Monday, February 28, 2022

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది...
అరిషడ్వర్గపు ఆటలలో లోబడి.....
రోగియైన నా మనసు కల్లుతాగిన కోతిలా....
అటాడుతూ చిందేస్తుంది...
నీవే నాకు కొండంత అండగా ఉండి...
నన్ను కాపాడగారావా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!మూడు కన్నుల నిన్ను తెలియగాను
వేయి కన్నుల నిన్ను వెతుకుతున్నాను
వెలుగువో జిలుగువో  నాకు తేట పరచు
మహేశా . . . . . శరణు .

Saturday, February 26, 2022

శివోహం

చిన్ని చిన్ని తప్పిదాల్ని భరించలేనప్పుడు జీవితంలో పెద్ద విజయాల్ని సాధించలేం మిత్రమా...

చివరికంటూ మనవెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం...

మన భావాలు మరొకరికి భారం కాకూడదు, బాధని కల్గించకూడదు...

ఓం గం గణపతియే నమః.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఎంగిలి కాని రీతి ఎలుగెత్తి పిలిచాను
ఎదురుగా నిను చూడ ఎదలోకి చూసాను
ఎదలోన ఏముందో కానరాకుంది
మహేశా . . . . . శరణు .

శివోహం

నిన్ను ద్వేషించే వారిని నీ ద్వేషం అనే మంటల్లో మసి చేయకు మిత్రమా...

నీ మంచితనం అనే నీడను వారిపై ప్రసారింపచేసి వారి ద్వేషం ను ఆర్పు...

ఎందుకంటే జీవుడే దేవుడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 25, 2022

శివోహం

ప్రతి కదలిక ఈశ్వరుడిదే...
జరిగేది జరుగుతుంది...
జరగనిది జరుగదు...
ఇది సత్యం
కనుక మౌనంగా ఉండడం ఉత్తమం...

రమణమహర్షి

శివోహం

నిన్ను నమ్మితే చాలు
గాజు ముక్కలోనూ ఉంటావు
మహాశివా
నిను కొలవాలే గాని
సర్వత్రా నీవే కొలువై ఉంటావు

సదా శివా
నీవు లేనిది ఎక్కడ
గాలి లోనూ నీటిలోనూ
నిప్పులోనూ నింగిలోనూ
అంతటా నీవే నిలచి ఉన్నావు

జగదీశుడవు 
ఆది దేవుడవు
ధర్మార్మ కాల స్వరూపుడవు
నిను పూజించని కరములా ఇవి
కాల సర్పంలా విషం చిమ్మునవి

నిను నమ్మిన వారికి
ఆపన్న హస్తాలు
అభయంకరా శంభో శంకరా
నిను చేర మార్గముపదేశింపరా
హరా పరమేశ్వరా

భద్రుడవు నీవే
రుద్రుడవు నీవే
మంగళాకారుడవూ నీవే
చిదానంద స్వరూపమూ నీదే
అన్నీ తెలిసీ మా పై ఈ పరీక్షలేల

త్రయంబకుడవూ నీవే
అర్దనారీశ్వరుడవూ నీవే
సదా నిర్వికారుడవూ నీవే
భోళా శంకరుడవూ నీవే
కాలుడవు నీవే మహా కాలుడవూ నీవే

సర్వేశ్వరా అంతటా 
నీవే నిండి ఉన్నావు
నిరాకారా నిర్విఘ్నకారకుడివి
సదా నిన్నే స్మరింతు
శ్రీశైల వాసా శ్రీ మల్లిఖార్జునా..!

     

శివోహం

శివా!వేయి జన్మలుగ నిన్ను వెతుకుచున్నాను
ఏ జన్మనూ నిన్నేలో తెలియలేకున్నాను
తెలియవచ్చెడి జన్మ కలుగనిమ్ము
మహేశా . . . . . శరణు.

Thursday, February 24, 2022

శివోహం

శివా!మదన పడుతున్నా మనసు వీడక
ఆ పైన నేను ఎవరో తెలియక
సతమతమవుతున్నాా శరణమంటున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

నాది అంటూ ఎం మిగిలి ఉంది నా వద్ద శివ...
ఒక్క మనసు తప్ప...
అది కూడా నీదే...
అంతా నీవే...
ఇదంతా నీదే...
నీ సొత్తును...
నేనునీకు సంతోషంగా కృతజ్ఞతా పూర్వకంగా  తిరిగి ఇవ్వడానికి  నా దగ్గర ఏమైనా ఉందా పిడికెడు బూడిది తప్ప...

మహాదేవా శంభో శరణు...

Wednesday, February 23, 2022

శివోహం

తొలిసంధ్యలో ఆరవిరిసిన అరవిందాలు మలిసంధ్యలో వాలి రాలిపోవడం సహజం...
అట్లే జనించాక మరణించడం కూడా సహజమే...
ఇది కాలధర్మం...
అయితే ఆ మరణం వెన్నెల్లో పూసిన పారిజాతాలు వేకువలో పరవశంగా పరమాత్మునిపూజకై రాలిపోయినట్లు ఉంటే ఆ జననంకు సార్ధకత ఉన్నట్లే...
ఇక మరుజన్మ లేనట్లే.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నీ సిగ వెన్నెలకు  నెలవయ్యింది
నీ కరుణను తెలిపెడి ఋజువయ్యింది
నీ శరణము వేడగ అభయమయ్యింది
మహేశా . . . . . శరణు .

శివోహం

ఒక్కసారి ఓం నమః శివాయ అనండి...
స్వచ్ఛమైన ఆ పేరులోనే...
దాగుంది జీవితం అంతా...
ఆ నామాన్ని స్మరిస్తే చాలదా...
మనకి జీవితం ఆనందమయం కదా మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, February 22, 2022

శివోహం

శంభో...
నన్ను దిద్దుకో...
నీ దాసునిగా మలచుకో...
నీవాడిగా చేసుకో...
నేను నిన్ను మరిచిపోకుండా గుర్తు చేస్తూ...
నీ భక్తజనం లో ఒకడిగా నీవు నన్ను గుర్తు పెట్టుకో...
నీ గుండెలకు హత్తుకో...
నీ చెంత నిలుపుకో...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!చిత్తంలో చిరు దీపమై వెలిగేవు
విశ్వంలో విరాట్ తేజమై ప్రభవించేవు
రెండూ అభేదమే ఆ ఎఱుక ప్రమోదమే
మహేశా . . . . . శరణు .

శివోహం

బంధాలు కొన్ని ఋణాలు తీరగానే బంధ విముక్తి అవుతాయి...
వారి నుండి దూరం పెరుగుతుంది...
కొన్ని రుణాలు జన్మ జన్మల నుండి వస్తూ ఉంటాయి...
అవే తల్లిదండ్రుల ఋణం, ఋషుల రుణం,దేవతా ఋణం...
ఇవి ఎప్పుడూ వెంటే ఉంటాయి.
మంచితనం, మానవత్వం, దయ ,పాప భీతి, భక్తి,భయం తో జీవితాన్ని ఆ దేవదేవుని పాదాల శరణు వెడితే జీవితం లో శాంతి ఆనందం లభిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, February 21, 2022

శివోహం

పిలవగానే పలికే దేవుడవు...
రాగానే వరాలనిచ్చే హితుడవు...
ఆపదలలో కాపాడే స్నేహితుడవు...
పేదవాడికి సైతం అందుబాటులో ఉండే భోళాశంకరుడవు...
సంపదలెన్ని ఉన్నా, మౌనవిరాగివై లోక కళ్యాణం
కోసం తపమాచరించే మహానుభావుడవు...
ఏతీరున నీతత్వము అర్ధం చేసుకోగలం...
నీరూపు మాటెలా ఉన్నా...
నీ పంచన నిలిచేలా చూడు తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీ నీడలో నాకు విద్య నీయి
అవిద్య అన్నది తొలగనీయి
మిధ్య ఏదో తెలియనీయి
మహేశా . . . .  .  శరణు .


 శివా!కనిపించే కన్నులు మూసి ఉంచనీయి.
కనిపించని కన్ను తెరిచి చూడనీయి 
నీవు , నేను , తెలియ నీయి
మహేశా . . . . . శరణు


 శివా!ఒక రూపమంటూ లేని నీవు
ప్రతి రూపంలో నీవే వెలుగుతు ఉంటే
నీ ప్రతిరూపం నేను కానా...?
మహేశా . . . . . శరణు .


శివా!నిప్పు కంట నన్ను చూడు చల్లగా 
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అందున్న పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.


 శివా!ఈ బ్రతుకు బండి పయనంలో  
సాయమూ నీవే సాక్షమూ నీవే 
శోధించి సాదించగ నా లక్ష్యమూ నీవే
మహేశా . . . . .  శరణు


శివా!కైలాసం చేరడం
నా కామ్యము కాదు
అది నా గమ్యం
మహేశా . . . . . శరణు .


శివా!దేహాన్ని దరియించు జ్యోతిగ వెలిగేవు
దేహాన్ని దహియించు జ్వాలగ రగలేవు
రెండూ ఒకటి చేసి ప్రణవాన మెరిసేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

జననం నీవే...
గమనం నీవే...
సృష్టివి నీవే...
కర్తవు నీవే...
కర్మవు నీవే...
ఈ జగమంత నీవే తల్లి....
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివశక్తి స్వరూపం పట్టుకుంటే అది మనకు కావలసిన సమస్తం ఇవ్వగలదు...
దానికి ఆ శక్తి  వుంది...
పరమాత్మను పట్టుకునే వాడి కోరికలు పరమాత్మే తీరుస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, February 20, 2022

శివోహం

మనసు మానవుడికి భగవంతుడిచ్చిన భిక్ష...
దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే...
మనసును మందిరం చేసుకుని, మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి...
అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే అంతర్యామి కోవెలగా మారిపోతుంది.

ఓం శివోహం... సర్వం శివయమం.
ఓం నమో నారాయణ.

శివోహం

శివుణ్ణి నమ్ముకో మిత్రమా...
నీ భారాన్ని పరిపూర్ణ విశ్వాసం తో శివుడి పై నమ్మకం ఉంచితే నిన్ను తప్పక ఏ ఆపద నుండి అయిన రక్షిస్తాడు...
గరళం ను కంఠం లో దాచి సృష్టి ని కాపాడి రక్షిస్తునా వాడికి నీ బాధలు ఒక్క లెక్కనా ఏంటి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 18, 2022

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మనసు మలినాలతో ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

గతంలో స్వగతంలో ఉన్నది నీవే...
భవిష్యత్తులో ఉండేది నీవే...
అసలు నీవు...
నకలు నేను...
కానీ నిన్ను నమ్మిన నాకు ఈ చిక్కుల లెక్కలేనయ్యా శివ...
చిక్కులు తొలగించు...
దారి వైపు మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

Thursday, February 17, 2022

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

Wednesday, February 16, 2022

శివోహం

ఈ శరీరం సాధన మయం ఇదే శరీర ధర్మం
ఈ సాధన లేని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం కష్టం
ఈ ఆధ్యాత్మికమైన జీవనం లో అంతా తెలిసినట్లే తొచినా అందులొ అంతా అమాయకత్వం
ఈ తెలియని తనంతొ పడె సంఘర్షన స్థిమితంగా ఉండనీయదు అదే అజ్ఞానం
ఈ తెలివైనతనంతొ నిరంతరం నిరూపనలతో ఒప్పించడం లొ కొట్టుమిట్టాడుతుంది జీవితం
ఈ గొప్పలు గొడవని తగలబెడితె  నిరాడంబరంగా ఉండగలం
ఈ నేను అన్న దాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం
ఈ అనంతంలో ఈ జీవి అణవు బుడగలొని గాలి అవుతుంది అనంతంలొకి ఐక్యం
ఇక వున్నదంతా సూన్యం

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి...
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు...
మారినవారు మరల మారలేదు కానీ, నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా...
ఏదారిలో నడుపుతావో నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు...

Tuesday, February 15, 2022

శివోహం

శంభో...
నిన్ను కొలుచుటకు ఇసుమంత యోగ్యత లేని దీనుడిని...
నీవే దిక్కు వేరే గతి లేదు నాకు శరణు అంటూ నీ పాదాలు గట్టిగాపట్టుకొని  వేసుకోవడం తప్ప మరే మంత్రము, జపము, స్తోత్రము ,యాగము చేసే యోగం లేని అధముడను...
నీవే నాపై దయఉంచి నన్ను కరుణించు...
నిన్ను మనసారా తలచుకొంటూ  ఆరాధించే దృఢమైన ఆత్మశక్తినీ,చెదరని స్పూర్తిని,ఆచంచమైన భక్తినీ, ప్రగాఢవిశ్వాసాన్ని  అనుగ్రహించు..

మహదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నేను నీ భక్తుడను.
నిరంతరం నీ నామ స్మరణమే...
ఈ కష్టసుఖాలు సహజమని తెలుసు...
కానీ ఈమధ్య బాధలసుడి...
కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి...
నీకు తెలియనిది కాదు కానీ...
మాయ ప్రలోభపెడుతున్నది...
మనస్సు ఆశ పడుతుంది...
నీ నుండి దూరం చేస్తుంది...
మాయ తొలిగించు నిన్ను చేరే దారి చూపించు...
మహదేవా శంభో శరణు.

Monday, February 14, 2022

శివోహం

మనిషి మనసుకి బానిస...
మనసు మాయకి బానిస...
మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని  పట్టుకుంటే మాయ తొలగుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నా మది నిన్ను స్వామి స్వామీ......
అని పిలువగా పల్కకుంటివి ఏమయ్యా.....

పాపాత్మడున నేను........?

నువ్వు పలికితే కదా స్వామి నేను తెలుసుకునేది.....

అయిన గతజన్మలో నేను పాపాత్ముడనే ఐతే.....

పాపికి మరుజన్మనిచ్చిన నీదే కద లోపము......

అంచేత ఒక్కసారి పలకవయ్యా శంకరా.....

మహాదేవా శంభో శరణు........

Sunday, February 13, 2022

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

Saturday, February 12, 2022

శివోహం

గజాననాయ
గణాధ్యక్షాయ
విఘ్నరాజాయ 
ఉమాపుత్రాయ
వక్రతుండాయ
సూర్పకర్ణాయ 
అజ్ఞానుల మైన మేము చేయు తప్పులను క్షమిచి...
సంసార దు:ఖములను కల్పించే మాయను తొలగించు...

ఓం గం గణపతియే నమః
ఓం నమః శివాయ.

శివోహం

శివుని తేజం
ఈశ్వర రూపం
సుబ్రహ్మణ్యస్వామి నామం
అమ్మ ఆశీస్సులతో శక్తి
కదిలే మరో సింహం
శివకుటుంబమే అంత
ఓం నమః శివాయ

శివోహం

సృష్టిలో ఉండే ప్రతీదీ భగవత్సరూపమే...
జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే...
రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే...
వాడొక్కడే శివుడొక్కడే....
 ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించే పరమేశ్వరుడొక్కడే...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 11, 2022

శివోహం

నాదో నీదో చుట్టాలందరూ వదిలేసినా 
నను వీడని బంధువు నీవు...

నాలో పాపాలను దహించివేసి లోపలి 
అగ్నిని గంగలో కలిపి చల్లబరుస్తావు...

ఎన్ని చేసినా నా ఆస్తి(అస్తికలు) నాకే వదిలేస్తావు...

కాలి పొగ బూడిద సర్వం నీవే తీసేసుకొని నన్ను బంధ 
విముక్తుడను చేయి...

మహాదేవా శంభో శరణు...
ఓం నమో నారాయణ.

శివోహం

శంభో!!!నేను తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు... 
నాపై నీ అంతరంగమున ఏమున్నా నీ బిడ్డడను... 
నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... 
మహాదేవా శంభో శరణు...

Thursday, February 10, 2022

శివోహం

పాపా హర హారణ...
తాప హారణ...
శిఖివాహన సంహరణ...
శరణంభవ శరణంభవ
శరణంభవ శరణంభవ

Wednesday, February 9, 2022

శివోహం

 శివా!పరమాత్మ జీవాత్మ సంకేతము
సూక్ష్మ శ్రేష్ఠముల నీవె శోభాయమానము
ఆత్మ జ్ఞానము తెలుపు ఒక పాఠము
మహేశా . . . . . శరణు .

 శివా!బ్రతుకు ఏమిటో తెలిసేది 
బ్రతుకేమిటో తెలిపేది 
ఈ జ్ఞాన వాకిటే....
మహేశా . . . . . . శరణు



 శివా!జన్మకు మరణం వరం
పుర్రెకు మరుపు వరం
నాకు నీ స్మరణ వరం
మహేశా.....శరణు.



శివా!ఎన్నేన్నో రూపాలు అన్నీ నీ ప్రతిరూపాలు          ప్రతి రూపం ప్రత్యేకం ప్రభవించగ నీ తేజం      
ఆ తేజం అనంతం అది నీకు సొంతం                
మహేశా . . . . . శరణు.



శివా! ఏది ఒకటి ఏదో ఒకటి
స్ఫురింప చేయి ... సర్వదా
నిన్ను తలిచేలా నిన్ను తెలిసేలా
మహేశా. . . . .శరణు..


శివా!బరువైన ఈ తలను తొలగించవయ్యా  
నీ తల వాకిట ఆ తలను తగిలించవయ్యా 
తల కలిగినందరూ తెలుసుకొనంగ. 
మహేశా . . . . . శరణు.



 శివా!మంగళ కారకా ఓ లింగమూర్తి
ఎంగిలి కాని రీతి నిన్ను ఎలుగెత్తి పిలిచాను
ఎఱుక రావయ్యా కినుక చాలయ్యా 
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
మౌనమనే నా మనసు గదుల్లో...
మనసు పడే ఈ వేదన వెనుక...
మింగలేని మా బాధలు ఎన్నో దాగి ఉన్న ఆ దుఃఖం తో..
ఓ నీరు తీయగా...
మరోటి ఉప్పగా...
రెండుకలిపి నా గుండె మరలో కలిసిపోయి...
నానోట పలికే నమః శివాయ నామంతో శుద్ధి అయి... నీ శిరమున పడి పానవట్టమునకు చేరుసరికి అమృతమే అగును కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నిన్నొక్క సారి చూడాలని ఉంది తండ్రి...
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది...
భక్తితోడ నీ కృపను  పొందాలని ఉంది...
నాలో నిను దర్శిస్తూ ఆనందించాలని ఉంది...
నీ కరుణామృత వర్ష ధారనెలా తడిచి తరించేది...
నీ చరణకమలాల ముందు నా హృదయాన్ని ఎలా పరచేది...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

బ్రహ్మ కడిగిన పాదము...
బ్రహ్మము తానెని పాదము...
చెలగి వసుధ కొలిచిన నీ పాదము ..
బలి తల మోపిన పాదము...
శరణు అన్న వారిని రక్షించే నారాయణుడి పుణ్యపాదం...

ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ..

Tuesday, February 8, 2022

అయ్యప్ప

హరిహారపుత్ర అయ్యప్ప...
కలి మాయలో ఉన్న మాకు...
కలిలో నీవే కనిపించు దైవము నీవు...
పిలిస్తే పలికే దేవదేవుడవు నీవు...
కలి మాయ నుండి రక్షించే భారం నీదే కదా మణికంఠ...

అయ్యప్ప మా దేవా నీవే శరణు.

శివోహం

శంభో...
ఉయ్యాల కి ఊరేగింపు కి మధ్యలో ఎన్ని బంధాలో...
ఈ ఊపిరి పోసినవాడు ఎవరు రేపు ఊపిరి తీసేవాడు అనే ఎరుక లెకుండా ఊపిరి సలపని బంధాలలో బందీ చేస్తావు...
నీవు గొప్ప మాయగాడివి సుమీ...
నీ మాయ ముందు మేము ఎంతటి వాళ్ళము...
ఈ మాయ నుంచి బయటకు వచ్చేలా అనుగ్రహించు...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం... సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడు...
ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కొలిచే ఏకైక దేవుడు, అందరి దైవం సూర్యభగవానుడు...
ఈ సృష్టిలోని అన్ని ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించే త్రిమూర్తి స్వరూపుడయిన సూర్యభగవానుడు జన్మదినం రథసప్తమి శుభాకాంక్షలు ఆత్మీయులకు.

Monday, February 7, 2022

శివోహం

నిశ్శబ్దంగా ఉండడమంటే తాను దైవంతో ఉండడం...
మౌనంగా ఉండడమంటే తానే దైవంగా ఉండడం...
మొదటిది వాకేమౌనం...
రెండవది మనోమౌనం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివుడు అంటే నమ్మని వారిని నిరూపించే నిజం కాదు...

నమ్మిన వారికి అనుభవమయ్యే సత్యము...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, February 6, 2022

శివోహం

సిద్ది వినాయక...
భావ భయ నాశన...
సుర మునివందిత శ్రీ గణేశా...
విశ్వా ధారా వినాయక శరణు...

ఓం గం గణపతియే నమః.

శివోహం

శంభో...
నీవు సృష్టించిన ఈ అందాల ప్రకృతిలో నిన్ను దర్శించి తన్మయత్వం పొందే సౌలభ్యం ఉంది...

చూడగలిగే కళ్ళు ఉండాలి గాని సృష్టిలో ,అణువణువునా, అడుగడుగునా నీవే తండ్రి...

నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా మహదేవా.

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

కొండంత దేవునికి కొండంత ఫలాలు తెగలమా శివా...
 
నామస్మరణతో శివా అంటూ శిరమున ఉన్న గంగను స్మరిస్తూ...

ఉద్ధరిణితో అభిషేకించగా అజలం అక్షయమై తృప్తి చెందుతున్నాను...

అమ్మ పార్వతిని తలుస్తూ నుదుట మూడు గీతల విబూధి నడుమ కుంకుమ దిద్దుతున్నాను...

ఉభయ దేవేరుల(అమ్మల)ఆశీస్సులతో నీనామస్మరణ చేస్తున్న...

అదే పదివేలుగా భావించి నన్ను దీవించు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

Saturday, February 5, 2022

శివోహం

కాయానికి మూలం మనసు...
ఎప్పటికప్పుడు శుద్ది చేసుకుంటే యే చెడు లోపలకు రాదు...
వచ్చినా లోన శివుడు జీవాన్ని అంటనివ్వదు....
ఆ శివుడు మూడో కంటికి కాలి బూడిద కావలసినదే...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...