Tuesday, June 30, 2020

శివోహం

నీవు తోడుగా
ఉన్నావనే నమ్మకం

కొండంత
ధైర్యంగా ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
నీవు తప్ప 

ఈ సృష్టిలో
శాశ్వతమైనది ఏదీ లేదు 

అన్నీ 
నశించి పోయేవే 

శివోహం  శివోహం

శివోహం

రెండు కనులను 
ధారపోస్తే కానీ 
తిన్నడు నీ దరిని చేరలేదు

కొడుకు శరీర  మాంసాన్ని 
నివేదిస్తే కానీ 
శిరియాళుడు నీ చేరువ కాలేదు

మూఢ భక్తితో  ప్రాణాలను 
వదిలితే కానీ 
మూగజీవాలు నీ ముక్తిని పొందలేదు

ఏమి ఇవ్వగలనయ్యా 
నేనెవరితో సాటి 

నాకు ఎందుకయ్యా 
గొప్పవారితో పోటీ 

శివోహం  శివోహం

శివోహం

నీ ధ్యాసలో ఏ శక్తి ఉన్నదో...

ఏ మర్మం ఉన్నదో తెలియదు కాని...

నీ ధ్యాసలో నన్ను నేను మరచిపోయాను...

నీ ధ్యాసలో పూర్తిగా నేను నువ్వైపోయాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మాలా వేసిన జీవితం...
ముక్తి వానికి శాశ్వతం...
శబరియాత్ర చేయరా 
నీ పాపం అంతమై పోవును రా 
పంబాస్నానం చేయరా 
ఆ ఘనత నీకె తెలియును రా

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

శంభో మహాదేవా...

భక్తుల ఆర్తి హరించేవాడా పాపహరా..

హరహర మహాదేవా నీచరణములే గతియంటినయా....

మహేశా శరణు శరణు....

శివోహం

నిత్యం అనునిత్యం నీ నామస్మరణా....

తప్ప మరేమీ తెలియని నాకు...

కలత నిద్దురలోనూ నీ ధ్యానమే తండ్రి....

ఓం శివోహం.... సర్వం శివమయం....

బాలాజీ

భక్త రక్షకుడవు నీవు ...
ముక్తి ప్రదాతవు నీవు....
వందనమ్ము నీకు వాసుదేవ...
అఖిల లోకములకు నాధారమగు కలియుగ దేవుడా....
చేతియూత మిమ్ము గోవిందా.....

ఏడూ కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా....

శివోహం

ఏది పుణ్యం ఏది పాపం
ఏది జ్ఞానం ఏది అజ్ఞానం 
ఏమి తెలుసు నాకు
ఏదైనా పొరపాటు చేసి ఉంటే
ఆగ్రహించక అనుగ్రహించర  పరమేశ్వరా

అమ్మ దుర్గమ్మ

అమ్మను కొల్చిన దక్కనిదేమిటి
దుర్గను కొల్చిన దక్కనిదేమిటి
ఆదిశక్తి నీవు తల్లి మూలశక్తివి నీవు
నిను ధ్యానించెద నోయమ్మా
నను కాపాడుము మాయమ్మా

శివోహం

లోకాల పాలన చేయగ ...
విశాఖ పురమున వెలసిన ...

శ్రీ కనక మహాలక్ష్మీ ...

చినుకుల చిటపటల వలే   నీ చల్లని చూపు ...

నల్లని మబ్బుల చక్కటి వర్షపు ధారల ..
నిండార కురిసేడి  నిరపేక్షగ  నీ దయ ...

ఎక్కడ...ఎవరికి ఎలా  కురిపిస్తావో ...?
చిత్రమైనది నీ కటాక్షం ...

కావాలన్నవాడికి  పడనివ్వు  నీ జడి  ...
వొద్దన్నవాళ్ళకి  పడకుండా ఆగవు ...

తోడుగనీడగ  నాబిడ్డలుండగ ...
నాకు నీడెందుకనుచూ ...
తాటియాకుల పందిరి మాత్రమే 
వేయించుకున్న నీ ఘనతను 
ఏవిధముగానూ నేను  వర్ణించలేను తల్లీ ...
నిన్ను శరణుజొచ్చెడు భక్తులము మేము  ...

శివోహం

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
నమ్మిన వాడిని మంచిచెడు తెలియనివాడిని
ఈశ్వరుడే దైవమని నమ్ముకొన్నవాడిని
ఓ హరిహరేశ్వరా పాపాలు హరించరా
ఓ పరమేశ్వరా ముక్తి ప్రసాదించారా

శివోహం

శంకరా!!!! నీ ధ్యాసలో ఏ శక్తి ఉన్నదో ,
ఏ మర్మం ఉన్నదో తెలియదు కాని
నీ ధ్యాసలో నన్ను నేను మరచిపోయాను 
నీ ధ్యాసలో పూర్తిగా నేను నువ్వైపోయాను . .

శివోహం

అంజనమ్మ ముద్దుబిడ్డ! ఆంజనేయా!
అంజలించినాడ నన్ను ఆదుకోవయా!
నారదాది మునులకే నీవు సఖుడవు
రామభక్త కోటిలో నీవు ఘనుడవు
ధర్మమర్మ విధులలో నీవు మేరువు
ప్రాణదాన దీక్షలో నీవు ప్రభువువు
#శ్రీఅంజనేయం

శివోహం

తత్ప్రణమామి సదాశివలింగం
ఉపనిషత్తులు పరమాత్మను ‘సత్యం-శివం-సుందరం అని నిర్వచించాయి. అతడే పరమమైన సత్యం, పరమైన శుభము, సుందరం అన్నాయి. అతడే శివ్ఞడు పరతత్వమే శివతత్వమనీ, సర్వకారణమనీ విష్లేశించాయి. పరతత్వమైన పరమశివుని ఆరాధించడం భారతీయ సంస్కృతి, సృష్టి స్థితి లయలకు హేతువైన శివ్ఞని లింగరూపంగానూ, మూర్తిరూపంగానూ ఆరాధించడం సంప్రదాయం.

ఈ రూపాలు ‘అకల, ‘సకల తత్వానికి సంకేతాలు. లింగం ‘అకల (నిర్గుణ) తత్వానికి, మూర్తి ‘సకల (సగుణ) తత్వానికి సంబంధించిన విధానాలు నిరాకార, సాకార రూపంగా సదాశివ్ఞని ఆరాధించడం సంప్రదాయం. లింగార్చన అత్యంత ప్రాచీనం, సనాతనం నిర్గుణ, సగుణ రూపాలు, అకలము, సకలముగా చెప్పిన అన్నిరూపాలు ఆరాధనీయాలే. లింగం నిర్గుణమైతే, చంద్రశేఖర, జటాజూట త్రిశూలపాణి వంటివి సగుణరూపాలు ప్రధానంగా లింగతత్వము పరమశివ్ఞని పరమతత్వస్వరూపం. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, స్థితి భర్త విష్ణువ్ఞకు తామిరువ్ఞరులో అధికుడెవ్వరన్న వాగ్వివాదం ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధం ముల్లోకాలలో సంక్షోభానికి దారితీసింది. దేవతలు భయంకంపితులై సదాశివ్ఞని శరణు వేడారు.

సదాశివుడు హరిబ్రహ్మల మధ్య ఆది అంతములు తెలియని మహాలింగంగా ఆవిర్భవించారు. ఇరువ్ఞరు మహాతేజస్సుతో ప్రకటితమైన ఆ అగ్ని లింగాన్ని చూసి అప్రతిభులయ్యారు. ఆది అంతములు తెలుసుకున్నవారే అధికులని లింగం నుండి వాణి వినిపించింది. హరి వరహరూపంలో ఆదిని తెలుసుకోడానికి, హంసరూపంలో బ్రహ్మ అంతం కనుగొనడానికి ఉద్యమించారు. ఇరువ్ఞరూ విఫలమయ్యారు. లింగరూపంలో ఉన్న శివ్ఞడు ప్రత్యక్షమై హరి బ్రహ్మలకు తత్త్వోపదేశం చేశాడు.”వాస్తవానికి ఒకే తత్వం హరి బ్రహ్మలుగా వ్యక్తమైందనీ, అనంతమైన ఏకత్వమే అసల సత్యమనీ, ఆపరమ సత్యాన్ని తెలియజేసేటందుకు అగ్ని లిగంగా ఆవిర్భవించానీ అన్నాడు. ఆ తత్వాన్ని గ్రహించి బ్రహ్మమురారులతో పాటు సకల దేవతలు. ఋషులు సదాశివ్ఞని లింగరూపంలో ఆరాధించారు. ఈ సంఘటన మాఘశుక్ల చతుర్ధినాడు జరిగింది. రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ జ్వాలాలింగ మహారూపాన్ని దర్శించక దేవతా సమూహం ఆతేజస్వరూపాన్ని ఉపహరించమని ప్రార్ధించగా,శాంతించిన పరమశివ్ఞడు పార్థివ లింగరూపంలో పృద్వీనిపై ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి పర్వదినం. ఆ తేజస్సు ‘అగ్నికాదు. పంచభూతాలకు ఆదియైని జ్యోతిస్వరూపం శివ్ఞని జ్యోతిర్లింగంగా ప్రభవించినట్లు పురాణాలు వచిస్తున్నాయి.

జ్యోతిర్లింగ క్షేత్రాలు- సేరాష్ట్రే సోమనాధం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారమమలేశ్వరం, పరల్యాం వైధ్యనాథం చ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబంధే చ రామేశం, నాగేశం,దారుకావనే, వారాణాశ్యంతు విశ్వేశం, త్య్రయంబకం గౌతమీ తవే, హిమాలయేతు కేదారం, ఘశ్మేశంచ శివాలయే పన్నెండు స్వయంభూలింగాలుగా ఆవిర్భవించిన శివ్ఞడు లోకరక్షణ చేస్తున్నాడు. ఇవికాక, శ్రీఆది శంకరులు శివ్ఞని ద్వారా పొందిన పంచభూత్మాకమైన ఐదు స్ఫటికలింగాలను -పృథ్వీలింము(కాంచీక్షేత్రం) జలలింగం (జంబుకేశ్వరం) అగ్నిలింగం (అరుణాచలం)వాయులింగం (శ్రీకాళహస్తి), ఆకాశలింగం (చిదంబరం) క్షేత్రాలలో ప్రతిష్టించారు. తారాకా సుర సంహానంతరం, ఆ అసురుని హృదయంలో ఉన్న శివలింగం విచ్ఛిన్నమై ఐదు ప్రక్కలైంది. అవి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని శివలింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ‘లయనాత్‌ లింగముచ్చతే అని నిర్వచనం దేని యందు సర్వ జగత్తులీనమై ఉంటుందో ఈ పరతత్వమే లింగం. ‘చిహ్నమని అర్ధం. పరమశివ్ఞని ప్రతీక. అర్థనారీశ్వరతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అసాధ్యం.

శివలింగం పానీపట్టం చేత ఆవృతమై ఉంటుంది. పానీవట్టం ప్రకృతీ శక్తికి ప్రతీక. అర్ధనారీశ్వర తత్వమే పానీవట్టం చేత చుట్టబడిన శివలింగతత్వం, శక్తి సంస్పర్శచేత శివ్ఞడు వ్యక్తమేతున్నాడు. పానీపట్టమే యోనిపీఠం శక్తిపీఠం. వ్యాపకశీలమైన ప్రకృతీతత్వమే యోని ఉత్పత్తికి ఉపాధాన కారణమైన శివ్ఞడే లింగం. ‘యోనిని ‘భగము అన్నారు. ‘భగము కలవాడు భగవానుడు ఇలా ప్రకృతిశక్తులు పార్వతీ పరమేశ్వరుడు ల సంయోగం కారణంగా ఈ జగత్తు సృష్టి జరిగింది. ఉపనిషత్తులు,పురాణాలు, భగవద్గీత,లలితోపాఖ్యానం మొదలైన గ్రంధాలన్నీ ఈ విషయాన్ని స్పష్టపరిచాయి. సృష్టిస్థితి లయాత్మకమైన శక్తి సంయోగం చేతనే శివ్ఞడు ‘కర్త-కర్మ అవుతున్నాడు.

లింగనేది పార్వతి లింగం శివ్ఞడు,ఈ జగత్తుకు తల్లిదండ్రులు. లింగాన్ని అర్పించడమంటే మాతాపితురులను అర్పించినట్లే బ్రహ్మ విష్ణురుద్రాత్మకమైన పరంజ్యోతిస్వరూపమే శివలింగమని శాస్త్రాలు వచిస్తున్నాయి. లింగార్చనకు మించిన సాధన లేదు. సమస్తపాపాలను భస్మం చేసి ఇహపరభోగాలను అందించి కడప శివసాయుజ్యాన్ని ప్రసాదించే శక్తి లింగార్చనకు ఉంది. కాళిదాసు నుడివినట్లు ‘వాగార్ధసంప్త్రుకౌ వాగర్భములవలే కలిసియున్న పార్వతీ పరమేశ్వరులను అర్పించాలి. ఇంకా ఏమన్నాడంటే- ఏమిలేనివాడైనా సంపదలునిచ్చేవాడు, శ్మశానవాసియైనా త్రిలోకనాధుడు,భయాంకర రూపం కలవాడైనా మంగళస్వరూపుడు శివ్ఞడు శివ్ఞని యదార్ధ స్వరూపం తెలిసినవారు లేరు. అన్నాడు. వేదస్వరూపుడు,సంసార జనిత దుఃఖాలను హరింపజేసేవాడు,శాంతుడు,శంభుడు,శుద్ధుడు,మంగళకరుడు సదాశివ్ఞడు అట్టి మంగళమయ జీవితాన్ని ప్రసాదించే శివ్ఞని మహాశివరాత్రినాడు పనసారా ప్రార్ధిద్దాం తత్ప్రణమామి సదాశివలింగం.

శివోహం

*సత్యవాక్పరిపాలకుడు శ్రీరాముడు*

”రకారం అంటే అజ్ఞానం, మాయ అని ”మ అంటే వాటిని నిరోధించేదనీ, అదే జ్ఞానమనీ, ”రామ శబ్దానికి అర్థం చెబుతారు పండితులు. జ్ఞానులు! పరబ్రహ్మ వాచకమే రామశబ్దమంటారు ”తత్వజ్ఞులు. నిత్యమూ క్షణం సేపైనా రామనామాన్ని ఉచ్ఛరించేవారు సమస్త సిద్ధులనూ పొందుతారని విశ్వామిత్ర సంహితలో చెప్పబడింది. రామనామస్మరణతో సమస్త పాపాలూ పరిహరింపబడతాయట. భగవంతుని నామాలు ఎన్ని ఉన్నా అత్యంత మహిమాన్వితమైనది ”రామనామం. నారదుడు ఒకసారి భగవంతుని వద్దకు వెళ్లి తరింపజేసే నామాన్ని తెలియజేయమని అడుగగా, ఇతర నామముల కన్నా శ్రేష్ఠమైన రామనామాన్ని నిర్మించి ఇచ్చినట్లుగా ”తులసీదాసు అన్నాడు. నారదుడు దాన్ని ప్రచారం చేశాడు. పరమశివ్ఞడు కాశీనగరంలో భవానీతో కలిసి నివసిస్తూ, అక్కడ మరణించే వారి చెవిలో రామనామాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని అంటారు.

రామా! నీ నామాన్ని పలికినంతనే మహాపాపియు పవిత్రుడవ్ఞతాడని మహర్షులు అన్నట్లు పురాణవచనం. ”రామోవిగ్రహాన్‌ ధర్మః శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మమే. పుత్రునిగా, సత్యవాక్‌పరిపాలునిగా, శిష్యునిగా, భర్తగా, రాజుగా వీరాధివీరునిగా, స్నేహశీలిగా, భక్తజనసంరక్షకునిగా ఆయన ఆదర్శపురుషుడు. తల్లిదండ్రులందరూ తమ పుత్రులు శ్రీరామునిలా ఉండాలని, ప్రతి భార్యా తన భర్త రాముని వంటి పవిత్ర మూర్తియై ఉండాలని కోరుకుంటారు. ప్రతీ భారతీయుడూ రామనామస్మరణ చేస్తూ, ఆయనను పూజిస్తూ, తన జన్మను సార్థకం చేసుకుంటాడు. పరిపాలకులు ఆ ప్రభువ్ఞను ఆదర్శంగా తీసుకున్ననాడు దేశం సుభిక్షమై, రాజ్యం రామరాజ్యంగా భాసిల్లుతుంది. రామయ్యతండ్రి జన్మించినది చైత్ర శుద్ధ నవమినాడైతే, ఆయనకు సీతమ్మ తల్లితో పెండ్లి జరిగినదీ ఆరోజునేనట. కానీ సీతారాముల పెండ్లి జరిగినది మార్గశిరమాసంలో అని శ్రీరామదాసు వసంత నవరాత్రులు జరుపుతూ రామనవమి ఉత్సవాల్లోనే కళ్యాణం జరిపే ఆనవాయితీని ప్రవేశపెట్టాడని అంటారు.

భద్రాచలంలో ఎలా జరిగితే అదే ప్రమాణం కాదుకదా మరి? భార్యాభర్తల అనురాగానికి, అన్నదమ్ముల అనుబంధానికి ఎంతటి ప్రాముఖ్యత నిచ్చాడో, స్నేహానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చాడు రామచంద్రుడు. పక్షియైనా జటాయువ్ఞకి, అంతిమసంస్కారాలు జరిపి, ముక్తిని ప్రసాదించిన దయాసాగరుడు. ఆటవికుడైనా గుహుడిని, వానరుడైనా సుగ్రీవ్ఞడిని, రాక్షసకులంలో పుట్టినవాడైనా విభీషణుడిని ఆదరించి అక్కున చేర్చుకున్న మహనీయమూర్తి. ధర్మగంటను మోగిస్తే కుక్కకు సైతం న్యాయం చేసిన ధర్మమూర్తి. అమిత పరాక్రమశాలియైన రావణాసురుని సంహరించి, తన సత్య, ధర్మ, ప్రవర్తనను ఉన్నత వ్యక్తిత్వాన్ని లోకానికి చాటిన ధీశాలి. తన ప్రజల అభిప్రాయాన్ని తలదాల్చి తాను ప్రాణ సమానంగా ప్రేమించే ఇల్లాలిని పరిత్యజించిన త్యాగమూర్తి. ఇలా ఇన్ని సుగుణాలు ఒకే వ్యక్తిలో ఉండడమనేది రామచంద్రునికే చెల్లింది. మధురంగా మాట్లాడేవాడు, శాంతచిత్తుడు. వీరాధి వీరుడైనా అహంకారం లేనివాడు. కనుకనే ఈనాటికీ ఆయనను పూజిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. రాముని గుడిలేని చిన్న పల్లె కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు.

శివోహం



కళ్ళలో మెదిలే రూపం నీవు ...
కమ్మటి కలల్లోకి వచ్చెడి దివ్య రూపం నీవు ...

కనుల లోలోతుల్లోకి వచ్చి కలవరపెడుతుంటే ...
కనిపించేదంతా మాయగా అనిపిస్తోంది తండ్రీ ...

ఇక కనుకు పట్టేదెలా ముక్కంటీశా ...
ఇక మౌనం నాకు అలవడేదెలా ...‌

నా ... ఆశ... శ్వాస ... ధ్యాస ... నీవే కదా...

మహాదేవా శంభో శరణు

శివోహం

మాయ ఎరుగని...
మాయ మహామాయ...
ఆ మాయనెరిగిన....
వాడే మహాశివుడు...
ఓం శివోహం..... సర్వం శివమయం

Monday, June 29, 2020

శివోహం

ఆది అంతు లేని  ప్రయాణం...
గమ్యం తెలియని  జీవనం...
ఈ జీవుడి అనంత మైన యాత్ర...
ఈ జీవాత్మ ,ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కష్టాలకు తెలియదు
నాకు తోడుగా 
కైలాస వాసుడు ఉన్నాడని

కన్నీళ్ళకు తెలియనే తెలియదు
నాకు అడ్డుగా 
సాక్షాత్తూ కైలాసమే ఉందని 

శివోహం  శివోహం

శివోహం

ఈశ్వరా ఒక్క సారి కనిపించర 
ఈ ప్రాణాన్ని నేను వదిలేస్తాను
అందించర నీ చేయి 
ఈ నరకాన్ని విడిచేస్తాను  
నిన్ను ఆరాధించే నేను ........
శివోహం..... శివోహం

శివోహం

నందీశ్వర....

ప్రాణనాధుని నేను సేవిస్తాను....

నువ్వింక కైలాసానికి వెళ్ళు...

నీకు పదవీ విరమణ వయసు వచ్చేసింది ....

నీ తరువాత వరుసలో నేనే ఉన్నానని నాతండ్రితో చెప్పు....

ఓం శివోహం.... సర్వం శివమయం...

శివోహం

లింగ రూపం లో 
అందరికీ దర్శన మిస్తావూ
కానీ నీ నిజ రూపం 
తెలియదయ ఎవరికీ
ఆది అంతం లేని 
ఆద్యుడవు  నీవూ
పరమ శివుడవు నీవు
నీ కంటూ ఓ స్థానం లేదు
నిరాకారుడవు నీవు
నిరంజనుడవు నీవు 
సదాశివా నిను నిరతము
పూజింతు నేను మహాదేవా!
మరు భూమిలో వశించే
భూత నాధుడవు నీవు
అన్నపూర్ణనే తిరిపమడిగిన
అర్ధనారీశ్వరువు నీవు 
సర్వ శుభంకరుడవు
ఓ సన్మంగళా కారా !
నమో నమః
                         

శివోహం

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా

ఉంటావయ్యా నీవు మాతోనే ఉంటావయ్యా

శ్వాసలో ధ్యాసవై ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసవై ఉంటావులే

ధ్యానంలో దైవమై దేహంలో జీవమై మహా ప్రాణంగా ఉంటావులే

ఓం శివోహం ...........సర్వం శివమయం

శివోహం

నిన్ను చేరాలని ఒక్కో అడుగు వేస్తు...
పరుగు లాంటి నడకతో...
అలసటను లెక్క చేయక...
నిన్ను చూడాలనే తపనతో...
నా అణువణువు నిన్నే నింపుకుని...
విశ్రాంతిని సైతం మరిచి...
నీ చేతిని అందుకోవాలనే నా కోరిక...
రెక్కలు విప్పుకుని...
అన్ని అడ్డంకులు అధిగమించి...
నిన్ను చేరాలని సంకల్పం తో వస్తున్న... 
మహాదేవా శంభో శరణు...

శ్రీరామ

నిరతము ధర్మము నిలిపెడు వాడు 
చేసిన మేలుని మరవని వాడు
చేయి చాచకనే వరాలు నిచ్చువాడు
సూర్యుని వలెనె వెలిగేవాడు
సుగుణాలకు సరిజోడు వాడు 
సాగరమంత కరుణగల వాడు 
జగములునేలే  కోదండరాముడు వాడు..

శ్రీరామ శరణు...

శివోహం

హర హర మహాదేవా  శంకరా ....
హిమాలయాలకు  రాలేనయ్యా ....
మా ఊరిలోన  నీ ఆలయాన ....
మ్రొక్కుకొందు  నా మొర వినవయ్యా ..

మారు మూల  కుగ్రామము నాది  ....
నిరుపేదలు  నా జననీ జనకులు ....
ఊరు విడిచి  ఊరేగజాలను ....
నా ఇరుకు బ్రతుకు  నీకెరుక చేయగా ..

కలిగినదేదో  కనుల కద్దుకుని  ....
కాలము గడిపే  కష్ట జీవులము  ....
రెక్కలాడినా  డొక్కలు నిండని ....
నా ఓటి బ్రతుకు  నీకెరుక చేయగా ....

"సుందర కాండ " ఆలపించిన 
శ్రీ M.S.రామారావు గారి  శివ గీతమిది

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా

అది
దరికి చేర్చుకునే 
దరహాసమా 

లేక
ముక్తిని ప్రసాదించే 
మందహాసమా 

శివోహం  శివోహం

శివోహం

శివుడు
ఎప్పుడూ ఎవ్వరినీ పలకరించడు

నీ ధర్మం
నీవు తెలుసుకొమ్మని

నీకు 
తెలియజేస్తూ ఉంటాడు

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా 

నీ 
నామ స్మరణ జపంతో
నా 
హృదయం 

ఎప్పుడూ
ఎప్పటికీ 
యజ్ఞ వాటికే 
యజ్ఞ కుండమే 

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ శివప్పా

గుండెలో ఉన్న
నిన్ను చూడనేలేదు

అంతలోనే

కాలచక్రం అంటావు
కాల గర్భంలో కలిపేస్తావు

శివోహం  శివోహం

శివోహం

సదా నన్ను రక్షించే దయాస్వరూపుడైన...
నా పరమశివుడు ఉండగా చింత ఎందులకు... 
జన్మ నిచ్చినవాడు నన్ను వదిలిపెట్టునా...
ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ.....

ఓం శివోహం.... సర్వం శివమయం

భగవంతుడికి కావాల్సింది భక్తి , భక్తి లో నిజాయితీ

ఏమైనా వారం రోజులు
పరమాత్ముని తోగాని
పరాయివారితో గాని
సోపతి చేస్తేనే  తెలుస్తుంది ఆంతర్యం ,అంతరంగం ,అనుబంధం....

ఓం నమః శివాయ

Sunday, June 28, 2020

శివోహం

పట్టింపులు లేని దేవుడూ...! 
పట్టుకో... 

దోసిలి నీళ్లు పట్టిపోసినా చాలు...!! 
నీకు పట్టుబడిపోతాడు...!! 
"నీ పంట పండిస్తాడు"...! 

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

చెదరని జ్ఞాపకాల దొంతరలో ...
చేదు గురుతుల సమూహాలన్నీ నిను 
చేరుకునేందుకు సోఫానాలుగా మారాలన్నదే ...
చిరకాల కోరక నాది తండ్రీ ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా నిశ్శబ్దానికి నీ శబ్దం తోడు
నీవు మాటను మౌనంగా చెప్తున్నావు 
ఆ మౌనం నాకు మాటగా  తెలియనీ
మహేశా ..... శరణు .

శివోహం

త్రిశూలం 
త్రివర్ణం
త్రిముఖం 
త్రిపురం 
త్రిభావం 
త్రిశుద్ధం
త్రిలోకం 
త్రికారం 
త్రిగుణం 
త్రిశాంతం 
త్రిభాష్పం 
త్రినేత్రం

శివోహం... సర్వం శివమయం

శివోహం

నిన్ను నమ్మి ఎదురు చూసే వారి కోసం....
నీవు తప్పక వాస్తవని గట్టి నమ్మకం తండ్రి...

అప్పటి వరకు నా జీవితం తరించడం కోసం....
నిన్నే స్మరిస్తూ నా జీవితం గడిపేస్తాను తండ్రి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

ముల్లోకాలను మమతలతో ముడివేసావు...
ఆ బంధాలను అనుబంధాలుగా అల్లెసావు...
వాటిని అర్థం చేసుకునే మార్గము చూపు...
లయకారకా మా హృదయాలయంలో కొలువుండు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

కైలాసగిరి కొండ పైన ఎక్కడో దూరాన....

ఎక్కికూర్చొన్నావు అందనంత ఎత్తున....

సంసార సాగరమున మునకలు వేస్తూ.....

నేను చిక్కుబడి ఉన్నాను.....

నువు కరుణించేది ఎప్పుడు....
నిన్ను చూసేది ఎప్పుడు....

మహేశా శరణు శరణు........

శివోహం

అందాలను చూపెట్టి మనసు వశం తప్పెలా చేసి....

పాపాల బందీలలో పడగొట్టి జీవితమే పరవశమయ్యేలా చేసి....

లోకమనే మైకంలో నను నెట్టి.....

అన్నీ నీవని ఆశపెడతావు....

ఆటబొమ్మలు చేసి అడుకొంటావు.....

ఏమిటి ఈ చిత్రము శంకరా....

ఎంత విచిత్రము నీ లీలలు నీకే ఎరుక పరమేశ్వరా...

శంభో!!!నాలో ఆవరించి ఉన్న 

అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడు

నా చిత్తం నీకె సమర్పిస్తా  స్వామి.....

శివోహం

నాది అనునది ఎదిలేదు.....

మనది అనునది మరీను లేదు....

ఉన్నదల్లా ఆ పై పరమేశ్వరుడే
క్రింద మనం...

ఆడేవాడు ఆడించేవాడు శివుడే....

ఓం శివోహం... సర్వం శివోహం...

Saturday, June 27, 2020

ఓం

దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు

దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి

శివోహం

నిన్ను చూడకుండా ఈ లోకాన్ని
విడిచిపోతానని బెంగ నాకు లేదు తండ్రి...

లోకం అంతా నన్ను వదిలేసినా
లోకాలనేలేటోడివి నువ్వు తోడున్నావని
నీ నామంతో గడిపేస్తున్నాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివప్పా

గర్భ గుడిని దాటి 
ఏ భక్తుని గుండెలో 
కొలువు ఉన్నావో ?

కాస్త
నన్ను కూడా 
దృష్టిలో పెట్టుకో తండ్రీ ??

శివోహం  శివోహం

శివోహం

శివప్పా

గర్భ గుడిని దాటి 
ఏ భక్తుని గుండెలో 
కొలువు ఉన్నావో ?

కాస్త
నన్ను కూడా 
దృష్టిలో పెట్టుకో తండ్రీ ??

శివోహం  శివోహం

శివోహం

నిను చేరాలని నా మనసారా నిన్ను చూడాలని తాపత్రయం పడుతుంటే...
నాకు చిక్కకుండా తిరుగాడే నీకు...
నా మనసు నిన్ను పహారా కాస్తూనే ఉంటుంది...
మహాదేవా శంభో శరణు....

శివోహం

నిను చేరాలని నా మనసారా నిన్ను చూడాలని తాపత్రయం పడుతుంటే...
నాకు చిక్కకుండా తిరుగాడే నీకు...
నా మనసు నిన్ను పహారా కాస్తూనే ఉంటుంది...
మహాదేవా శంభో శరణు....

శివోహం

సర్వవిద్యలకధిపతి నీవే శంకరా....

సర్వభూతాత్ముడై వెలుగు జంగమ దేవుడవు నీవే..

సర్వలోకాధినాథుడు చంద్రధరుడవు నీవే.....

సర్వశుభములనిచ్చే సర్వేశ్వరుడవు నీవే..... 

ఓం శివోహం... సర్వం శివమయం...

శివోహం

నీవు లేక జగతి లేదు....

జనహితం లేదు సర్వం నీవే....

నీవు లేక సుగతి లేదు... 

సుచరితం లేదు అన్నింటా నీవే....

ప్రాణం పోసేది నువ్వే....

అప్రణాన్నీ తీసేది నువ్వే.....

ఓం శివోహం.... సర్వం శివమయం

శివోహం

నీ దరి జేరగ యే దిక్కున పయనించాలో ...?
నీ దివ్యమంగళరూపం కోసం యే కంటితో చూడాలో ...?
ఈ పాడు మనసుకు తెలియరాదేమి తండ్రీ ...

ఎటువైపుచూసినా,ఎటువెళ్ళినా ఇంకా యెంతెంతోదూరం ...

ఊపిరి ఉన్నంతవరకూ ఆగిపోవాలని లేదు ...
ఆగితే ఊపిరాడదు ...
నా పయనమెటో  తెలియనేలేదు ...

దిక్కలేని వారికి దేవుడే దిక్కని పెద్దల వాక్కు ...
ఒక్కటిమాత్రం నిక్కచ్చిగా తెలుసు తండ్రీ ...

నా లక్ష్యం నిను పొందుటయే ...

మహాదేవా శంభో శరణు....

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...