భవసాగరాన్ని దాటించేవాడు...
కామ్యములను తీర్చేవాడు...
పాపములను హరించేవాడు...
సమస్త దేవతల చేత పూజించబడిన పదకమలములు కలవాడు...
వికసించిన కలువల వంటి కన్నులు కలవాడు...
భక్తులను పాలించేవాడు...
జనన మరణ బంధముల నుండి ముక్తి కలిగించుటలో నిపుణుడైన శ్రీరామచంద్రుని నేను నిత్యం ధ్యానిస్తాను.