Saturday, February 24, 2024

శివోహం

శివా!నిప్పు కంట నన్ను చూడు చల్లగా 
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అంతరాన పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.

శివోహం

మనం భగవంతుడిని విశ్వసించినా...
ప్రార్థన చేస్తూ ఉన్నా మనలో ఉన్న అంధత్వం ఏదో ఒక మూల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది..
కానీ అదే భగవంతుడు మన వైపు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మనలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటాయి...
అందుకు చేయవలసినది ఒకటి నామ స్మరణ రెండవది శరీరము వేరు, ఆత్మ వేరు అని తెలుసుకోని జ్ఞాన స్థితి కలిగి ఉండటం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 23, 2024

శివోహం

ఓ శివా! పరమేశ్వరా! ఆదిభిక్షూ! 
నా మనస్సు అనే కోతి ఎల్లప్పుడు...
మోహమనే అడవిలో తిరుగుతూ....
కామము అనే కొండలపై విహరిస్తూ....
ఆశలనే కొమ్మలపై ఆడుతూ ఉంటుంది.....
అత్యంత చపలమైన ఈ కోతిని.....
భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి....
నీ అధీనములొ నుంచుకొనుము...

మహాదేవా శంభో శరణు....
శివ నీ దయ తండ్రి.

శివోహం

నా నెలరాజు..
వెండి నక్షత్రాలతో నన్నెలిగించే దీపకుడు.
పున్నామ నరకం నుండి తప్పించే నా శివుడు.
కన్నయ్య 👣 ❤️ U.

శివోహం

శివా!నిశ్శబ్దాన్ని చీల్చుకు వచ్చిన శబ్దమే
నన్ను నిశ్శబ్దానికి నడిపించే శబ్దం కావాలి
నాలో ఆ శబ్దం ఆ శబ్దంలో నేను కలిసిపోవాలి
మహేశా . . . . . శరణు .

శివోహం

నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు...
అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు...
ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు...
సుఖాలు మళ్ళీ అనుభవించాలనీ లేదు..
నీబాటసారిని నేను...
బాటలు వేస్తావో ఆ బాటలను దూరం చేస్తావో...
నీ అభీష్టం తండ్రి.
శివ నీ దయ
మహాదేవా శంభో శరణు.

Thursday, February 22, 2024

శివోహం

మనకు భగవంతుడి పట్ల ఉండే కృతజ్ఞతా భావం, మనం ఆనందంగా జీవించడానికి సహాయపడే మూల సాధనం. అంతా ఈశ్వరేచ్చ అనే రెండు పదాలతో మొదలయ్యే ఈ ఆనందయాన గమ్యం సచ్చిదానందం.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...