Friday, October 8, 2021

శివోహం

శివా!గుర్తు తెలియని గమ్యం చేరేదెప్పుడో ?
జనన మరణ భ్రమణం ఆగేదెప్పుడో ?
తెలిసేదెలా ?......కథ ముగిసేదెలా .......?
మహేశా. .....  శరణు.

శివోహం

శివ...
నేను ఆశక్తుడను...
నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయని అఙ్ఞానిని...
నా ఘోర అపరాధం దయతో కనికరించి క్షమించు సర్వేశ్వరా...
అపురూపమైన అమోఘమైన  వరప్రసాదంగా నాకు అనుగ్రహించిన ఈ మానవ జన్మకు తగిన యోగ్యతను, జ్ఞానాన్ని , అనుగ్రహించి నన్ను నీ దరికి చేర్చుకో తండ్రి...
ఈ దీనుని మొర ఆలకించి ఈ జన్మకు నీవే విలువ కట్టి దానికి సార్థకతను అనుగ్రహించు శివ...
మహాదేవా శంభో శరణు.

Thursday, October 7, 2021

శివోహం

శివా! నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా ..... శరణు.

శివోహం

శివ...
ఈ జగము ఒక మాయ అని నాకు తెలియదయ్యా...
మాయ లో బ్రతుకు మాదని తెలుసుకోలేను...
నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి...
నరము తెగిపోవు వేదన కల్పించినావు...

మహాదేవా శంభో శరణు.

Wednesday, October 6, 2021

శివోహం

శివా!చెట్టు కింద స్వామి గుట్టు విప్పవేమి
మౌనమైన బోధలో వున్న మర్మమేమి
ఆత్మబోధ అందువా పరమాత్మ బోధ అందువా
మహేశా . . . . . శరణు


 శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతము మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .


 శివా!నీనుండి విడివడి నేను
విశ్వమంతా తిరుగుతున్నా
నీ ఒడిని చేరగ వెతుకుతున్నా
మహేశా . . . . . శరణు .


శివా!ఏకోన్మఖముగ ఎదగాలి
ఏకాక్షితొ నిన్ను చూడాలి
అందుకు నేనేంచెయ్యాలి
మహేశా . . . . . శరణు .


శివా! చిత్తంలో చిరు జ్యోతివి
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివి
అంతటా ఉన్నావు అగుపించకున్నావు
మహేశా ..... శరణు.


శివా!మా ఆలోచనల నిండా నీవు
మా లోచనముల నిండా నీవు
ఏ చలనము లేకుండా అమరివున్నావు .
మహేశా . . . . . శరణు .


శివా!మునుపెరుగనవి ఎన్నెన్నో మౌనంలో తెలిసాయి
తెలిసాక మౌనం పై పెరిగింది మోహం
మౌనం పెరగనీ మోహం తరగనీ
మహేశా . . . . . శరణు .


 శివా!నీవు నామ రూపాలకు అతీతం 
నేను నామ రూపాలకు పరిమితం
నన్ను కరుణించు నా పరిమితి పెంచు 
మహేశా ..... శరణు.

శివోహం

శివ...
ఎన్ని మారులు నీ గుడికి వచ్చి ఉంటి...
ఎన్ని మారులు నీ ముందు నిలిచి ఉంటి...
ఎన్ని మారులు నిన్ను మరవక దలచి ఉంటి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మంచు కొండలపై నుండు మహేశ్వరీ
కలియుగంబున మానవులను కల్పతరువై ఉండి శ్రీగిరి శిఖరమందున విభవమై వెలిసిన సర్వేశ్వరి...
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని...
సువాసిని పూజ్య సూహాసిని...
బ్రహ్మాండ ములకెల్ల నీవే అండా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...