శివా!నీ ఆవరణకు అంతమే లేదు
జగతి జాగరణకు సూత్రమే నీవు
సదా నా స్మరణలో సంచరించేవు
మహేశా . . . . . శరణు .
శివా!వలువలు నిను చూసి వెనుతిరిగి పోవుచూ
కరి చర్మము తాము కానందుకు కలత చెందె
కట్టవయ్య పట్టు పుట్టము వొకసారి కలతమాప .
మహేశా . . . . . శరణు .
శివా!అక్షయమైనది నీ తేజం
విలక్షణమైనది నీ రూపం
అది అక్షులకందుట అపురూపం
మహేశా . . . . . శరణు
శివా!చాటు లేదు మాటు లేదు
చెప్ప వొచ్చే చోటు లేదు
ఎలా ఎఱుగను ఏమి చేయను
మహేశా . . . . . శరణు .
శివా!మాటలు మూటగ కట్టి
మా ముంగిట పడవేసావు
ఆ మాట వినియోగం తెలుసుకోమన్నావు
మహేశా . . . . .శరణు .
శివా!నీ నామాన్ని తలచాను రూపాన్ని కొలిచాను
ఆ స్థాయిని దాటి నిన్ను తెలుసుకో తలచాను
తేటపడనీ ఆ తెలివి నిన్ను తెలియ .
మహేశా . . . . . శరణు .
శివా!విశ్వమంత వెలుగులొ కానరావు.
అంతరాన నిన్ను చూడ తెలియరావు
గమ్యాన్ని చేరనీ గమనమంతా నీవుగా
మహేశా . . . . . శరణు.
జీవిత పయనంలో
మనుగడ సాగించడం అంటే ...
శివానీ శివోహం శివోహం
పిడికిలి
నీదే కావచ్చు
బలము కూడా
నీదిగా గోచరించవచ్చు ...
కానీ
ఆ పిడికిలి వెనుక ఉన్న
ఐదు వ్రేళ్ళు విశ్వనాథునివే
ఆ అరచేతి ఆశీర్వాద
శక్తి సామర్థ్యాలు సాక్షాత్తూ శివునివే ...
శివోహం శివోహం
దిన దినము
ద్విగుణీకృతమయ్యే
దేహంమీది వ్యామోహం
నాకేలనయ్యా ....
శివోహం శివోహం
నవవిధ
భక్తి సోపానమార్గాలు
ప్రతి ఒక్కరికీ రాసి ఉంటాయి ...
శివోహం శివోహం
జడలు కట్టినవాడు
జగములు ఏలేటివాడు
మూడు కన్నులవాడు
మనసు మెచ్చినవాడు ...
శివోహం శివోహం
శివ!
కదలక మెదలక ఉన్నావు...
అందరి కలలు తీరుస్థున్నావు...
అందరకి వెలుగు చూపుతున్నావు...
దారి తెన్నులేక తిరిగేవాడికి మంచి దారి చూపు తున్నావు...
ఈ ప్రాణిని కూడా నీవే కాపాడుము.
మహాదేవా శంభో శరణు.
శివ నీ దయ.
శివుని స్మరణ చేయవే మనసా
చింతలన్ని చితికి చేరునే మనసా...
నీ దేహం లో దాగిన దివ్యశక్తి శివుడే ఓ మనసా...
కలిసిన మనసులు వేరు.
కలిసే మనుషులు వేరు.
కలిసిన మనసులను విడదీయ్యలేం.
విడిపోయిన మనుషులను కలపలేం.
కలిసే మనుషులు వేరు.
కలిసిన మనసులను విడదీయ్యలేం.
విడిపోయిన మనుషులను కలపలేం.
ఎద తలుపులు తట్టి చూడు...
ఎద నిండా నీ తలపులే తండ్రి.
మనసు మరణించినా
శరీరం ను అలా మోసుకుంటూ నలుగురిలో నటించడం కష్టమే కదా హర.
శరీరం ను అలా మోసుకుంటూ నలుగురిలో నటించడం కష్టమే కదా హర.
శివ నీ దయ.