Friday, April 30, 2021

శివోహం

పదములకే పేదవాడను
హృదయమున నిన్నే ఆరాధించే ధనికుడను
నీ నామస్వరమే నా ఆదాయం
ఈజన్మనెలా గెంటేసినా
మరుజన్మనైనా నీసన్నిధిలో ఇలా
నవ్వుతూ బ్రతికే వరానీయవా శివా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

చంద్రబింబానన చంద్రరేఖామౌళి
నీలకుంతలభార నీలగళుడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు
మదన సంజీవనీ మదనహరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండలధారి
భువన మోహన గాత్రి భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు
సర్వాంగ సుందరి సర్వగురుడు
గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న
పాదుకల మెట్టి చట్టలు పట్టి కొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసకమెసగ
విహరణ క్రీడ మాయున్నవేది కపుడు

శ్రీనాథుడు భీమఖండం కూర్చిన చక్కటి పద్యం....

Thursday, April 29, 2021

అమ్మ

సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం.  ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం.

శివోహం

సమస్తమైన చరాచరప్రకృతిని....
తోలుబొమ్మలాడించే నీవు...
నా కన్నుల మాయను కప్పేస్తావు...
రంగుల కలలే రప్పిస్తావు...
ఎంతటి ఇక్కట్లు పెట్టితివి శంకరా....
అసలే సంసారం బంధమున మునిగి ఉన్న....
ఇంకా నన్ను ముంచబోకు...
నన్ను నీ నుండి దూరం చేయబోకు...

మహాదేవా శంభో శరణు......

శివోహం

భారముగా గడుపు చుంటిని పాపినై నేను....
తీరని భవ బంధముల కారాగారములో....
నేరము లెంచక కోరికలన్నీ.....
తీరెడి కారాగారమ్ము నుండి రక్షించు.....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

పార్వతి పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు....
అన్యోన్య దాంపత్యనికి ఆదర్శ మూర్తులు...
పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే...
అమ్మ వారు విజయాన్ని చేకూరుస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, April 28, 2021

శివోహం

ఈ పాపాపుణ్యాలు నాకు తెలియదు
జ్ఞానం ఏందో అజ్ఞానం ఏందో అసలే తెలియదు...
నాకు తెలిసిందల్లా నీ నామ స్మరణే...
ఆ పై నీ దయ,  శంభో శరణు....

స్వామి శరణం

ఇరుముడిప్రియ శరణు......
హరిహరతనయ శరణు....
భక్తవత్సల శరణు....
లోకరక్షక శరణు....

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

శివ శక్తి...  
శివుడే శక్తి...
చూసేవారికి రెండు
తెలుసుకున్న వారికి ఒకటి..
ఓం నమఃశివాయ శివాయై నమః
ఒకటే మంత్రం రెండుగా అనిపిస్తుంది

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, April 27, 2021

శివోహం

చీకటి తరువాత వెలుతురు..
చెడు నుండి మంచికి...
మంచి నుండి మానవత్వానికి...
మానవత్వం నుండి దైవత్వానికి ప్రయాణం...

ఓం నమః శివాయ

శివోహం

కలకాలం కాలమొక రీతిలో సాగుతున్నా...
మన మధ్య అనుబంధం ఒకే విధంగా నడుస్తోంది...
ఈ బంధాలు ఇలాగే సాగనీయవా...
కలికాలమైనా కలకాలం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
ఏ పాపమైనా
ఏ శాపమైనా
నీ నామస్మరణతోనే పటాపంచలవుతుంది
నా అండ నీవు ఉండగా ఈ పాపమూ , శాపముతో నాకేమిటి భయం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

త్వరగా శుభ ముహూర్తం పెట్టు మహాదేవా...
బాధతో జారుతున్న కన్నీటిని ఇంకా దాయలేను...
మళ్ళీ మళ్ళీ నేను బాధ పడలేను...
నిన్ను చేరు వేళా ఆ కన్నీళ్లు ఉంటుందో లేదో...
అప్పుడు నిన్నెలా అభిషేకించను...
ఈ కన్నీళ్లు తప్ప నా దగ్గర ఏమి లేదు...

మహాదేవా శంభో శరణు...

Monday, April 26, 2021

ఓం

అక్షర సత్యాలు

🔮బాహ్య పరిస్థితులు నెలకొల్పడానికి  మీకు బయటి వ్యక్తుల, శక్తుల సహకారం కావాలి.అంతర్గత పరిస్థితులు నెలకొల్పడానికి మీకు కావలసింది మీరు మాత్రమే..!!

🔮మీ ఆరోగ్యం గురించి, మరీ అతిగా గాబరా పడకండి. అలా గాబరా పడడమే ఒక రోగం..!!

🔮మనము ఏర్పర్చుకుంటున్న అపోహలే మన అజ్ఞానానికి , భయానికి, దుఃఖానికి, సమస్యలకు కారణం.అపోహలను వదలి పెడితే అన్నీ పోయినట్లే కదా..!!

🔮మనం మాట్లాడే భాష మరణించే వారిని కూడా బ్రతికించేదిగా ఉండాలి కానీ, బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు..!!

🔮కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు హింసకు దూరంగా ఉంటారు...!!

🔮వాస్తవానికి మనిషిని చంపేసేంత బలమైన సమస్య ఏది భగవంతుని సృష్టిలో ఉండదు. కానీ సమస్యను చూసి బలహీనంగా మారే మనసులు మాత్రం చాలా ఉంటాయి..!!

🔮సమయం,ఆరోగ్యం,బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలిసేది..!!

శివోహం

మన సమస్త దుఃఖాలకు, అశాంతికి మనలోని భావదోషాలే కారణం. ఈ విషయం అవగాహన అయినప్పుడు సుఖశాంతుల కోసం ఎక్కడెక్కడో వెతకం. మన మనసును శుద్ధిచేసుకుని సుఖశాంతులను పొందవచ్చు. మనసుకు అలవాటైన తలపుల నుండి అభ్యాసంతో విముక్తి పొందవచ్చు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మంచి వారుగానే కనిపిస్తారు. కానీ మనిషి నిజమైన మంచితనం సమాజంతో తాను కొనసాగించే సత్సంబంధాలతోనే ఉంటుంది. తాను కాకుండా ఇతరులంతా కలిసింది సమాజం. తల్లిదండ్రులు, భార్యపిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సహోద్యోగులు చివరికి గురువుతో సహా వీరితో మన ప్రవర్తన ఎలా ఉందో మనకు మనమే తెలుసుకోవచ్చు. దైవంవద్ద, గురువువద్ద వినయంగా ఉండి తనకు తానుగా మంచివాడనుకుంటే సరిపోదు. ధర్మజీవనం అలవాటైతే గాని మన జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరితో అవసరమైనంత పరిమితంగా ఉంటే అదే వైరాగ్యాన్ని అలవరిస్తుంది. అప్పుడు భావదోషాల నుండి విముక్తి లభిస్తుంది !

_*"సృష్టి నీ ఉనికిని తెలుపుతుంది.. నీవు నీ స్వరూపం తెలుసుకో..!"

శివోహం

మనసు అంటేనే ప్రాణం...
ప్రాణం లేని శవానికి మనసు ఉండదు. 
ప్రాణం పోవడం అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ  మనసు ,తాను ఆశ్రయించి ఉన్న  జీవుడిని ,దేహి శరీరంలో నుండి  వాయువు రూపంలో  బయటకు  తీసుకెళ్లడంఇదే మరణం...
మనసు ,ప్రాణం జీవుడు ఇవన్నీ ఒకటే...
స్వరూపాలు వేరు పని చేసే తీరు వేరు అంతే...
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, April 25, 2021

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో 

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది 

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో 

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం 

ఓం నమః శివాయ...
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, April 23, 2021

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు 

*శ్రీ  సుందర చైతన్యానందులవారు*

శివోహం

దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి,పరీక్షించుకోవాలి,పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి...

ఓం శివోహం.. సర్వం శివమయం

Thursday, April 22, 2021

శివోహం

శివ!!! నీవు నాకు కనిపించక లేదను...
నీవు లేవని అనను నేను...
నీవే ఏదో నాడు దర్శనం ఇస్తావు...
నన్ను కైలాసం కు తీసుకు వెళ్తావు...
అప్పటి వరకు ఓం నమః శివాయ నే...

మహాదేవా శంభో శరణు

Wednesday, April 21, 2021

శివోహం

ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు.
ఆయనే భగవంతుడు.

పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే...

మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం....

పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు..
కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు....

నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి
నీవు నిశ్చింతగా ఉండు సరంతర్యామి ఐనా శివుడే చూసుకుంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, April 20, 2021

శివోహం

తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా అందరి మన్నలను పొందిన   శ్రీరామచంద్రుడు  ఎంతో మహాన్నతుడు...
తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, ఆప్యాయతలు,  పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు.
రామబాణం రక్షిస్తుంది...
రామహస్తం దీవిస్తుంది...
రామ పాదం నడిపిస్తుంది...
రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది. రామ నామం మధురం...
మధురాతి మధురం.
సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం…. సర్వజనులకు ఆనందదాయకం.
శ్రీరామచంద్రుడి జన్మదినం లోకానికంతటికీ పర్వదినం.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు,గురువులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శివోహం

ఏమని పొగడను
ఎంతని వర్ణించను
నీవు అనంతుడవు
అఖండ తేజో నిధివి
నిన్ను తెలియలేను
నన్ను నేను తెలుసు కొలేను...

మహాదేవా శంభో శరణు...

Monday, April 19, 2021

శివోహం

మోహన రూప సన్మోహనణాకార గోపాల ఊహాతీతం నీలీల కృష్ణమురారి నీనామ సుధా సాగరం లోనీ సుధ ఎంత త్రాగినా తనివి తీరదుకదయ్యా ముకుందా నీ నామ స్మరణ మాకు నిత్యమంగలప్రధము నిత్యకల్యాణము....

హారేకృష్ణ

శివోహం

నేను అనే ఆలోచన పుట్టిన తరువాతే...
క్షణం, క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి...
ఇన్ని ఆలోచనలకు మూలమైన, ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’అనుభవమవుతుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నీ మతి ఎలా ఉంటుందో
నీ గతి అలాగే ఉంటుంది
సమ్మతితో ఉండుసద్గతిని పొందు...
ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, April 18, 2021

శివోహం

కోరికల ఊడల వృక్షం మా జీవితం...
మరి నీవు గాక ఎవరు దరి చేర్చుకుంటారు...
అన్యమేరగని నాకు ఎవరు చేరధిస్తారు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సూత్రధారివి నువ్వు...
నీవు అందించే జగన్నాటకం లో...
నేను ఒక పాత్రధారినీ మాత్రమే తండ్రి...
వట్టి తోలుబొమ్మను...
మంద బుద్ధి కలవాణ్ణి...
ఉట్టి మూర్ఖుడను...
నీవు లేకుండా నేను లేను కానీ...
నిన్ను స్మరిస్తూ ధ్యానించడం తప్ప...
మరే విధంగా నిను సేవించలేను...

మహాదేవా శంభో శరణు...

Saturday, April 17, 2021

అమ్మ

అజ్ఞాన అంధ వినాశ కారిణి
మమ్ము ఆదరింపు మాత...
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు...
ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము...
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ...
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ...

అమ్మ దుర్గమ్మ శరణు...
ఓం శ్రీ దుర్గాదేవినే నమః

శివోహం

అలసిపోతున్నాను శివా...
విశ్రాంతి ఈయవా ఈశ్వరా...
ఒక్కడిని పంపి కొన్నాళ్లకు జతకలిపి మరో కొన్నాళ్లకు ముగ్గురను చేసి బంధాలు బరువులు పెంచి బాధ్యతల లోతులలో పడేసి ఈదమంటే ఎలా శివా...
నిన్ను స్మరించే సమయమే ఈయవా
నిత్యం నీ నామాలాపన చేసేది ఎలా

మహాదేవా శంభో శరణు...

జైశ్రీరామ్

హరేరామ హరేరామ రామరామ హరేహరే
శ్రీరామ జయరామ జయజయరామ

శ్ర‌ీరామ శ్ర‌ీహనుమతే నమః

శివోహం

కొన్ని ప్రశ్నలకు సమాధానం లేనట్టే కొన్ని బంధాలకు అంతం ఉండదు...
ఆ బందం మన జీవితంలో ఉన్న లేకపోయినా మన మనసులో ఎప్పటికి ఉంటుంది...

ఓం నమః శివాయ

శివోహం

ఎవరిని ఎప్పుడు ఎందుకు పరిచయం చేస్తావో తెలియదు...
ఏ బంధాన్ని ఏ బంధం తో బంధిని చేస్తావో అస్సలే తెలియదు...
మితి మీరిన ప్రేమాభిమానం తో స్థిమితంగా ఉండలేకపోతున్నాము శివ...
మనసును బంధాన్ని బంధిని చేయకు , బానిసను అస్సలే చేయకు...

శివ నీ దయ...

శివోహం

సూత్రధారివి నువ్వు...
నీవు అందించే జగన్నాటకం లో...
నేను ఒక పాత్రధారినీ మాత్రమే తండ్రి...
వట్టి తోలుబొమ్మను...
మంద బుద్ధి కలవాణ్ణి...
ఉట్టి మూర్ఖుడను...
నీవు లేకుండా నేను లేను కానీ...
నిన్ను స్మరిస్తూ ధ్యానించడం తప్ప...
మరే విధంగా నిను సేవించలేను...

మహాదేవా శంభో శరణు...

Friday, April 16, 2021

శివోహం

అనంత నామాలు కలిగి ఉన్న
నీవే మాకు కొండంత అండ
మహాదేవా శంభో శరణు...

Thursday, April 15, 2021

శివోహం

శివుడవు నీవే...
హనుమవూ నీవే...
నీతో నీవే...
నాతోనూ నీవే
పరమేశ్వరా శరణు
నాకు నీవు తప్ప ఎవరున్నారు

జై శ్రీరామ్
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ...
భౌతిక మౌనం తేలికగా ఉన్న....
నా మనసు అదుపులో లేక పరిపరి
విధముల అదుపు తప్పుతోంది...
బాగు చేయి నా మనసును...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కోరిన తీరాన్నే చేరుకొనే వరకు..
కట్టే కాలిపోయే వరకు...
నా మదిలో నీ ద్యాస ఆగదు ప్రభు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...