Friday, October 25, 2024

మహాదేవా శంభో శరణు.

 శివ!

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మలినాలతో మనసు ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా...
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

ఋణం లేని మరణం కావాలి ....
మరుజన్మకైనా మనఃశ్శాంతి ఉండాలి..!!

త్రిగుణాత్మక...
త్రినేత్ర
త్రికాల
జలాభిషేక
తైలాభిషేక
గంధాభిషేక
ధాన్యాభిషేక
పుష్పాభిషేక
ఫలాభిషేక
భస్మాభిషేక
అన్నాభిషేక
పాలాభిషేక శివ నమ్మితి నిన్నే.
మహదేవ శంభో శరణు

ఏది నిజం...
ఏది అబద్ధం...
ఏది పుణ్యం...
ఏది పాపం...
ఏది ధర్మం...
ఏది ఆధర్మం నాకేం తెలుసయ్య...
ఒనామాలు దిద్డించావు...
ఓదార్చి కాపాడావు సర్వేశ్వరా.
మహాదేవా శంభో శరణు.

శివా!జీవులను సృష్టించి జగతికంపి
అన్నిటా నీవు ఆత్మగా అమరియుండి
తేజరించితివి గాని తెలియరాకున్నావు
మహేశా . . . . . శరణు

శివా!నీవు నా ఆత్మయని తెలిసి
నేను నీ సుతునిగా విరిసి
మిధ్యా జగతిలో మిధ్యగా వున్నాను.
మహేశా . . . . . శరణు

నిండు పున్నమి
పండు వెన్నెలలు
ప్రేమతో పంపిన మంచు బిందువులను ...
హిమము
నదములా నర్తన చేయిస్తూ
ఝరుల స్వర సిరులతో ...
" మిమ్ము అభిషేకిస్తాను "
శివానీ శివోహం శివోహం

వైభవాలన్నీ
విభుని పాదాల చెంత విడిచేయి ...
మోయవలసిన
బూడిద కుప్పల బరువులు
చాలా చాలా ఉన్నాయి ...

జననం
మరణం
రెండు వద్దు
నువ్వు లేని
క్షణాన
వెలుగు
చీకటి
రెండు వద్దు
నీ మాట వినని
క్షణాన
సుఖము
దుఃఖము
రెండు వద్దు
నీ చెంతన
లేని క్షణాన



No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...