Thursday, December 12, 2024

శివోహం

శివా!నిను మోపున దాల్చిన మోక్షమని
నీ రూపును దాల్చి మురిసాను
అను నిత్యం నిన్నే తలచాను
మహేశా . . . . . శరణు .

శివా!శ్వేత వర్ణ రూపాన శోభించేవు
కంఠాన నీలి వర్ణ చాయనుంచేవు
కామిత ఫలములు మాకందించేవు
మహేశా . . . . . శరణు .

శివా!సదా పద్మాసనమున చూచు నిన్ను
వీరాసనమున చూడ మాకు వేడుకాయె
మన్నించినావయ్య మా మనసు తెలిసి
మహేశా . . . . . శరణు .

శివా!వేణువెరుగగ వచ్చు విష్ణు రూపునకు
నాద మెరుగగ తెలిపి మురియ జేసి
వేణు గానము మాకు మిగుల జేసావా
మహేశా . . . . . శరణు .

శివా!పండ్లు కాయలు నీకు అర్పనము చేయ
కామ్య ఫలము మాకు వొసంగి
నంది కొకరీతి ఆ పండ్లు అందజేసావా
మహేశా . . . . . శరణు .

శివా!నీ పదమంటిన పరమపదమే
ఆ పదమంటగ మరి ఏది పదము
ఆ పదము తెలియ ఓ పదము విడుము
మహేశా . . . . . శరణు .


No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...