శివయను రెండక్షరములు
భవబంధములెల్ల ద్రుంచు, భయముల బాపున్
పవమాన సుతుడు దనుజుల
నవలీలగ గూల్చురీతి ననయము శంభో!
శంభో! పవనసుతుడు హనుమంతుడు రాక్షసులను అవలీలగా ఏవిధముగా కూల్చి వేయునో ఆవిధముగా "శివ" అనే రెండక్షరములు భవబంధములను త్రుంచి భయములు పోగొట్టును
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ!
నా ఆత్మను నీకు అర్పితం చేసినా...
ఇంకా నాతో ఈ ఆట లేల...
ఈ పాట లేల...
ఈ రాత లేల...
నా ఈ శరీరం మిగిలి ఉన్నందుకా...
ఈ కట్టే కాలాక మిగిలే బూడిద నీకె కదా అయ్యా.
మహాదేవా శంభో శరణు.
నా ఏకాంతం లోని నీ కాంతి..
నాకు తోడు అయితే...
నీలో ఏకం కావాలని...
ఒక నీడ ఎదురు చూస్తుంది.
మహాదేవా శంభో శరణు.
శివా!కంటి చూపు కోర్కెల కట్టబెట్టేను లోచూపు కోర్కెల తుడిచిపెట్టేను లోచూపుతో నీ చూపు కలియనీ మహేశా . . . . . శరణు .