాడు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు
ఈ లోకంలో మొత్తం కోసం బ్రతికే వాడు దేవుడు, తన కోసం బ్రతికే వాడు జీవుడు.
అటువంటి లోక యుక్తుడు నిజమైన సన్యాసి.
సన్యాసి అంటే ఒక స్థితి అందరి కోసం బ్రతుకుతాడు అన్నిటా పరమాత్మని చూస్తాడు.

ఓం.పరమాత్మనే నమః.

శివోహం

జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన ఈ లోకంలో జీవునికి సుఖ సంతోషాలెక్కడివి...
ఒక్క పరమేశ్వర శరణాగతి లో తప్ప ఎక్కడా ఆనందం కనిపించదు...
ఒంటరిగా లోకంలోకి ప్రవేశించిన మనిషికి ఎవ్వరితోటి సంబంధం కలదు...
మాయా జగన్నాటకం లో బూటకపు సంబంధాలతో వాదులాటలెందుకు? కొట్లాటలెందుకు?మిత్రమా.
భగవన్నామ స్మరణే మనిషికి మోక్షం.
నామ స్మరణ చేయరాదు చేసి తరించరాదు.
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, November 24, 2023

శివోహం

నా శ్వాస ఆగిపోదు
నిన్ను తలవకుంటే

శివ నీ దయ.

Thursday, November 23, 2023

శివోహం

అమ్మవు నీవు....
అమ్మలగన్న అమ్మవు నీవు...

జనవి నీవు.....
జగజ్జననివి నీవు......

తల్లివి నీవు.....
మల్లోకములనేలుతల్లివి నీవు....

మాతవు నీవు....
జీవకోటిని రక్షించు మాతవు నీవు....

అంబవు నీవు జగదంబవు నీవు.....

అమ్మ మాయమ్మ దుర్గమ్మ శరణు.....

శివోహం

కలసిరాని కాలం కాటేస్తున్న...
ఓర్పు మంత్రం పటిస్తూ...
చిక్కటి కష్టాల చీకట్లలోనూ చిరునవ్వులే కార్తీక దీపాలుగా వెలిగిస్తున్న...

శివ నీ దయ.

Wednesday, November 22, 2023

శివోహం

శివా!కొప్పు ముడిని కాలంతో కట్టేవు
జడ చిక్కులలో గంగను పట్టేవు
ఏ ప్రవాహమైన నీ పట్టున జారలేదు
మహేశా . . . . . శరణు .

Tuesday, November 21, 2023

శివోహం

శివా!చంద్ర కాంతులనొప్పె నీ కొప్పు
ఇంద్రజాలము దాటించ నీ ఘనత వొప్పు
ఇది సాధకులకు నీ వొసగు మెప్పు.
మహేశా . . . . . శరణు .

శివోహం

జీవితం అనే స్మశానంలో...
కాలం అనే  కాష్టం లో...
జన్మ కాలి బూడిద అవుతోంది...
మహాదేవా శంభో శరణు....

Monday, November 20, 2023

శివోహం

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శివోహం

శివా ! నీ ధ్యాస లో నాకు ప్రతీ రోజు కార్తీక మాసమే 
నీ శ్వాసలో నాకు ప్రతీ రోజూ శివరాత్రే 
నీ బాషలో ప్రతీ క్షణమూ శివోహమే 
శివా ! నీ దయ

Sunday, November 19, 2023

అయ్యప్ప

హరిహారపుత్ర అయ్యప్ప నీమూర్తికే మొదటి ప్రాణమం.

ఓం శ్రీ స్వామియే శరణం.

శివోహం

మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది 'నేను' అనే తలంపు...
ఇక రెండవది 'నాది' అన్న తలంపు...
మొదటిది అహంకారం...
రెండవది మమకారం...
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!కన్నెరుగని కైలాసం కోరికగా
సామీప్యం చవిచూడ నీ చేరువుగా
మెలగాలని నిన్ను అడగాలని వుంది
మహేశా . . . . . శరణు .

శివోహం

సహనమనే విత్తనం నాటండి, ఏదైనా కార్యం జరగాలి అంటే ఎంతో శ్రమ పడతాం కానీ ఫలితాలు వెంటనే మనకు కనపడవు. ఇలా ఎందుకంటే కార్య సాధన కూడా విత్తనాలు నాటే ప్రక్రియ లాగానే ఉంటు-ంది. బీజం అంకురించడానికి సమయం పడుతుంది. కొన్ని విత్తనాలు వెంటనే అంకురిస్తాయి, మరికొన్ని ఎక్కువ సమయం తీసుకుంటాయి, అలాగే మీ కార్య సాధనకు శ్రమ పడండి, సహనమనే విత్తనాన్ని కూడా పెంచండి. ఓపికగా వాటిని పెరగడం చూడండి, అందమైన పుష్పంగా, మధురమైన ఫలంగా, విశాలమైన వృక్షంగా మారే అద్భుతాన్ని చూడండి.

ఓం నమః శివాయ.

Saturday, November 18, 2023

శివోహం

శివా ! నీవు తిరగడానికి  నా జన్మల కర్మల ముసలి ఎద్దు 
నీవు నా అహంపై గుచ్చడానికి ఓ త్రిశూలం 
నీవు కూర్చోడానికి ఓ పులి తోలు ఆసనం  
నీకు మెడలో అలంకారానికి మా కోర్కెల వలె బుసలు కొట్టే నాగులు 
నీ పుర్రె గిన్నె, నీ నుదిట నా  అహం భస్మపూత 
నీవు నా  కోర్కెలు తెగ నరకడానికి గండ్ర గొడ్డలి 
నీవు నా  ఆరుగురు శత్రువులపై గురి పెట్టె ధనుర్భాణములు 
శివ శివ ఇవి చాలు అయ్యా నీకు 
నీ ఒంటికి, నీ వంటకి, నీ సామను ఇంతే 
ఆనంద రూపుడివై నాలో నిలిచి పోగలవు 
నీవు ఒక అర్ధం కానీ సత్యానివి 
నీవు ఒక శూన్య శేషానివి 
శివా ! నీ దయ

శివోహం

శివా!నీ రూపం గుర్తెరుగుటకు
నీ నామం స్మరియించుటకు
నీ వాసము నా గతి నెరుగుటకు
మహేశా . . . . . శరణు .

Friday, November 17, 2023

శివోహం

శివా !  మరణ భీతి లేని అభయాన్నిచ్చి 
నీ ఆనంద తాండవ అమృత ధారలో 
నను మునుగనీ తండ్రీ 
శివా ! నీ దయ

గోవిందా

చిత్తముతో చింతించు వాడు ముక్తిని పొందు తాడు...
మనసుతో  ప్రార్దిమ్చువాడు మోక్షమును పొందుతాడు...
దాన ధర్మములు చేయువాడు స్వర్గమును చేరుతాడు...
మరణసయ్యపై  శ్రీ శ్రీనివాస అన్నా మరుజన్మలేకుండు వాడు.

హరే గోవిందా...
హరే శ్రీనివాసా.
ఓం నమో వెంకటేశయా.
ఓం శ్రీ క్రిష్ణపరమాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః.

శివోహం

మనం చేసిన తప్పులను గురించి తరచితరచి ఆలోచించడం, మరక పైన మరక వేసుకోవటం లాంటిదే. మనలను మనం నిందించుకుంటూ చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకము చేసుకుంటు-ంటే అవి మరింత గాఢముగా మనలను బాధపెడుతాయి మరియు బలహీనపరుస్తాయి.
తప్పును ఒప్పుకొని దాని నుంచి పాఠాన్ని నేర్చుకున్నప్పుడు మనము సశక్తికరణ చెంది, వివేకముతో, ధైర్యముగా అన్నింటిని దాటు-కొని ముందుకు వెళ్ళగలం. ఈ రోజు నేను తప్పులు చేయకుండా ఫుల్‌ స్టాప్‌ పెట్టి ఉపశమనం పొందుతాను.

ఓం నమః శివాయ.

Thursday, November 16, 2023

అమ్మ దయ

త్రిశక్తి స్వరూపిణి.....
త్రైలోక్య సంచారిణి....
అమ్మలగన్నయమ్మ.....
ముగురమ్మల మూలపుటమ్మ ....
ఇంద్రకీలాద్రిపై స్వయంభువై...
భక్తులను అనుగ్రహిస్తున్నవు.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ దుర్గమ్మ  నీకు వందనం.

ఓం శ్రీమాత్రే నమః
ఓం పరమాత్మనే నమః

శివోహం

శరణం శరణం భవతరణ....
శబరిగిరీశా అయ్యప్ప....
శుభదం శుభదం నీ చరణం...
హరిహరపుత్ర అయ్యప్ప...

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

శివా!ప్రతి పురుషుడులో అప్రకటిత స్త్రీ ఉంది
ప్రతీ స్త్రీలో అప్రకటిత పురుషుడు వుంటాడు
నీవే ప్రకటితమయ్యేవు అర్ధనారీశ్వరమై.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నేను పొందిన అన్ని కాలములకు నీవే అధిపతివి...

నాకు చెందిన అన్ని కర్మలకు నీవే ప్రత్యక్ష సాక్షివి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

అందుకున్న నీ పాదం...
వదలనే వదల...

శివ నీ దయ.

Wednesday, November 15, 2023

శివోహం

శివా!నెత్తిన గంగ  నుదుటున నిప్పు
గొంతున విషము గుండెల నిండా ప్రేమ
అంతా విచిత్రం నీ వెంతో చిత్రం
మహేశా......శరణు.

Tuesday, November 14, 2023

శివోహం

కేరింతన నవ్వుతున్న పసిపాపల నిండి ఉన్న ఆనందం నీ రూపం...
కొండకోనల వంపులలో సవ్వడైన సెలయేటి సోయగాలే నీ రూపం.

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం పరమాత్మనే నమః.

శివోహం

శివా!నీ పేరులన్ని పేరులా కూర్చేను
పేరు పేరున ఆ పేరు పరిమళించేను
ఆ పేరులు నీ మెడలోన వేసి మరిసేను
మహేశా . . . . . శరణు .

శివోహం

చాలా కష్టమైన పని మనసులో ఏడుస్తూ కంటితో నవ్వడం.

శివ నీ దయ.

Monday, November 13, 2023

శివోహం

అద్దంలోని బింబాన్ని చూసి తృప్తిగా ఉన్నా...
అంతరాత్మలో నీవే నని బ్రమతో ఉన్నా...
శరణాగత వత్సలుడనై వేచి యున్నా...
ఆత్మార్పణ చేయుటకు వెనుకాడకున్నా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా ! హాలాహలం నీకు నేరేడు పండు
ప్రకృతి జగద్ధాత్రి నీకు మారేడు పత్రి
బ్రహ్మాండాలు మారేడు పండు
నీ ఆటలో నిను కనుగొనని నేను అరటిపండు
శివా ! నీ దయ

శివోహం

శివా!తమోగుణం తన్నుకొస్తుంటే
రజోగుణం రంకెలేస్తుంటే
సత్వగుణం నిత్యమవనీ నాయెడల
మహేశా . . . . . శరణు .

Sunday, November 12, 2023

శివోహం

ఆలోచనలు అదుపుచేసి మనసును నీ ఆధీనంలోకి నడిపినగాని నాగుండె కుదుట పడటం లేదు శివా..
ఊపిరి మార్గంలో నన్ను నడుపుచూ దృష్టి మనసు మంత్రం నీపై నిలిచేలా చేసి నాగుండె గోడలలో ఉన్న నిన్ను దర్శించే భాగ్యం కలిగించవా పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...