Tuesday, April 27, 2021

శివోహం

శంభో...
ఏ పాపమైనా
ఏ శాపమైనా
నీ నామస్మరణతోనే పటాపంచలవుతుంది
నా అండ నీవు ఉండగా ఈ పాపమూ , శాపముతో నాకేమిటి భయం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

త్వరగా శుభ ముహూర్తం పెట్టు మహాదేవా...
బాధతో జారుతున్న కన్నీటిని ఇంకా దాయలేను...
మళ్ళీ మళ్ళీ నేను బాధ పడలేను...
నిన్ను చేరు వేళా ఆ కన్నీళ్లు ఉంటుందో లేదో...
అప్పుడు నిన్నెలా అభిషేకించను...
ఈ కన్నీళ్లు తప్ప నా దగ్గర ఏమి లేదు...

మహాదేవా శంభో శరణు...

Monday, April 26, 2021

ఓం

అక్షర సత్యాలు

🔮బాహ్య పరిస్థితులు నెలకొల్పడానికి  మీకు బయటి వ్యక్తుల, శక్తుల సహకారం కావాలి.అంతర్గత పరిస్థితులు నెలకొల్పడానికి మీకు కావలసింది మీరు మాత్రమే..!!

🔮మీ ఆరోగ్యం గురించి, మరీ అతిగా గాబరా పడకండి. అలా గాబరా పడడమే ఒక రోగం..!!

🔮మనము ఏర్పర్చుకుంటున్న అపోహలే మన అజ్ఞానానికి , భయానికి, దుఃఖానికి, సమస్యలకు కారణం.అపోహలను వదలి పెడితే అన్నీ పోయినట్లే కదా..!!

🔮మనం మాట్లాడే భాష మరణించే వారిని కూడా బ్రతికించేదిగా ఉండాలి కానీ, బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు..!!

🔮కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు హింసకు దూరంగా ఉంటారు...!!

🔮వాస్తవానికి మనిషిని చంపేసేంత బలమైన సమస్య ఏది భగవంతుని సృష్టిలో ఉండదు. కానీ సమస్యను చూసి బలహీనంగా మారే మనసులు మాత్రం చాలా ఉంటాయి..!!

🔮సమయం,ఆరోగ్యం,బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలిసేది..!!

శివోహం

మన సమస్త దుఃఖాలకు, అశాంతికి మనలోని భావదోషాలే కారణం. ఈ విషయం అవగాహన అయినప్పుడు సుఖశాంతుల కోసం ఎక్కడెక్కడో వెతకం. మన మనసును శుద్ధిచేసుకుని సుఖశాంతులను పొందవచ్చు. మనసుకు అలవాటైన తలపుల నుండి అభ్యాసంతో విముక్తి పొందవచ్చు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మంచి వారుగానే కనిపిస్తారు. కానీ మనిషి నిజమైన మంచితనం సమాజంతో తాను కొనసాగించే సత్సంబంధాలతోనే ఉంటుంది. తాను కాకుండా ఇతరులంతా కలిసింది సమాజం. తల్లిదండ్రులు, భార్యపిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సహోద్యోగులు చివరికి గురువుతో సహా వీరితో మన ప్రవర్తన ఎలా ఉందో మనకు మనమే తెలుసుకోవచ్చు. దైవంవద్ద, గురువువద్ద వినయంగా ఉండి తనకు తానుగా మంచివాడనుకుంటే సరిపోదు. ధర్మజీవనం అలవాటైతే గాని మన జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరితో అవసరమైనంత పరిమితంగా ఉంటే అదే వైరాగ్యాన్ని అలవరిస్తుంది. అప్పుడు భావదోషాల నుండి విముక్తి లభిస్తుంది !

_*"సృష్టి నీ ఉనికిని తెలుపుతుంది.. నీవు నీ స్వరూపం తెలుసుకో..!"

శివోహం

మనసు అంటేనే ప్రాణం...
ప్రాణం లేని శవానికి మనసు ఉండదు. 
ప్రాణం పోవడం అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ  మనసు ,తాను ఆశ్రయించి ఉన్న  జీవుడిని ,దేహి శరీరంలో నుండి  వాయువు రూపంలో  బయటకు  తీసుకెళ్లడంఇదే మరణం...
మనసు ,ప్రాణం జీవుడు ఇవన్నీ ఒకటే...
స్వరూపాలు వేరు పని చేసే తీరు వేరు అంతే...
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, April 25, 2021

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో 

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది 

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో 

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం 

ఓం నమః శివాయ...
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, April 23, 2021

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు 

*శ్రీ  సుందర చైతన్యానందులవారు*

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...