శివా!కర్మ ఫలమున జన్మ కూడి వచ్చినగాని
నిన్ను కొలిచెడి బుద్ది కలుగనిమ్ము
కలిగిన బుద్ది కైవల్య పదమున సాగనిమ్ము
మహేశా . . . . . శరణు .
శివా!నీ జాడ తెలుపమన్నాను
నా జాడ చెరిపివేయమన్నాను
నీవాడగ నన్ను నిలుపమన్నాను
మహేశా ..... శరణు.
శివా!అభిషేకమంటూ ఏమేమి పోసినా
చెట్టు క్రిందకు చేరి మేమేమి అడిగినా
అన్నింటా మౌనమా ,అది నీకు మోదమా
మహేశా. . . . . . శరణు .
ఈ ఆశల సౌధం ఆహుతయ్యేలోగా
నీ ఎఱుక కలిగించరా,నన్ను విడిపించరా
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment