Sunday, October 31, 2021

శివోహం

శంభో...
నీ నామస్మరణ లేని క్షణం అనవసరం..
నీ ఆలోచన లేని తెలివి నిరర్థకం...
నీ జపం లేని తపం నిష్ఫలం...
నీ నవ్వు లేని దర్శనం అసంపూర్ణం...
నీ ఎడబాటు లేని భక్తి అపరిపక్వం...
నీ తోడు లేని ప్రయాణమే ఒంటరితనం...
నీ జాడే కనబడని  ప్రయత్నం అంధకారబంధురము...
మహాదేవా శంభో శరణు.

Saturday, October 30, 2021

శివోహం

శ్రీహరి శుభ రూపమితడు శ్రీనివాసుడు
వేడుకున్న వారి వెన్ను కాచుదేముడు

"హరి" జనులను ఉద్ధరించ భువిని వెలసెను
ఆపద మొక్కుల వాడన్న కీర్తి గాంచెను
భార్గవి హృదిలోన నిలచి బ్రహ్మము తానైన వాడు
పురుష రూప ఆదిశక్తి పరంధాముడు.

మంగమ్మ మానసాన మోహనాంగుడు
అన్నమయ్య పద కవితల ఆది దేవుడు
వాడిన పూమాలలతో పడతి పూజలందినాడు
పార్ధివ పుష్పాల కొలువ పరవశించి మురిసినాడు.

ఏడేడు లోకాల ఏలికైన విభుడు
ఏడు కొండలపైన కోరి వెలసిన వాడు
సప్త గిరి శిఖరాన్ని చేర ఊతమిచ్చు వాడు
ఆనంద నిలయ అనుభూతి పంచుతాడు.

శివోహం

 శివా!ఇక్కట్ల ఇల్లాయె ఈ దేహము
బాధించు చున్నాది భవరోగము
ఛేదించలేకున్నాను ఈ ఖేదము .
మహేశా . . . . . శరణు .


శివా!ఎడతెగని అలలు ఎదను ఆలోచనలు
అవి పుట్టి గిట్టిన వేళ నిన్ను చుట్టనీ
నా చుట్టలన్నీ వీడి అవి నిన్ను ముట్టనీ
మహేశా . . . . . శరణు .


 శివా! పదార్ధం నిన్ను చేరితే ప్రసాదం
ప్రసాదం నన్ను చేరితే నీ కటాక్షం
ప్రసాదం అందనీ  నీ కటాక్షం పొందనీ
మహేశా ..... శరణు

 శివా!సృష్టి చేయ కోరింది నీ సంకల్పం
నిన్ను చేర కోరింది నా సంకల్పం
నీ సంకల్పంతో సిద్ధించనీ నా సంకల్పం 
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నేను అంతా నిరీక్షణగా మారి ఉన్నాను...
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా...
ఈ అనంత జలనిధి దాటెందుకు నీచేయూతలో
నాలోనుండి నీలోకి ప్రయాణించే గమనాన్ని వేగంగా మార్చు...
మరెక్కడ ఆగకుండా నిన్ను చేరేందుకు ఉరవడి ఉండనీ గట్లు తెగిపోయి స్వామి...

మహాదేవా శంభో శరణు.

Wednesday, October 27, 2021

శివోహం

శివా!ఎడతెగని అలలు ఎదను ఆలోచనలు
అవి పుట్టి గిట్టిన వేళ నిన్ను చుట్టనీ
నా చుట్టలన్నీ వీడి అవి నిన్ను ముట్టనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
తనువు తగలడిపోతే తళుకు బెళుకులు కాలంలో కలిసిపోతాయి...
వైరాగ్యం గుండెల్లో నిను నింపుకుని నిదానంగా నడిస్తే
అదే కాలంలో పది కాలాల పాటు నిలిచిపోతాను...
ఈ రెండింటికి నడుమ మనసు తలరాతకు అడ్డువచ్చి నా నడకను ఎగుడుదిగుడుగా నడిపిస్తుంది..
మరి ఏదీ నీ దయ శివా!

మహాదేవా శంభో శరణు.

Tuesday, October 26, 2021

శివోహం

శివా!ఇక్కట్ల ఇల్లాయె ఈ దేహము
బాధించు చున్నాది భవరోగము
ఛేదించలేకున్నాను ఈ ఖేదము .
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
కోరికలు కోటియైనా తీర్చగలిగే కోటిలింగాల దేవుడవు నీవు...

ముక్కోటి దేవతలకు మూలవిరాట్టువు నీవే అయినా సంతృప్తికి మించిన సంపదలేమి ఉన్నాయి శివ...

అలాంటి తృప్తిని వరముగా ఈయవయా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి...
దుఃఖాలు తొలగుతాయి...
లౌకిక సుఖములందు విరక్తులౌతారు...
జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు...
అందుకే నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు తండ్రి...
దానివల్ల కలిగే ఆనందనుభవంచే అలవికాని నా బాధలను మరిచిపోయి నీ పాదపద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవుడికి ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Monday, October 25, 2021

శివోహం

శివా!మాట ఈర్షను కూడి
నా మౌనానికి ముసుగేసింది
నా మనసును చుట్టేసింది
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎదురుగా కనిపించేది పరిమిత ప్రదేశం...
లోపలకెళ్ళి చూస్తే విశ్వం అంతా కనిపిస్తుంది...
ఏది నిజం?
బయట కనబడేది ఎప్పుడూ ఒకేలా ఉండదు...
లోననున్నది శాశ్వతం అదక్కడే ఉంటుంది...
ఈ ఓడయే ఓటిపోయి ముక్కలైపోతుంది,కొత్తనావొస్తుంది
ఆచైతన్యం అక్కడే ఉంటుంది..
తెలుసుకోవాలి ఎవరిలో ఏముందో
ప్రకృతియా! పరమాత్మయా, 
ఆత్మయా!! అంతరాత్మయా!!

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అమ్మ నీవైనా చెప్పారాదా...
శివపార్వతులు ఒకటే అంటారు కదా...
నీవు చెబితేనే గాని నీ శివుడు దయ చూపడు అంటారు గదా...
ఇది నిజమే అయితే శివుడి కరుణ ను నాపై కొంచెం వర్షించమని చెప్పుతల్లి...
ఈ దీనునిపై దయజూడమని నీ (నా) ప్రాణనాధుడి  దివ్యదర్శనం కోసం అలమటిస్తున్న ఈ పేదవాడికి , నీవైనా దారి చూపలేవా...
ఒక్కసారి నా మొరను వినమని నీవైనా చెప్పరాదా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా...
మహాదేవా శంభో శరణు...

Sunday, October 24, 2021

శివోహం

త్రిమూర్తులలలో ఉన్న  మహాశివుడు గుణ రహితుడు, దయామయుడు, భోలా శంకరుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు,కంట్టము చుట్టు కర్ణములపై  సర్పాలను ధరించువాడు, అగ్నిశిఖ నేత్రము కలవాడు,  సుందరమైన గజ చర్మము వస్త్రముగా ధరించు వాడు, త్రైలోక్య సారభూతుడు, నిత్యమూ శ్రీ రామ జపము చేయువాడు, కోరినవార్కి కోరిన వారాల ఇచ్చే నిత్యమూ ప్రార్ధిమ్చుతూ ఉంటే మోక్షము సిద్ధించుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
నీవేమైనా చేసుకో
నన్ను నీ దరి చేర్చుకో

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!యోచితంగా ,అనాలోచితంగా
 ఏదైనా నా ఆలోచనలన్నీ నిన్నే చుట్టనీ
విడువకుండా నీ చేయి నన్ను పట్టనీ.
మహేశా ..... శరణు.

 శివా!గణపతి ధళపతి నీ  సుతులే
నాభి బంధము లేకే నడయాడ వచ్చారు
అట్టి వాడనే కదా  తెలియ నేను
మహేశా . . . . . శరణు .


 శివా! పాశాలు నన్ను వీడలేదు
పశు భావన నాలో తొలగలేదు
భావోన్నతి కల్పించు భవ శరణం అందించు
మహేశా . . . . .  శరణు.

Saturday, October 23, 2021

శివోహం

శంభో! నీ కృప లేని నా జీవితం నిష్ఫలం...
ఏ అర్థము , పరమార్థము కానరాని నా జీవితానికి ముగింపు పలికి నీ సన్నిధిలో నిలుపుతావో...
లేక నీ అనుగ్రహం తో బ్రతికించి నీ సేవలో తరింపజేస్తావో కానీ...
స్వామీ నీదే భారము...
అన్యం తెలియని నాకు నీవే గతి నీకే  శరణు...

మహాదేవా శంభో శరణు.

రాధ మోహన్

నిశ్చలమైన  కృష్ణ ప్రేమ...
కృష్ణ భక్తులకు మార్గదర్శనం...

రాధే క్రిష్ణ

శివోహం

దీనజనబాంధవా...
మేము  కర్మబద్ధులం
అల్పులము
మందబుద్ది కలవారము
అజ్ఞానులం
నీవు కరుణించి మాకు సద్భావన సన్మార్గ చింతనలను ప్రసాదించుము...
నిన్ను మేము మరచినా
నీవు మాత్రం మమ్మల్ని మరిచిపోకు తండ్రి..

హరే గోవిందా...
ఓం నమో వెంకటేశయా...

Friday, October 22, 2021

శివోహం

శంభో...
నేను కీర్తించువాడను...
నీవు రక్షించే వాడవు...
తప్పిందము చేయు వాడను నేను...
తప్పించువాడవు నీవు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!యోచితంగా ,అనాలోచితంగా
 ఏదైనా నా ఆలోచనలన్నీ నిన్నే చుట్టనీ
విడువకుండా నీ చేయి నన్ను పట్టనీ.
మహేశా ..... శరణు.

శివోహం

గురువుకు తెలియనిది ఏమున్నది...
ఆ పరమేశ్వరుడికి అవ్వనిది ఏమున్నది... చేయదలచిన నాడు గారడి వాడిలాగా గడియలో సకలం మార్చి వేయబడును చున్నవి...
సర్వం శివమయం సర్వం శివార్పణే కదా శివ...

మహాదేవా శంభో శరణు.

Thursday, October 21, 2021

శివోహం

అడుగడుగునా అండగా మల్లికార్జునుడుండగా
కారడవులేంటీ...
మూడు కాదు ముప్పదిమూడు లోకాలు తిప్పినా
నవ్వుతూ గడిపేస్తా గంగాధరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

సప్తస్వర నాదవినోదిని
సౌభాగ్య సమేత సుద్రుపిని
అఘనాషిని
నిటలాక్షిని
సర్వాలంకార సుశోభిత మంగళా రాజేశ్వరి..... అనవరతంబు నీ సేవలోనరించు భాగ్యము కలిగించు జగదీశ్వరి..

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.. 

ఓం శ్రీమాత్రే నమః
ఓంశివోహం సర్వం శివమయం

శివోహం

శివా!ఆనోట ఈ నోట నలుగుతున్నట్టు
వేయి నామాలు నీకన్నది ఒట్టి పొల్లు
సర్వ నామాలు ఇహ పరముల నీకే చెల్లు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నా బతుకు అంకెల గారడీ...
కూడికలు తీసివేతలు ఎన్ని వేసినాఎం..
ఎక్కాలు ఎన్ని పైనుండి కిందకు... 
కిందనుండి పైకి వల్లే వేసినా... 
గుణకారాల్లోను కుదింపులే...
భాగాహారాల్లోను శేషాలే....
గజిబిజి గందరగోళంలా ఉంది నా జీవితం...

మహాదేవా శంభో శరణు.

Wednesday, October 20, 2021

శివోహం

అఖిలాండకోటి బ్రహ్మాణ్డ నాయకా శరణు... సర్వాంతర్యామి శరణు...
పరంధామా పరాత్పరా  నీవే శరణు...
పరమేశ్వరా శరణు...

ఓం నమో వెంకటేశయా...
ఓం నమః శివాయ.

శివోహం

అస్త్రము తెలీదు , శస్త్రము తెలీదు 
శాస్త్రము అసలే తెలీదు 
నిమిత్త మాత్రుణ్ణి , నిర్నీత సమయాన్ని 
సద్వినియోగ పరుచుట తప్ప 
నాకు ఏమీ తెలియదు శివ కానీ
హృదయ పూర్వకముగా నిన్నే ఆరాధిస్తున్నా

మహాదేవా శంభో నీవే శరణు...

శివోహం

శివా!నీవు కన్ను తెరిచి మూసినంత కల్పాంతం
నేను కన్ను తెరిచి మూసినంత జన్మ అంతం
ఆద్యంతములు లేని నీవే నిత్యం సత్యం
మహేశా. . . . . శరణు.

శివోహం

భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం... 
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది... 
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే ఈశ్వరునికి నిజమైన శరణాగతి చేయగలడు... 
మాటిమాటికి ఈశ్వరుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు... 

ఓం శివోహం సర్వం శివమయం

Tuesday, October 19, 2021

శివోహం

భగవంతుడు మనతో నిరంతరం అత్యంత సన్నిహిత సంబంధంతో మెలిగే ఒక అద్భుత మహిమ గల వ్యక్తి అని వెంటనే గుర్తించండి...
అప్పుడు మీరు అతనిని ఒక సాటి మిత్రుడైన వ్యక్తిగా దర్శించగలరు...
దేవుడు తనంత తానుగా మనిషిని మార్చడు...
కానీ మనిషి తనను ప్రార్థిస్తే అతడికి తన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఇద్దరం చెరొకటీ తీసుకుందాం
నిన్ను కొలిచే భాగ్యం నాకు
నన్ను కాచే భారం నీకు....సరేనా.
మహేశా ..... శరణు.

శివోహం

శంభో...
నీవు ఉన్నావు...
నన్ను చూస్తున్నావు...
నా చర్యలు గమనిస్తూ సాక్షిగాఉన్నావు...
సర్వజ్ఞుడివి...
సర్వాంతర్యామివి...
అయిన నీకే నా మనసును ,తనువును నీకు అంకితం చేస్తూ ఉన్నాను శంకరా...
నాకు నీవే గతి...
నీకే శరణు...

Monday, October 18, 2021

శివోహం

శంభో...
నిరంతరం నీ నామ రూప వైభవ స్మరణ లో మా జీవితాలు వర్దిల్లెలా...
ప్రతీ ఉదయం మా హృదయం నిన్ను పూజించి సేవించి భావించి పవిత్ర వేదిక అయ్యేలా...
తగిన యోగ్యత ను మాకు అనుగ్రహించు తండ్రీ...
మహాదేవా శంబో శరణు.

శివోహం

సృష్టిలో అణువణువూ నీవే ఉన్నావని సంకేతం ఇస్తూ ప్రాణికోటి కూడా నిన్ను చూసి పరవశించేలా...

ప్రకృతిలో కనిపించే అందమంతా నీవేనని మా మదికి తెలియజేస్తూ...
ఆ దృశ్యానికి సృష్టికర్త నీవై మా దృష్ఠికి రూపకర్త నీవై మా మనసుకు ఆనందమును ప్రసాదిస్తున్నావా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో!
పవనసుతుడు హనుమంతుడు రాక్షసులను అవలీలగా ఏవిధముగా కూల్చి వేయునో ఆవిధముగా "శివ" అనే రెండక్షరములు భవబంధములను త్రుంచి భయములు పోగొట్టును..

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఇచ్చి పుచ్చుకొనుట తప్పు కాదుగా
ములుగుతున్న మనసు నీకు ఇచ్చేస్తాను
మనసుపడ్ఢ మౌనాన్ని నాకు ఇచ్చిపెట్టు
మహేశా . . .  .  . శరణు .

Sunday, October 17, 2021

శివోహం

శివా!జన్మకు మరణమే ముగింపు
మరు జన్మ దానికి కొనసాగింపు
ఇంక తెంపవయ్యా ఈ తంతు
మహేశా . . . . . శరణు .

Saturday, October 16, 2021

శివోహం

అయ్యప్ప అలౌకిక ఆనందానికి ప్రతిరూపం...
సచ్చిదానంద రూపం...
సచ్చిత ఆనంద స్వరూపం...
మణికంఠ జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం...
మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం...
నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా!ముక్తి మోక్షముల మాట విడిచి పెట్టు
జన్మ కర్మముల మాట జారబెట్టు
దేహీ అంటున్నా దేహ భ్రాంతి తుడిచిపెట్టు
మహేశా . . . . . శరణు

శివోహం

శివా!వేదమైనా నాధమైనా ఉన్నదొకటే అంటోంది
వాదమంతా  ఇలలోనే , కాదు వేయి అంటోంది
వేషమేదైనా గానీ వేయిగా వున్నది నీవే
మహేశా . . . . . శరణు.

శివోహం

శంభో...
నీవు నా తోడుండగా
పోరాటమేమిటి...
మరణానికైనా సిద్ధమే...
మహాదేవా శంభో నీవే శరణు.

Friday, October 15, 2021

శివోహం

పరమేశ్వరా!!!!!ఏమి కోరను 
ఇచ్చితివి నాకిల సుందర దేహము
అంతో ఇంతో విజ్ఞానము
కడుపు నిండుటకు సరిపడు అన్నము
పలికే ప్రతి మాట నీనామ మవనీ
తలిచే ప్రతి తలపు నీ భావమవనీ
వేసే ప్రతి అడుగు నీవైపె సాగనీ
చూసే ప్రతిచూపు నీరూపుపై నిలపనీ
మహాదేవా శంభో శరణు...

శివోహం

దేవుడు నాకు ఇది ఇచ్చాడని...
ఇది ఇవ్వలేదని ఆయన పట్ల నిర్లక్ష భావముతో ఉండ కూడదు...
లేచిన తర్వాత , పడుకొనేముందు కనీసము ఆ రుద్ర మూర్తిని తలుచు కొంటే మనము తెలిసో తెలియకో చేసిన పాపాలు పోతాయని...

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, October 14, 2021

శివోహం

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు పెద్దలకు గురువులకు విజయదశమి శుభాకాంక్షలు.

సర్వ శక్తిమయి
శత్రు సంహరిని
శూల ధారిణి   
శ్రీచక్ర వాసిని.   
సర్వ కారిణి     
శాంత రూపిణి. 
కాంత రూపిణి   
జ్ఞాన ప్రదాయిని 
జ్ఞాన రూపిణి
శుభ అభయ నభయములు కూర్చు అమ్మలగన్నయమ్మ శివుని దేవేరి తల్లి నీవే శరణు...

ఓం శ్రీమాత్రే నమః.


  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...