ఎన్ని వేదనల్లో తడిచిందో నా ఈ గుండె...
ముగింపులేని మనోవ్యథ కు మృత్యువొచ్చి(శివుడు) కరుణించాల్సిందే.
శివ నీ దయ.
తెలుసుకో తెలుసుకో విలువ తెలుసుకో
తాగునీరు సాగునీరు విలువ తెలుసుకో
ప్రాణానికి మూలం నీరు అని తెలుసుకో
నీరులేక జీవనం సాగదని తెలుసుకో
నీరంటని జీవిలేదు ఈ జగతిలో
నీరుంటే పచ్చదనం కూడును నీతో
వంటకైన పంటకైన నీరే మరి ఆధారం
చుక్క చుక్క కూడాలి చుక్కానిగ తెలియాలి
గట్టు కట్టి ఒట్టు పెట్టి నీరు దాచుకోవాలి
దాచుకున్న నీరు విలువ తెలిసి వాడుకోవాలి
యుగాలెన్ని మారినా జగానెన్ని కూడినా
మారలేదు అవసరం మారులేదు నీటికి సమం
బొట్టు బొట్టు కూడితేనే నీరు ఏరులయ్యేను
ఆ నీరు వ్యర్ధమయ్యేనా ఏరులెండి పోయేను
ఏరులెండిపోతే నీరు యింకిపోతే
బీడువారి భూములు కనిపించును మోడులు
కనిపించక నూకలు వినిపించును కేకలు
చెవిని నీవు తిప్పవద్దు పెడచెవిని పెట్టొద్దు
శివా!నీకు నిత్యాభిషేకాల కోసం
నీ సిగను చేరిన గంగ
పుడమికి పంపేవు మాకు వరముగా
మహేశా . . . . . శరణు
శివా!ఓంకారానికీ ఊపిరి నీవు
సకల సృష్టిలో సారము నీవు
విశ్వ జగతికి వేలుపు నీవు
మహేశా . . . . . శరణు .
శివా!పులి తోలు కట్టేవు శూలాన్ని పట్టేవు
పర్రె మాలను దాల్చి పరవశించేవు
నీది వైవిధ్యమే మాకు కన చోద్యమే
మహేశా . . . . . శరణు .
శివా!నీవు ఆడించే ఆటలో గెలుపు కావాలని నేను
గెలుపు ఓటమి లేవని నీవు ఆడుతూనే వున్నాము
తెగించి చెబుతున్నా ,ముగింపు నీ చేతుల్లోనే
మహేశా . . . . . శరణు .
శివా!అంతర్ముఖ పయనం తెలుసుకొమ్మని
ఆ రీతి నీకు నన్ను చేరవకమ్మని
ధ్యాన మూర్తిగ అగుపించి ఎఱుక నొసగావా
మహేశా . . . . . శరణు .
తండ్రీ
అదేనా మరణం అంటే
నాకు దూరం చేసి
పిడికెడు బూడిద మిగిల్చేది
అదేనా మరణం అంటే
నా వారు అనుకున్న
అందరికీ శాశ్వత సెలవు
ఇచ్చి ఒంటరి పయనానికి
సిద్ధం చేసేది
అదేనా మరణం అంటే
భవిత కోసం
తర తరాలకోసం అనుకున్న
ప్రణాళికలు అన్ని
తెంపేసి ఏ క్షణమూ
నాది కాదన్న సత్యాన్ని
చెప్పేది
అదేనా మరణం అంటే
మరోమారు పాప పుణ్యాలు
లెక్కలు తేల్చి
కొత్త ఉపాధులకు సాగనంపి
మాయలో ముంచి
మరపించేది
అదేనా మరణం అంటే
నీకు దూరమైన నన్ను
మరలా నీలో కలుపుకొనేది
అనంత మైన నీ కరుణకు
నన్ను పాత్రునిగా చేసేది
శివయ్యా నీవే దిక్కయ్యా
అలా ఒంటరిగా
నీ భృత్యుడిని నేను లేనా
నేను రానా?
మార్గ మధ్యములో
నీ పాదాలు ఒత్తుతాను
తెలుసుకొన్న ఆణువంత
విద్యతో నీ ప్రాభవాన్ని
కీర్తిస్తాను
ఎరుకలో వచ్చిన గోరంత
జ్ఞానంతో నీ వైభవాన్ని
పాడుతాను
నీకు సేవలు చేసుకుంటూ
నీ బిడ్డగా
నా జీవితాన్ని
ధన్యం చేసుకుంటాను
శివయ్యా నీవే దిక్కయ్యా
తండ్రీ
నీ గుండె చప్పుడు
ఓం కారం అయి ఉండొచ్చు
లేదా వేద మంత్ర ఘోష అయి ఉండొచ్చు
ఎప్పుడన్నా
ఎప్పుడైనా
నా గుండె చప్పుడు
నీ నామమే తండ్రీ
శివయ్యా నీవే దిక్కయ్యా
తండ్రీ
నువ్వు ఎక్కడున్నా
బేధం లేదు
ప్రేమ
ఆదరణ
అభిమానం అవసరం లేదు
నాకే
వాటి అవసరం ప్రతీ క్షణం
నీతో లేనప్పుడల్లా
తెలియని ఆందోళన
అదుర్దా
ఆవేదనా
వాటికి ఎక్కడ దూరం
అవుతానేమో అని
శివయ్యా నీవే దిక్కయ్యా
మనతో
కొట్లాడిన వాళ్లయినా
ప్రేమగా
కూడా
మనకు చెప్పకుండా పోవచ్చు
ఎంతో మంది
Social media లో
పరిచయాలని
సజీవముగా ఉంచేది
ఆ వ్యక్తుల id మాత్రమే
ఒక రోజు
అదే id లో
ఎవరో msg ఇస్తారు
సదరు వ్యక్తి
అనారోగ్య కారణాల వల్లనో
వేరే కారణాలవల్లనో
శాశ్వతముగా లోకం
విడిచి వెళ్లారని
మన మనసులో భారం
వాళ్లతో మన బంధాన్ని
మెసెంజర్ లోనో
వాట్సాప్ chat లోనో
చూసుకొంటాము
చాలా మంది కి
ఒక id నేగా పోయింది
అనిపించివచ్చు
కానీ ఆ id ని సజీవంగా ఉంచిన
ఒక మనసుని గమనించరు
అరె
ఈ మధ్య పలకరించలేదేమి
అని బాధ పడతాము
మన బాధ
మన స్పందన
మన కన్నీరు అందని
లోకాలలో వాళ్ళు
ఉంటారు
అందుకే
మనిషి ఉండగానే
కోపం ఉన్నాప్రేమ ఉన్నా
చూపించాలి
చివరి చూపులకు కూడా
నోచుకోని
అద్భుతమైన బంధాలు
ఎన్నో
ఆ మనిషిమనకు చెప్పకుండా
పోయాక
కన్నీరు తప్పక రావాలి
నిన్ను తెలియాలని
తపములు చేసిన
యోగులవా??
నిన్ను చేరాలని
యజ్ఞ యాగాదులు
చేసిన ఋషులవా??
నీలో కలవాలని
జీవితము అర్పించిన
అఘోరాలవా??
నీతోనే ఉండాలని
పరితపించిన
నీ కింకరులవా??
ఎవరిని మెచ్చి
చెంత చేరుస్తావో
ఎవరిని గుర్తించి
చింత తీరుస్తావో నాకు
అనవసరం
ఈ ఉపాధి రాలిపోగానే
నీ మెడలో
కపాలమాలికలో
ఈ జీవుడు ఉండేలా
అనుగ్రహించాల్సిన
భారం నీదే
తపములతో
యజ్ఞ యాగాదులతో
సాధనతో నాకు
సంబంధం లేదు
నీవు నా తండ్రివి
నీవే నా తండ్రివి
అదొక్కటే నా అర్హత
శివయ్యా నీవే దిక్కయ్యా
ఎన్ని పూవులు తెచ్చి
ధూపము అర్పించి
నైవేద్యాలు పెట్టినా
నీవు కరిగిపోయేది
కరుణించేది
ఆర్తితో నా కనుల
నిండిన నీరు
నీకు సమర్పించినపుడే కదా