Wednesday, January 31, 2024

శివోహం

గడచిన కాలం ముందుకు రాదు...
నడుస్తున్న కాలం నీవు  ఆపలేవు...
వర్తమానం లో బంగారు భవిత కు పునాది వేసే ప్రయత్నం చెయ్యి...
నీ ముందు ఉన్న కాలాన్ని శక్తిని జ్ఞానాన్ని ,భక్తితో జ్ఞాన సముపార్జన కొరకై పరమాత్ముని సన్నిధానం లో జీవితాన్ని గడపడానికి  ఉపయోగించాలి...
మనమందరం కూడా అలాంటి అద్భుత వైభవ భావ సంపద ను అనుగ్రహించమని కోరుకుందాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మనసుకు మనిషికి మధ్య బతుకు 
పోరాటం లో ఉరుకుల పరుగుల జీవితం లో రూపం లేని మనసు ఉనికి కోసమే నా ఆరాటం.

శివ నీ దయ.

శివోహం

శివా!తెరిచిన కనులను మూసి
మూసుకున్న కన్ను కాస్త తెరిచేలా
మూడు కన్నుల మర్మం మనసుకెక్కనీ
మహేశా . . . . . శరణు .

Tuesday, January 30, 2024

శివోహం

సముద్రంలో కలిసే నదిలా
సాగి పోతున్నా శివా
వేషాలు వేసే నటుడిలా 
వేస్తూ బ్రతుకు తున్నా శివా  

భూమిపై ఎందుకున్నానో తెలవలా
భూమికి భారంగా ఉండలేను శివా   
పాత్ర ఔచిత్యంలో బ్రతికే దెలా 
బ్రతుకే ఒక నాటక మైనది శివా 

వయసుకు న్యాయం చేయలా 
ప్రేమను పంచ లేకపోతున్న శివా 
ఏమి పొందానో ఏమి కోల్పోయానో ఎలా 
ఏమి జ్ఞప్తికి రాని జీవి నైనాను శివా 

ఆశయం వదలి ఆశకు చిక్కాను ఎలా 
ప్రకృతికి భార మైనాను శివా 
జీవన పోరాటంలో నీవు గుర్తుకు రాలా
నిన్ను పూజించక నిర్లక్ష్యం చేశా శివా 

నా అజ్ఞానాన్నీ మన్నించేది ఎలా  
నన్ను కరుణించి కాపాడవా శివా 
కుటుంబం కోసం ఆరాటపడి బ్రతికేదెలా
నీ శాన్నిత్యాన్ని పొందాలని ఉంది శివా  

తెలియదు నీ అనుగ్రహము పొందేదెలా 
కార్తీక మాసం పూజ చేస్తున్నా శివా 
మూర్ఖత్వ వాత్లల్యంతో బ్రతికేదేలా
నాతండ్రిగా నాకు మోక్షము ఇవ్వవా శివా.

శివోహం

శివా!నీవెంచుకున్న వాసం కైలాసమైతే
మా గుండె గుహల మాట ఏమిటి
తేల్చి చెప్పుము మాకు తెలియునటుల
మహేశా . . . . . శరణు

శివోహం

కథలన్నీ కాలా(శివుడు)నికెరుకా...
ముగింపు తెలియని నాకెమెరుకా.

శివ నీ దయ...

శివోహం

భగవంతుడు
గుణరహితుడు
దయామయుడు
పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో... అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు...
నిత్యం శివపార్వతులకు ప్రార్ధన చేసినవారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాదిస్తారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, January 29, 2024

శివోహం

నీవు అనంతు డవు...
అఖండ తేజో నిధివి...
నిన్ను తెలియలేను...
నన్ను తెలుసుకొలేను...
సూత్రధారిగా ఉంటూ...
నీవాడించే జగన్నాటకం లో
ఒక పాత్రధారినీ మాత్రమే నేను...
వట్టి తోలుబొమ్మను...
నీవు లేకుండా నేను లేను...
ఆశలు నాలో పుట్టించి..
తప్పులు చేయ అజ్ఞాపించకు...
నన్ను నీ నుండి దూరం చేయకు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మనసు బరువెక్కినప్పుడు ఓ
నాలుగక్షరాలు నీపై రాసుకుంటా శివ నీ దయ అంటూ ఉంటా.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ నీ కారుణ్యము ప్రత్యక్షముగా చూచితిని అందుకు మిమ్మల్ని కారుణ్య సింధు అని పిలుస్తున్నాను...

మీ యొక్క రక్షణను ప్రత్యక్షముగా గా చూచితిని అందుకు మిమ్మల్ని భద్రాత్మకా అని పిలుస్తున్నాను...

మీ యొక్క ప్రేమను ప్రత్యక్షముగా గాంచితినిని  అందులకు మిమ్మల్ని భక్తవత్సల అని పిలుస్తూ ఉన్నాను...

మహాత్మా నా పుట్టుకకు కారణం నీవే కనుక మిమ్మల్ని పరబ్రహ్మ అని పిలుస్తూ ఉన్నాను
.
ప్రాణనాధా ! నన్ను ఎప్పుడు ఎడబాయక ఉంటావు అందుకు మిమ్మల్ని అంతర్యామి అని పిలుస్తూ ఉన్నాను.

మహాదేవా శంభో శరణు.

Sunday, January 28, 2024

శివోహం

శివా!నా స్మరణలో సాగకుండా
నా స్పురణ లోకి రాకుండా
ఎందు యేగుతున్నావు ఏలికా
మహేశా . . . . . శరణు .

శివోహాం

అంతటా తానై...
అన్నీ తానై...
అందరిలో తానై...
ప్రాణుల మనుగడకు...
సృష్టి  స్తితి లయాలకు...
కాలచక్ర భ్రమనానికి కారణ భూతమై...
సూర్య చంద్రుల రూపంలో...
కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు...
నిత్యం మమ్మల్ని కాపాడు...
మహాదేవా శంభో శరణు...

జై శ్రీరామ్ జై హనుమాన్

రామ నామం చేయండి
ఆస్వాదించండి
ఆస్వాదించి ఆనందించండి
ఆనందించి తరించండి

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్

శివ నీ దయ

శివా!నీ తల చుట్టూ తిరిగినా
నీ తల వాకిట నిలిచినా
నీ తరుణిగ తెలియలేదు నిక్కముగా
మహేశా . . . . . శరణు .

శివోహం

"నేను"
దూరం అయితే తప్ప
నీదైన గమ్యాన్ని చేరలేనా కదా శివ ఇదంతా...
అలాగే కానియండి మరి.
శివ నీ దయ.

శివోహం

శివా ! 
నేనో పశువుని...
నీవు పశుపతివి...
ఇంతకంటే ఏం కావాలి సంబంధం...
నాపై నీవు దయ చూపించటానికి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది పరమేశ్వరా
నీవే నాకు కొండంత అండగా ఉండి
నన్ను కాపాడగారావా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఓం నమో భగవతే వాసుదేవాయ 



ఈ లోకములో శాశ్వతం అయినదంటూ ఏదీ లేదు. లోకమే శాశ్వతం కానపుడు అందులో ఉండే వస్తు విషయాలు శాశ్వతం ఎలా అవుతాయి?! కనుక ఇది లేదు, అది లేదు, ఇది పోయింది, అది పోయింది అని ప్రతీ విషయానికి చింతిస్తూ కూర్చోకండి! దైవముపై భారము వేసి మీ ప్రయత్నము మీరు చేయండి. ఆత్మానందం కొరకే భగవంతుణ్ణి ద్యానించండి. జీవన ఉపాధి కోసం పరిస్థితులు సహకరించడం లేదని చింతించకండి.. ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా సరే భగవంతుని అనుగ్రహం చేత భస్మం కాక తప్పదు.

శివోహం

దిగులు వీడని దూరంలో నేను..
నీ చిన్నమాట కోసమని ఎదురుచూస్తూ.

శివ నీ దయ.

శివోహం

ఆ నలుగురిని సంపాదించాలని అనుకోగానే...
నితో బంధం బలపడింది.

శివ నీ దయ.

శివోహం

శివ...
నీ నామ స్మరణమే నాకు ఊపిరి...
నీ దివ్య దర్శనమే నాకు దినచర్య...
నీనామ స్మరణే నా ఊపిరి...

శివ నీ దయ.

శివో

పరబ్రహ్మస్వరూపిణి...
నారాయణి...
శివాని...
సర్వదేవతా స్వరూపిణి...
అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి స్వరూపిణి.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ దుర్గమ్మ శరణు.
ఓం శ్రీమాత్రే నమః

శివోహం

భవిష్యత్తు అందంగా పేర్చుకోవాలంటే..
గతాన్ని బూడిద చేసేయాలి.

కలం *శ్రీమహన్ రుద్రన్ష్.*

శివోహం

అటూ ఇటూ నీ తలపులే...
అదే
నా హృదయానికి పదివేల పలకరింపులు 

శివ నీ దయ



శివోహం

కర్త నీవు
కర్మ నేను
క్రియ ?
నా, నీ...కానిది
నీ, నా...అయినది
నీవే నాకు అన్నీ పరమేశ్వరా

మహాదేవా శంభో శరణు

Saturday, January 27, 2024

శివోహం

పంపావాస పాపవినాస...
శబరిగిరీశ శ్రీ ధర్మ శాస్త్ర...
అధ్భుతచరితా ఆనందనిలయా స్వామి...
నా మనసు తాడు లేని బొంగరం...
సజ్జన సాంగత్యం అవసరం.

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

ఈ కదిలే బొమ్మ...
కట్టెలో కాలి...
నీకు భస్మం మై అభిషేకిస్తే అంతకంటే అదృష్టం ఎం ఉంటుంది...
మహదేవా శంభో శరణు.

శివోహం

వస్తూ వస్తూ గుండెలా నిండా నింపుకువచ్చిన ఆనందాలు ఒలికిపోయినందుకేమో నా కన్నుల సరిహద్దుల్లో కన్నీళ్ళు.

శివ నీ దయ.

శివోహం

గుప్పెడు ప్రేమను కోరుకున్నందుకు...
నీవేమో గంపెడు కలలను కుమ్మరించావు...


శివ నీ దయ

శివోహం

శివా!ఇలా నందితో నడకేమిటి
ఓపనిమ్ము కాస్త నా మోపున
నమ్మి రమ్ము నన్ను నీ సేవలో
మహేశా . . . . . శరణు .

శివోహం

కనిపించేది వెలుగు...
కనిపించనిది చీకటి...
చీకటి వెలుగులు కనులు మూసుకున్న మౌనంలో చూసే భాగ్యం ప్రసాదించు పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నింగి నేలల నీవె మా తోడువైనావు
ముందు వెనుకల నిలిచి రక్షగా తెలిసేవు
చింత లేకుండగ మా చింతలో నిలువుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!నింగి నేలల నీవె మా తోడువైనావు
ముందు వెనుకల నిలిచి రక్షగా తెలిసేవు
చింత లేకుండగ మా చింతలో నిలువుమా
మహేశా . . . . . శరణు .

Friday, January 26, 2024

హరి మాయ

నాలో నేను మాయమైనప్పుడే అనుకున్నా..
నాకు తెలీకుండా ఎవరో చేరుంటారని...
హరి అది నీ మాయెకదా..
ఓం నమో నారాయణ.

ఓం పరమాత్మనే నమః

శివోహం

శివ...
నేను ఆనే ఈ దీపం కోండఏక్కే లోగా
నీ దయ కు పాత్రుడు అయ్యేలా దీవించు శివ
నేను పడే ఈ కష్టందేముంది కాలం తో 
పాటు వస్తుంది కాలంతో పాటు వేలుతుంది
భక్తవ శంకర నీ కృపకు దారి తేలుపవయ్య శివ..

మహాదేవా శంభో శరణు.

Thursday, January 25, 2024

శివోహం

శివా!ప్రకృతి నిండిన పురుషుడు నీవు
ఆ పురుషుడు పంచిన తేజము మేము
మాలోని నిన్ను మనసార చూడనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

సకలవరాలు ప్రసాదించే దయామయీ...
సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ...
అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ...
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ...
భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ...
మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ !..
దుర్గాదేవి నీకు నమస్కారము.
అమ్మ నీ దయ అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

సకలవరాలు ప్రసాదించే దయామయీ...
సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ...
అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ...
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ...
భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ...
మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ !..
దుర్గాదేవి నీకు నమస్కారము.
అమ్మ నీ దయ అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

ఋతువులకు అతీతమైన వర్షం..
నా కన్నుల్లో కురుస్తోందెందుకో. 

శివ నీ దయ.

Wednesday, January 24, 2024

శివోహం

శివా!అంతట ఆవరించిన నీ తేజం
గూడు కట్టి గుండెనుండట అది చోద్యం
గుండెలోకి చేరనీ అంతట నిను చూడనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నువ్వు కానిది ఏది?...
నువ్వు లేనిది ఏది?...
సర్వాంతర్యామి నువ్వు సర్వం సృష్టించినవాడవు...
కడు కష్ట మయినా, కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
అందుకే నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను...
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.

మహాదేవా శంభో శరణు.

Tuesday, January 23, 2024

శివోహం

శివ...
మనస్సు వాక్కు రెండు వైపుల
కర్మను మధ్యలో ఉంచి నా జీవన త్రిశూలం నీ చేతిలో ఉంచుకున్నావు..
నా ఆలోచనలకు అధిపతివి...
నా ఆచరణకు అధికారివి నీవు...
నాహృదయానికి ఆత్మీయుడవు నీతో నన్ను నిలుపుకో శివా కన్నప్ప లా.
మహాదేవా శంభో శరణు.

Monday, January 22, 2024

శివోహం

మనస్సును కదిలించే దివ్యమైన మంగలకరమైన దృశ్యం తో ఒక గంట సేపు లయం చేస్తూ తాదాత్మ్యం పొందడమే దైవభక్తి...

ఇలా మనలో దైవారాధన భావము పెంచుకోవడం కన్నా మహాభాగ్యం జీవితంలో ఇంకా  ఏముంటుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నీ కన్నుల తేజాన్ని శశి భానులకందించి
శశి భానుల వైభవాన్ని రేయి పగలుగా తెలిపి
కాల గతిని కనుగొనక కరుణించావు.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ!!!మనిషిలా ఎందుకు పుట్టించావు నాకు ..
నీటిలోని ప్రతిబింబం లాగా నో లేక నీటి మీది గాలి బుడగలగా పుట్టిస్తే బాగుండు కదా శివయ్య...

 పలకరింపు లాంటి బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోయేదేమో నేను...

ఇక ఈ జన్మనైన సరి చేయవయ్య నీ కుడికల తీసివేతలతో....

మహాదేవా శంభో శరణు...

సత్యమైన మాట

వచ్చినపుడూ ఒంటరిగనే...
ఒంటరిగనే తిరుగు పయనం...
నడుమ ఒంటిగ గడుపనేర్వని...
ప్రతి జీవితం చిర అశ్రునయనం...

Sunday, January 21, 2024

శివోహం

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనో రమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే.

జై శ్రీరామ్ జై శ్రీరామ్.
ఓం పరమాత్మనే నమః

Saturday, January 20, 2024

శివోహం

శ్రీరామ జయ  రామ జయజయ రామా
జగధభి రామ పావన నామ 2

శివుడే నిత్యం స్మరణము చేసే
మహిమాన్వితము  నీ నామం
స్మరణం మధురం శ్రవణం మధురం
తారక మంత్రం  నీ నామం

కౌశల్యా పతి కలల వెలుగువై
కన్నుల నిలిచిన కోదండ రామ
కౌశిక యాగము కాచిన ఘనత
కోటి దాటెను వినినంత

మిథిలా పురిలో  విల్లుని తాకి
నారిని కూడి రాజిల్లేవు
కళ్యాణమున కాంతుల మెరిసి
లోక కళ్యాణానికి కదిలేవు .

జనవాసమున శాంతి నింపగా
వనవాసమున సాగేవు
అసుర శక్తుల ఉసురును తీసి
విశ్వశాంతిని కూర్చేను

రాజ్య పాలనను రాజిల్లేవు
రామ రాజ్యమును చూపేవు
భవితకు బాటను చూపించేవు
ఆ బాటను నీవే భాసించేవు

ధర్మ రూపమును ధరియించి
దివ్య తేజమున వెలిగేవు
నాడు నేడు ఏనాడూ
ఆదర్శ మూర్తిగా తెలిసేవు

జయజయరామా జగదభిరామా
జానకిరామా శ్రీరామా

శివోహం

శివా!సుందరమైన రూపము వుండి
కంఠము నందు కాలము నిండి
కనిపిస్తావు కన్నున మండి
మహేశా . . . . . శరణు .

Friday, January 19, 2024

శివోహం

శివా!నీ పేరుకు పద్దే లేదు
నీ రూపుకు నియమం లేదు
నీ తీరు తెలియగ రాదు.
మహేశా . . . . . శరణు .

శివోహం

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప...

మహాదేవా శంభో శరణు.

ఓం శ్రీమాత్రే నమః

పరబ్రహ్మస్వరూపిణి...
నారాయణి...
శివాని...
సర్వదేవతా స్వరూపిణి...
అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి స్వరూపిణి.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ దుర్గమ్మ శరణు.
ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...