శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Sunday, June 30, 2024
Saturday, June 29, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
లింగ రూపం లో
అందరికీ దర్శన మిస్తావూ
కానీ నీ నిజ రూపం
తెలియదయ ఎవరికీ
ఆది అంతం లేని
ఆద్యుడవు నీవూ
పరమ శివుడవు నీవు
నీ కంటూ ఓ స్థానం లేదు
నిరాకారుడవు నీవు
నిరంజనుడవు నీవు
సదాశివా నిను నిరతము
పూజింతు నేను మహాదేవా!
మరు భూమిలో వశించే
భూత నాధుడవు నీవు
అన్నపూర్ణనే తిరిపమడిగిన
అర్ధనారీశ్వరువు నీవు
సర్వ శుభంకరుడవు
గోవిందా
సర్వలోక నాయకా
శ్రీ ఆశ్రిత రక్షకా
శ్రీ సర్వసంపద దీపికా
శ్రీ దేవి వల్లభా
శ్రీ అభయప్రధాతా
శ్రీ పద్మనాభా
శ్రీ వేణునాదామృతా
శ్రీ వేంకటేశ్వరా శరణు...
Friday, June 28, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయలే. మరి మన కర్తవ్యం మాయలసృష్టి కర్త పరమేశ్వరుని ధ్యానించటం.
లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు
ఇందుకు మూలం, ఈశ్వరునియొక్క మాయ కళలైనట్లే
కొబ్బరి కాయలో, నీరుపోయక నీరు వచ్చి నట్లు
శుభం అనేది, ఎవ్వరు తలవ కుండా వచ్చినట్లే
గజం తిన్న వెలగపండులో, గుజ్జు మాయ మైనట్లు
మన నుంచి పోవలసినది, విడిచి పోయి నట్లే
శ్వేత అద్దంలో నీడ స్పష్టముగా కన బడినట్లు
జీవులు ప్రేమ సందడిలో పుట్టుకలు వచ్చినట్లే
చెట్టుకు పండిన పండు తెగి నేలపై పడినట్లు
కాలము వెంబడించిన జీవులు మరణించినట్లే
రాతిపై కడవను పెట్టగా, కుదుట పడినట్లు
జీవి ఏకాగ్రతతో, మనసు కుదుట పడినట్లే
ఉదయ భానుని వెలుగుకే, మంచుకరిగి నట్లు
పరమేశ్వరుని ప్రార్ధించితే, పాపాలు పోయినట్లే
లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కినుక వహించావు నా ఎడ ఎందుకో...
నా దోషమేమో మరి అలక బూనినావు...
నావైపు నీచూపు ప్రసరించవైతివేలనో హర
తొందరపాటుగనో నా పొరపాటుగనో తెలిసీతెలియకా నే చేసిన తప్పులకు ఏ శిక్ష వేసిన నే సిద్ధమే...
నా పైన దయ చూపు తండ్రి.
Thursday, June 27, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తి ఒక అద్భుతమైన దైవాంశ...
అది ఒక అనుభవైక వేద్యము...
పరమానంద భరితము అద్భుతము...
అపురూపమైన దివ్యా నుభవం...
యోగ శక్తి కంటే, భక్తి కివున్న శక్తి చాలా గొప్పది...
ఎందుకంటే భక్తి లో అహంకారం ,మమకారాలు ఉండవు...
అది అద్వితీయమైన భావ సంపద...
ప్రతీ ప్రాణి దైవ స్వరూపమే...
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
బతకమని పుట్టుక ఇస్తావు...
బంధాల ఉచ్చులో విసిరేస్తావు...
కష్టాల సాగరంలో తోస్తావు...
బతుకంటే ఇది అని తెలిసేలోగా...
నీ దగ్గరకు లాగేస్తావు...
నువ్వు ఆడే ఈ నాటకంలో మేమంతా ఆట బొమ్మలమనితెలిసేలా చేస్తావు.
Wednesday, June 26, 2024
హరే శ్రీనివాస
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరి శ్రీహరి!
సర్వత్రా వెలుగును ప్రసరించే నీకు...
వెలుగులోకి వెలుగేలా ఈ హారతులేల...
ఒక్క క్షణం దర్శనం చేతనే ఏడు జన్మల మా పాపములు హరింతువు..
పాప హరుడికి కోనేటి స్నానాలేల ఈ అభిషేకాలేల...
ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తెప్ప తిరుణాళ్ళేల, బ్రహ్మోత్సవాల్లేల...
మా ఆజ్ఞానాన్ని తొలగించాడానికే కదా ఈ హారతులు!
మములను ప్రక్షాళన గావించడానికే కదా ఈ స్నానాలు...
మము ప్రఖ్యాతి గాంచడానికే కదాఈ ఉత్సవాలు.
గోవిందా శరణు.
ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అమృతమే నీవు...
అద్భుతమే నీవు...
ఆనందమే నీవు...
ఆద్యంతమే నీవు...
అద్వైత్వమే నీవు....
శివ శిరమేదైనా నీకు శిరసు వంచి నమస్కరించే తీరున నీ చేరువలో ఉంచుకో తండ్రి.
Tuesday, June 25, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తే ప్రేమ...
ప్రేమే భక్తి...
ప్రేమే ఆరాధన...
ప్రేమే దైవం...
ప్రేమే పరమాత్ముని స్వరూపం...
ప్రేమే ఈశ్వరీయగుణం...
ప్రతి ఒక్కరి అంతఃచేతనల్లో వున్న అంతరాత్మే ప్రేమస్వరూపుడైన దైవం...
నా అనేవారికే పరిమితం చేయకుండా అందరిలోవున్న ఆత్మే ప్రేమస్వరూపుడైన భగవంతుడని గ్రహించి, దయార్ధమైన ఆలోచనలూ, మాటలు, చేతలతో అందరితో ప్రేమగా ఉంటే పరమాత్మను పొందగలం...
భగవంతుని ప్రేమను పొందాలంటే మనలో ప్రేమతత్వమును పరిపూర్ణంగా పెపొందించుకోవాలి. సర్వదా, సర్వత్రా ప్రేమతో, సంయమనంతో, సహనంతో వుండాలి...
అంతటా ఈశ్వరున్నే చూడగలిగే స్థితిలో వుండగలగాలి...
మనం పరిపూర్ణమానవులుగా ఎదగాలంటే మనస్సుకు ఏ స్థితిలోనైనను ప్రేమ, దయ, ప్రశాంతత, సృజనాత్మకతతో వుండగలగడం నేర్పించాలి...
అదే నిజమైన భక్తి...
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కరుణ గల దేవుడవు...
స్మరణ సులభుడవు...
స్ఫురణకు సోహంలో ఉన్నావు...
నీ చరణాలే నాకు దిక్కు మొక్కు...
మహాదేవా శంభో శరణు.
Monday, June 24, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ...
నీ నామం మాకు శ్రీరామ రక్ష...
నీ భావం మాకు ఎనలేని సంపద...
నీ శ్రీశైల క్షేత్రం మాకు ఆనంద నిలయం...
నీవు లేకుండా మేము లేము...
నీ తలంపే మా బ్రతుకులకు మనుగడ...
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీవు నాకు ఉత్తమ జన్మను ఇచ్చావు
నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను...
అందుకే నా మనసును నీకు అంకితం చేస్తున్నాను నీ దగ్గరే ఉంచేసుకో.
మహాదేవా శంభో శరణు
Sunday, June 23, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ముల్లోకాలకు తండ్రివి నీవు..
మము కాచే దైవం నీవు...
మోక్షమొసగే సాంబడు నీవు..
జగాలను బ్రోచే జంగమదేవరు నీవు..
అన్నీ నీవే,అంతా నీవే ఈశ్వరా.
నీవే సర్వం నీవే సకలం..
మహాదేవా శంభో శరణు.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
నీ రాతలు శిల రాతలు కావు...
మా తల రాతలు...
చెరగనివి మేమెరుగనివి...
Saturday, June 22, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరిహారపుత్ర అయ్యప్ప...
నాకు నీ మంత్రము తెలియదు నీ యంత్రమూ తెలియదు...
నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాధలు చెప్పడమూ తెలియదు...
నీ ముద్రలూ తెలియవు...
ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ కూడా చేత కాదు....
కానీ నీవే నా నమ్మకం నిన్ను విధేయతతో స్మరిస్తే నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భగవంతుని నామ జపం ఎంతటి చెడునుండైనా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలాగే, భగవంతుని నామస్మరణ చేత అన్ని బాధలు దగ్ధం కాగలవు. మడి, ఆచారము అవసరము కాదు. క్రమం తప్పకుండా జపించడం ముఖ్యం. హనుమంతుని శక్తి రహస్యం నిరంతర రామనామ జపమే.
ఓం శివోహం... సర్వం శివమయం
Friday, June 21, 2024
గోవిందా
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరి!
సకల ప్రాకోటికి మోక్ష మార్గంచూపు జ్ఞాన దీపం నీవు...
మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి నీవు...
నీ నామ జపం తో మా మనస్సుకు ప్రశాంతత కల్పించే దివ్య మంగళస్వరూపుడవు.
నీవే శరణు నీకె శరణు.
ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
హలమును దాచి...
గళమును విప్పి వచ్చావు
రుద్రనాయకుడి వై
భధ్రమూర్తి లా నడిపిస్తావు
కాలహరుడి వై
సృష్టి చక్రము ను శాసిస్తావు
మోక్షనాధుడి వై
ఆత్మఘోషలకు కరుణిస్తావు
భస్మరూపుడు వై
విశ్వము నే పరిపాలిస్తావు
నీకు సాటి ఎవరు లేరాయా హర...
నీకు నీవే సాటి..
Wednesday, June 19, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భోగభాగ్యాలు ఇచ్చు భువనైక మాతా...
భవబంధాలను తొలగించు భాగ్య చక్ర స్వరూపిణి...
పాయసాన్న ప్రీతీ శ్రీకంఠార్ధ శరీరిణీ పంచ సంఖ్యోపచారిని..
ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి స్వరూపిణి...
ఇష్ట కార్యములు తీర్చు అష్ట దరిద్రాలు తొలగించు
కష్ట సుఖములందున కొలిచిన వారికి అష్ట ఐశ్వర్యములు ఇచ్చు పసిడి అలంకృత పాపనాశిని పాహిమాం దుర్గేశ్వరి.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...
సంధికాలంలో నవవసంతం
పుడమి దాటి పరవళ్లు తొక్కుతోంది.
ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...
ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.
Tuesday, June 18, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాకుండే ఒకే నేస్తం నీవు
హృదయంలో నెలకొన్న నీ రూపం
నీ నామమే పరవశంలో ఏ పేరు తలిచినా పొంగే హృదయం
నీ నామ మాధుర్యంలో నిత్యం ఏకాంతమే
కొంచెం నాకూ చోటివ్వు
నీ హృదయం లో సర్దుకు పోతాను.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాకుండే ఒకే నేస్తం నీవు
హృదయంలో నెలకొన్న నీ రూపం
నీ నామమే పరవశంలో ఏ పేరు తలిచినా పొంగే హృదయం
నీ నామ మాధుర్యంలో నిత్యం ఏకాంతమే
కొంచెం నాకూ చోటివ్వు
నీ హృదయం లో సర్దుకు పోతాను.
Monday, June 17, 2024
Sunday, June 16, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
గుండె నిండుగా చేసుకొని
గుండంలొ నిండా మునిగి గురి నీ మీద పెట్టుకొని
గుడి గంట ఠామ్మని కొట్టి నిలిస్తిని నీ ముంగిట
చెంబెడు నీళ్ళు కుమ్మరిస్తి
నీ లింగ మీద పత్రి పెడితిని
నా వంక దయతో చూడమని
సాగిలబడి నీకు మొక్కుకుంటిని.
Friday, June 14, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
మణికంఠ....
నా ఈ దేహంలో ని వేలాది నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ...
పాల పొంగులా పొరలే అనందాన్ని నా ఎదలో ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది...
నీ దివ్య నామాన్ని నోరారా స్తుతిస్తూ ,తన్మయం పొందే పరమ సౌఖ్యాన్ని ఈ నా నాలుకకు అందించవా...
హరహర పుత్ర అయ్యప్ప శరణు.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
మదిలో కలవరం కనిపించే లోకం పోకడ...
యదలో అలజడి కదిలే కాలం తీరు...
నీ ఆటలో పావును కదా
బందాల బందీకానలో బందించి , ఆశల పాశాలలో శోదించి ...
మనసును మరీ రాటుదేలుస్తున్నావు మహాదేవా...
మరో అధ్యాయానికి తెర తీస్తున్నావు...
ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే శివ...
Thursday, June 13, 2024
గణేశా
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గణేశా...
నీ దివ్య దర్శనము మాకు కలిగించు...
పార్వతి సుతుడా పరమేశ్వర పుత్రుడా...
సిద్ధి బుద్ధి గణపయ్య కరుణ చూపు మాపై...
నీ దీవెనలు అందించు లంబోదర
నీవే దిక్కని మొక్కే మాకు
దయతోడ మమ్ము కాపాడుమయ్య
గణపయ్య నీవే శరణు
ఓం గం గణపతియే నమః.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీ కిరణం నన్ను తాకింది...
ఒక వెలుగై నన్ను నాకు చూపింది...
నీ ఓంకారం నా చెవిన మారుమోగుతుంది.
Wednesday, June 12, 2024
శివోహం
ఓం నమో భగవతే వాసుదేవాయ
మార్పు కలిగేదే జీవితం.. నేడు మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు.. ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు, నడపడానికి సౌకర్యంగా లేదని కారుని మారుస్తున్నాడు, పొగడ్తలు లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు, లాభం రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు, చివరిగా కష్టాలు తొలగడం లేదని దేవుల్ని సహితం మార్చేస్తున్నాడు కానీ ... తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు!! నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవతలది కాదు!! కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.. మంచి భావాలను కలిగి ఉండాలి.. చెడు భావాలు, చెడు అలవాట్లను వదలాలి.. దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి. అపుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది.
హరే కృష్ణా
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
కృష్ణ అన్న పదం ఒక పేరు కాదు...
ఒక భావం...
ఒక విశ్వ గానం...
సకల సృష్టికి మూలం...
అనంత రూపాలు నామాలు గలిగిన దేవదేవునికి . హరే కృష్ణా అంటూ నిత్యం స్మరిస్తూ తరించడం వల్ల మనసుకు ఎంతో ఆనందం ,ప్రశాంతత ఉంటుంది...
హరే క్రిష్ణ హరే రామ్.
శివోహం
శివా!సమాప్త మెరుగని కథలు సశేషమై
కూడుతున్నాయి కుప్పలు తెప్పలుగా
కథలు ముగియనీ కంచికి చేరనీ
మహేశా . . . . . శరణు .
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ప్రతీ తాళానికీ నీవు మాత్రమే తీయగల చెవి తయారు చేయగలవు...
నా బతుకు తాళం చెవి నీ చేతిలో ఉంది...
నా తండ్రి పరమేశ్వరా నన్ను లోపలపెట్టి తాళం వేస్తావో...! బయటకు తోసేస్తావో నీ దయ తండ్రి.
Sunday, June 9, 2024
శివోహం
*🙏🏻🌺 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🏻*
*_🌴 మార్పు కలిగేదే జీవితం.. నేడు మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు.. ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు, నడపడానికి సౌకర్యంగా లేదని కారుని మారుస్తున్నాడు, పొగడ్తలు లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు, లాభం రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు, చివరిగా కష్టాలు తొలగడం లేదని దేవుల్ని సహితం మార్చేస్తున్నాడు కానీ ... తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు!! నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవతలది కాదు!! కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.. మంచి భావాలను కలిగి ఉండాలి.. చెడు భావాలు, చెడు అలవాట్లను వదలాలి.. దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి. అపుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది .🌴_*
Friday, June 7, 2024
శివోహం
సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు.. సృష్టిలో అన్నింటికన్నా విలువైనది కాలము.. అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి ఏ విధముగా శాశ్వతము అవుతాయి?! ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు! కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు దుఃఖములు, కష్టములు!. రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?! లేదు కదా!! శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.. అది శరీరము పుష్టికి శాశ్వతము.. అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము.. అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.. కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము. ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి.
శివోహం
మరిచిపోలేదు తండ్రి...
నీకు తెలియంది ఏముంది...
రాజీనామా లేని జీవితం కదా...
ఎప్పటికి నా పరుగులు నీవైపే.
శివ నీ దయ.
Wednesday, June 5, 2024
Saturday, June 1, 2024
శివోహం
అంతులేని లోకంలో...
అనంతమైన రూపాలలో
ఎన్నెన్నో దేహాలు...
మరెన్నెన్నో బంధాలు
బంధాల వలలోనే మా బ్రతుకు జీవన బాటలు...
ఆ బాటలో నడిచేది మేమె ఐన నీవే హర.
సంబంధం అనే నాటకం తో ముడి వేసి...
అనుబంధం అనే మాయలో మమ్ములను ముంచి
చివరికి కర్మ బంధాలను తుంచి విలపించేలా చేస్తావు.
నీ ఆటలు నీవే.
మహాదేవా శంభో శరణు.
Subscribe to:
Posts (Atom)
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
-
శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది. నిన్ను చేరే దారిలో భయమేమి కలగక...