Wednesday, November 27, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మరణముతో సమానమైనది నా మూర్ఖత్వము...
వేలకట్టుటకు వీలుకానిది అనవసరమైనప్పుడు నే ఖర్చుచేసినది...
మరణము వరకు శల్యము వలే బాదించునది రహస్యముగా నాతో చేయబడిన పాపము.
నా గురించి చెవిలో చెబుతున్న
నీ గురించి చాటి చెబుతున్న...
నా మాట నీకు చేరవేయగ నందిని నమ్ముతున్న.

మహాదేవ శంభో శరణు.

Tuesday, November 26, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
క్షణకాల సుఖం కోసం   నేను నిరీక్షణ చేసి ప్రతి క్షణం వ్యర్ధ పరిచాను...
యేక్షణమున యేమిజరుగునో అని మేము భయంతో జీవితం గడుపుతున్నాను...
భూత బ్రీతిని...
మానవ బ్రాంతిని కొల్లగొట్టునది నీ విభూతిని నుదుటన వ్రాసి
క్షేత్రజ్నుడవని క్షీరా భిషేకము చేస్తున్నాను...
సదా కాపాడుము సదాశివ.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఉమసతీశ...
విశ్వేశ...
ఉరగహార
ఉర్వి భక్త భృంగ...
దనుజ గర్వభంగ
కామభంజన...
సజ్జనోంకార దీప...
వామదేవ...
శ్రీశైలనివాస...
ఈశ
నేను ఏ స్థితిలో ఉన్న నా స్థితి గతులను నీవే చూసుకోవాలి తండ్రి.
చరాచర జగతిని స్థితి కారక శక్తి నీవు నీవే కనుక.

మహాదేవ శంభో శరణు.

శివోహం

ఇహ పరముల నీకెవరు సరికారు
హరి నీదే ఈ ఘనత మరి నీవే హరి గనుక

మరి మరి నిను మది తలచిన మోదమే 
అను నిత్యం అది మాకు అనుభవమే

సృష్టికర్తను సృష్టించిన ఘనుడవు నీవు
కర్మ సాక్షి కూడా కాంతులు అందించేవు
చరాచర జగతిని స్థితి కారక శక్తి నీవు
సర్వ ధర్మముల నీవె శోభించు చున్నావు

ధర్మానికి చేటుగా అసురత్వము అవరించ
అనువైన రూపాన ఆకృతి దాల్చి
నిజ తత్వము నుండి విడివడి వచ్చేవు
దుష్ట శిక్షణ చేసి శిష్టుల రక్షించేవు

యుగములు వేరైనా జగతి తీరు మారినా
అవతరించు లక్ష్యానికి ఆధ్యుడనీవు
నిలువరించ వీలులేని తేజము నీవు
నిత్యమైన సత్యానికి రూపము నీవు

Monday, November 25, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మనసా ఓ పిచ్చి మనసా!
జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన ఈ లోకంలో జీవునికి సుఖ సంతోషాలెక్కడివి...
ఒక్క పరమేశ్వర శరణాగతి లో తప్ప ఎక్కడా ఆనందం కనిపించదు...
ఒంటరిగా లోకంలోకి ప్రవేశించిన మనిషికి ఎవ్వరితోటి సంబంధం కలదు...
మాయా జగన్నాటకం లో బూటకపు సంబంధాలతో వాదులాటలెందుకు? కొట్లాటలెందుకు?మిత్రమా.
భగవన్నామ స్మరణే మనిషికి మోక్షం.
నామ స్మరణ చేయరాదు చేసి తరించవే ఓ మనసా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, November 24, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉక్కిరిబిక్కిరవుతున్న నా ప్రతీ శ్వాసలోనూ నువ్వే...
రెక్కలు తెగిన పక్షినై కదలక మెదలక విలవిలలాడుతూ
చిద్రమై రక్తమోడుతున్న ఈ గుండె చప్పుడులోనూ నువ్వే...
నా బ్రతుకు నా జీవితం నాకు నచ్చని బాటలో సాగుతున్నా నీవిచ్చిన ఈ జననం నాకిష్టమే....
దినదినం సమీపిస్తున్నకొద్దీ
నీవియ్యబోయే మరణమూ నాకిష్టమే...
ఇన్ని జరుగుతున్న ఎలాంటి చలనం లేకుండా పైనుండి చోద్యం చూస్తున్న నువ్వూ నాకిష్టమే.
కానీ ఒకటే ఒక కోరిక తండ్రి
అందరికీ దూరంగా.. సుదూరంగా..
స్వేచ్చా విహంగంలా.....
ఆకాశమే హద్దుగా..
నాకునేనుగా విహరించేలానైనా శక్తినివ్వు...
కాని పక్షంలో హాయిగా నీ ఒడినిచేరుకునేలానైనా నాకు వరమివ్వు.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి ఉన్నాడు...
నాలోనే...
నాతోనే...
నావెంటనే...
నాయోగక్షేమాలు చూస్తూ...
నన్ను నిరంతరం కనిపెడుతూ...

జై శ్రీమన్నారాయణ.

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...