Tuesday, November 2, 2021

శివోహం

శివా!నీవు కాస్త మనసు పెట్టు
నా మనసును మట్టుబెట్టు
వేరేమైనా అడిగితే ఒట్టుబెట్టు
మహేశా . . . . . శరణు

Monday, November 1, 2021

శివోహం

మనసు ప్రతికూల పరిస్తితులలో
పరమౌషధం మన శివదేవుని నామము...

అన్ని దిక్కులా విశ్వమంతా వ్యాపించి యున్న శివదేవుని స్మరిద్దాం తరిద్దాం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా!నన్ను చూసి పిచ్చివాడని నవ్వుకోకు
నాకు పట్టుకుంది  నీ పిచ్చే వేరనుకోకు
ఆ పిచ్చి ముదిరిపోనీ నీ చిచ్చు రగిలిపోనీ
మహేశా  .  .  .  .  .  శరణు  .



 శివా!నందినెక్కక నడచి వచ్చావేమిటి
నా మోపునెక్కి తిరగగ మనసు తిరిగిందా
అంతకన్న భాగ్యమా అధివసించవయ్యా
మహేశా  .  .  .  .  .  శరణు. .

శివోహం

గమనం నువ్వే...
గమ్యం నువ్వే
అది నువ్వే...
అంతం నువ్వే
స్వర్గం నువ్వే...
నరకం నువ్వే
జననం నువ్వే...
మరణం నువ్వే...
అంతయు నీవు...
అంతిమన అక్కున చేర్చు అనంత లోకం కాశిక  పురాధీశుడవు నీవే శివ...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, October 31, 2021

శివోహం

శంభో...
నీ నామస్మరణ లేని క్షణం అనవసరం..
నీ ఆలోచన లేని తెలివి నిరర్థకం...
నీ జపం లేని తపం నిష్ఫలం...
నీ నవ్వు లేని దర్శనం అసంపూర్ణం...
నీ ఎడబాటు లేని భక్తి అపరిపక్వం...
నీ తోడు లేని ప్రయాణమే ఒంటరితనం...
నీ జాడే కనబడని  ప్రయత్నం అంధకారబంధురము...
మహాదేవా శంభో శరణు.

Saturday, October 30, 2021

శివోహం

శ్రీహరి శుభ రూపమితడు శ్రీనివాసుడు
వేడుకున్న వారి వెన్ను కాచుదేముడు

"హరి" జనులను ఉద్ధరించ భువిని వెలసెను
ఆపద మొక్కుల వాడన్న కీర్తి గాంచెను
భార్గవి హృదిలోన నిలచి బ్రహ్మము తానైన వాడు
పురుష రూప ఆదిశక్తి పరంధాముడు.

మంగమ్మ మానసాన మోహనాంగుడు
అన్నమయ్య పద కవితల ఆది దేవుడు
వాడిన పూమాలలతో పడతి పూజలందినాడు
పార్ధివ పుష్పాల కొలువ పరవశించి మురిసినాడు.

ఏడేడు లోకాల ఏలికైన విభుడు
ఏడు కొండలపైన కోరి వెలసిన వాడు
సప్త గిరి శిఖరాన్ని చేర ఊతమిచ్చు వాడు
ఆనంద నిలయ అనుభూతి పంచుతాడు.

శివోహం

 శివా!ఇక్కట్ల ఇల్లాయె ఈ దేహము
బాధించు చున్నాది భవరోగము
ఛేదించలేకున్నాను ఈ ఖేదము .
మహేశా . . . . . శరణు .


శివా!ఎడతెగని అలలు ఎదను ఆలోచనలు
అవి పుట్టి గిట్టిన వేళ నిన్ను చుట్టనీ
నా చుట్టలన్నీ వీడి అవి నిన్ను ముట్టనీ
మహేశా . . . . . శరణు .


 శివా! పదార్ధం నిన్ను చేరితే ప్రసాదం
ప్రసాదం నన్ను చేరితే నీ కటాక్షం
ప్రసాదం అందనీ  నీ కటాక్షం పొందనీ
మహేశా ..... శరణు

 శివా!సృష్టి చేయ కోరింది నీ సంకల్పం
నిన్ను చేర కోరింది నా సంకల్పం
నీ సంకల్పంతో సిద్ధించనీ నా సంకల్పం 
మహేశా . . . . . శరణు .

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...