Sunday, June 9, 2024

శివోహం

*🙏🏻🌺 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🏻*



*_🌴 మార్పు కలిగేదే జీవితం.. నేడు మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు..  ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు, నడపడానికి సౌకర్యంగా లేదని కారుని మారుస్తున్నాడు, పొగడ్తలు లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు, లాభం రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు, చివరిగా కష్టాలు తొలగడం లేదని దేవుల్ని సహితం మార్చేస్తున్నాడు కానీ ... తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు!! నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవతలది కాదు!! కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.. మంచి భావాలను కలిగి ఉండాలి.. చెడు భావాలు, చెడు అలవాట్లను వదలాలి.. దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి. అపుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది .🌴_*

Friday, June 7, 2024

శివోహం

సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు.. సృష్టిలో  అన్నింటికన్నా విలువైనది కాలము.. అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి ఏ విధముగా శాశ్వతము అవుతాయి?! ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు! కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు  దుఃఖములు, కష్టములు!.  రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?! లేదు కదా!! శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.. అది శరీరము పుష్టికి శాశ్వతము.. అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము.. అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.. కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము. ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే  దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి.

శివోహం

మరిచిపోలేదు తండ్రి...
నీకు తెలియంది ఏముంది...
రాజీనామా లేని జీవితం కదా...
ఎప్పటికి నా పరుగులు నీవైపే.

శివ నీ దయ.
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

Thursday, June 6, 2024

శివోహం

శివా!విశ్వానికి వేదిక నీవు
మౌనానికి మూలం నీవు
మననానికి ముత్రం నీవు
మహేశా . . . . . శరణు .

శివోహం

అలలు లాంటిదే ఈ కష్టాలు..
తీరం(నీ దయ) తరిమికొడితే వెనుదిరుగి పోతుంది.

శివ నీ దయ.

Wednesday, June 5, 2024

శివోహం

శివా!ఈ తేజం నీది ఈ భీజం నీది
ఈ రాజ్యం నీది భోజ్యం నాది
భజించి నిన్ను తరించనీయి
మహేశా . . . . . శరణు .

Saturday, June 1, 2024

శివోహం

అంతులేని లోకంలో...
అనంతమైన రూపాలలో
ఎన్నెన్నో దేహాలు...
మరెన్నెన్నో బంధాలు
బంధాల వలలోనే మా బ్రతుకు జీవన బాటలు...
ఆ బాటలో నడిచేది మేమె ఐన నీవే హర.
సంబంధం అనే నాటకం తో ముడి వేసి...
అనుబంధం అనే మాయలో మమ్ములను ముంచి
చివరికి కర్మ బంధాలను తుంచి విలపించేలా చేస్తావు.
నీ ఆటలు నీవే.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...