శివా!బయటకి వస్తే చూద్దామని నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .
శివా!నన్ను చూసి పిచ్చివాడని నవ్వుకోకు
నాకు పట్టుకుంది నీ పిచ్చే వేరనుకోకు
ఆ పిచ్చి ముదిరిపోనీ నీ చిచ్చు రగిలిపోనీ
మహేశా . . . . . శరణు .
నా మోపునెక్కి తిరగగ మనసు తిరిగిందా
అంతకన్న భాగ్యమా అధివసించవయ్యా
మహేశా . . . . . శరణు. .