శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Monday, May 29, 2023
శివోహం
Sunday, May 28, 2023
శివోహం
శివోహం
Saturday, May 27, 2023
శివోహం
శివోహం
శివోహం
గోవిందా
Friday, May 26, 2023
శివోహం
శివోహం
శివోహం
Thursday, June 23, 2022
మహాదేవ అంటేనే చాలు
ఎక్కడని నిను వెద కేది
ఎక్కడే గోవిందుడు ?
శివోహం
శివోహం
శివోహం
మా అవివేకాన్ని నిత్యం ప్రదర్శిస్తూ ఉన్న మా మిథ్యా బ్రతుకు ల తీరు ఇలా ఉంటుంది తండ్రీ_!!"
___ఒకసారి ఒకరోజు_ ఒక నగరంలో_ నీ ఒక అందమైన పెద్ద బంగళాలోకి నేను ,ఒక పల్లెటూరి రైతుని , ఆ యజమాని పిలుపు మేరకు, వెళ్ళడం తటస్థించింది _
అప్పుడు ___
నేను లోనికి వెళ్తూనే _నాకు ఒక అందమైన డబుల్ బెడ్ రూం_ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు , అది ఒక ఇంద్ర భవనం వ లె విద్యుత్ కాంతులతో ధగ ధగా మెరిసిపోతూ ఉంది ,,__!
కనని విననీ వింతగా , అనిపించి ఇదీ కలా నిజమా!"
అనుకున్నాను _!
_ రూమ్ లో_ మెత్తని , సోఫా లో కూర్చుని ఉంటే_ అందులో స్ప్రింగ్స్ ఉన్నాయేమో __నన్ను బంతివలే ఎగరేస్తూ __అటూ ఇటూగా ఊపుతూ ఉంటే__ అది ఒక సర్కస్ వలె భలే ఆశ్చర్యం గా_ గమ్మత్తుగా తోచింది
నన్ను నా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని. అక్కడ పనిచేస్తున్న వారు దూరంగా చూస్తూ __ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండడం కూడా నేను గమనించాను _!
జీవితంలో ఎన్నడూ కనని వినని విధంగా రక రకాల కమ్మని రుచులతో భోజనం చేశాను
ఆ రాత్రి నేను పడుకున్న బెడ్ , ఏ సీ రూమ్ ,, బాత్ రూమ్,పెద్ద హాల్ అమ్మో ఇది మాయా మహల్ కాదు కదా _? అనిపించింది
__ మామూలు మనిషిని నేను _! నాకే ఇలాంటి అందమైన విశాల భవనం ఉంటే__ అబ్బో _? దీని యజమానికి ఇంకెంత అద్భుతమైన భవనం ఉంటుందో కదా_!"" అనుకున్నాను _
మరుసటి రోజున నాకు ప్యాంటు _షర్టు కొలతలు తీసుకొని ,కొత్తవి అప్పటికప్పు డు తెప్పించి నాకు ధరింప జేశారు ,
నా ధోవతి కండువా పంచే బనీను జాగ్రత్తగా ఒక కవర్ లో చుట్టి ఒక మూల ఉంచేశాను ,_!
నిజమే నేను మారు బట్ట లేకుండా వచ్చాను మరి _!
ఏం చేయను ?
వారు చెప్పినట్టు చేస్తూ పోయాను ,
కొత్తదనం చూడాలి అన్న ఉత్సుకత వలన _!
ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం రాత్రి పసందైన విందు భోజనాలు సరిగ్గా టైమ్ కు ఏర్పాటు చేస్తున్నారు _!
కప్పుకొడానికి ఇచ్చిన అందమైన డిజైన్ గల మెత్తని కాశ్మీర్ శాలువా తో ,కమ్మని సెంటు వాసన లతో ,కడుపునిండా తిండి , కంటి నిండా నిద్రా తో నా ఇల్లూ వాకిలి నా కుటుంబం మరచి పోతున్నాను _!
మూడో రోజున నన్ను ఖరీదైన కారులో నగరం మొత్తం తింపుతు _మద్య మద్యలో భోజనం చేయిస్తూ ,,అక్కడి విశేషాలు చెబుతూ _ , సిటీ అంటే ఎలా ఉంటుందో తెలియు జేశారు ,
బహుశా స్వర్గం కూడా ఇలా ఉంటుందేమో అనుకున్నాను _!
రాత్రి నిద్ర పోతుంటే అనిపించింది , నాకు _!అలనాడు కుచేలుడు కూడా ,ఇలాగే ,తన బాల్య స్నేహితుడు ,శ్రీకృష్ణుని వద్దకు వస్తె __ తానే స్వయంగా ఇలానే ఆదరణ_ ప్రేమ చూపుతూ అనుగ్రహించాడు కదా _!!
__నాల్గవ రోజున స్నానం భోజనం అయ్యాక
వారితో అన్నాను _!
_ అయ్యా _! అనాడు ,నేను చేసిన ఒక చిన్న ఉపకారానికి _ మరచిపోకుండా కృతజ్ఞతతో నాకు గౌరవాన్ని అందించిన మీకు మీ యజమానిని ధన్యవాదాలు _!""
__ఇక నేను నా గ్రామం వెళ్తాను_!
నన్ను ఇంత గొప్పగా అన్ని వసతులు ,ఆహారం. ఇల్లూ సౌకర్యాలు ఉచితంగా ఉదారంగా నాకు అమర్చి నన్ను అమితంగా ఆనందింప జేసిన , ,మీ యజమానిని చూడాలి ,_!
దయచేసి నాకు ఆ అవకాశాన్ని ఏర్పాటు చేస్తారా _?
అని వారికి నమస్కారం చేస్తూ అడిగాను
వారు ప్రతి నమస్కారం చేస్తూ
""ఇక్కడికి ఎవరూ ఎప్పుడూ ఎందరు వచ్చినా ప్రతి వారికి __ఈ అతిథి మర్యాదలు అందుతూ ఉంటాయి _!
ఇకపోతే మా యజమాని__ ఇలాంటి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ హోటల్ లాంటివి దేశంలో ఎన్నో ఉన్నాయి _!
అవన్నీ స్వయంగా తానే పర్యవేక్షిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు _
,మిమ్మల్ని కలవడానికి తనకు సమయం పడుతుంది మరి _!
మీరు , వేచి చూసినా కూడా చెప్పలేము ,,ఆయనకు వీలు అవుతుందో లేదో,?!"",
ఎంత బిజీ గా ఉంటాడో ఆయన ,చెప్పలేము ,మేము సార్_!
__అయినా మా కర్తవ్యంగా మీరు ఇక్కడకు వచ్చి ఉంటూ న్నట్టుగా మా యజమానికి తెలియ జేశాము,
మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండడానికి అన్నీ వసతులు , ఏర్పాట్లు చేయమని మాకు ఆదేశం ఇచ్చారు ,
మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళి పోయె సమయంలో మీకు ఇవ్వమని ఈ ఉత్తరం , కవర్ లో పెట్టి ,మీకు అందజేయమని ఆయన అన్నారు ,
అంటూ ఒక పెద్ద కవర్ తీసి చూపి తిరిగి ఒక సంచీలో పెట్టీ నాకు ఇచ్చేశారు వాళ్ళు
""అయ్యా _! మరో ముఖ్యమైన విషయం మీకు _!! ఏమిటంటే, ఈ ఉత్తరాన్ని మీరు మీ ఇంటికి వెళ్ళాక మాత్రమే _ దాన్ని తీసి చదువు కోవాలని చెప్పమని మా యజమాని మాతో
అన్నారు
అందుచేత ,మీరు దయచేసి ఎక్కడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయనగారు చెప్పినట్టు చేయండి _!""
అంటూ నమస్కారం చేస్తూ అందులో ఒకాయన వినమ్ర భావంతో అన్నాడు ,
కంటికి కనపడని ఆ పెద్దాయన వైఖరి _
అంతా విచిత్రం గా అనిపించింది నాకు __!
ఇక చేసేది ఏమీ లేకుండా ""నన్ను మా ఊరుకు వెళ్ళే బస్ స్టాప్ వద్ద దిగబెడుతారా _?!""
అని అడిగాను
""అలాగే నండి _ , ఇది మా అదృష్టం _!!
_ అంటూ కారు తేవడానికి వెళ్ళాడు డ్రైవర్
నేను ఆ భవనం అందాలను కొంతసేపు ,, , చూస్తూ_ బయటకు వస్తూ ఉంటే ,హఠాత్తుగా నా ఆలోచన లో మార్పు వచ్చింది ,
""ఇంత గొప్ప ధనవంతుడు _?నాకు ఏమీ ఇవ్వకుండా ,ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తారా ,?, ,బహుశా నేను పేద వాడిని అన్న అహంభావం నిర్లక్ష్యం అనుమానం కావచ్చు __!,లేకపోతే ఇవ్వాలని ఉంటే_నాకు ఏదైనా ఎంతైనా ఇచ్చేవాడు కదా _?"
అన్న పాడు ఆలోచన నన్ను ఆ క్షణంలో మనసులో కదిలింది ,_!, ఏ అజ్ఞానం నాకు మైకం లా కమ్మిందో గానీ ,
వారెవరూ చూడకుండా రాత్రిళ్ళు నేను కప్పుకుని పడుకొని ఉన్న మెత్తని కాశ్మీరీ శాలువని నేను అదే కవర్ లో అడుగున దాచాను ,,,_!
ఇప్పుడు బయటకు వచ్చాక ,, మళ్లీ సంచీ తెరచి చూస్తే నేను చేస్తున్న చేసిన ఘోరమైన పొరబాటు తెలిసి వచ్చింది నాకు ,_!
వారు ఇచ్చిన ఉత్తరం కవర్ ,నేను దొంగతనంగా దాచిన శాలువా , రెండింటినీ కలిపి చూస్తుంటే ,ఎంతో బరువుగా ,పరువూ తక్కువగా , నాకు సిగ్గుతో అవమానం తో తల తీసేసి నట్టుగా తోచింది ,
""చీ చీ _! ఎంత సిగ్గు మాలిన సిబి పని చేస్తున్నాను ?? పాపం అంత మంచి మనస్సు ఉన్న మనిషికి ఎంత చెడ్డ పేరు తెచ్చాను ,ఆయనకు ,??ఇలాంటి అత్యాశ పరుడు , మా పెద్దాయన కు స్నేహితుడు ఎలా అయ్యాడు _? అని వీరంతా అనుకునే విధంగా నీచమైన పని చేశాను నేను కదా _!
అయ్యో _! భగవంతుడ _! నా తప్పును క్షమించు_!
బొత్తిగా ఏమీ తెలియని నిజమైన పల్లెటూరి బైతు నైపోయాను కదా _!,
దీనికి నేను కక్కుర్తి పడ్డానా ,_?! ఛ ఛ _!
ఇందుకోసమే వచ్చా నా ,నేను _??
దేవుడు నాకు ఇచ్చినది చాలకనా ,??
అసలు నేను ఎందుకు రావాలి _?
ఆయన నుండి డబ్బులు ఎందుకు తీసుకోవాలి ?
ఎందుకు ఇన్ని రోజులు తేరగా తిని ఉన్నట్టు _?
నా స్థాయి మరచి ఎందుకు వెధవ లా ప్రవర్తించాను ,_?!
నేను ఇచ్చిన మర్యాద కు ప్రతి ఫలం ,గా ఇలా చెల్లింపు కోసమే వచ్చా నా _?!
చీ చీ __!" అనుకుంటూ నేను చేసిన ,చేస్తున్న పనికి నాపై నాకే అసహ్యం రోత పుట్టింది _!
తండ్రీ ,పరమాత్మ _!
నేను ఆయనకు ఏమి ఇచ్చాను ?
ఏమీ తీసుకెళ్తూ ఉన్నాను ?
నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటే ,
నాకు జ్ఞానోదయం అయ్యింది _!,,నాలోని మనిషి మేల్కొని,"" చేసిన , తప్పు దిద్దుకో*_ ఇప్పటికైనా _!" అంటూ హెచ్చరిస్తూ ఉన్నట్టు అనిపించింది,
ఇక నేను ఏం చేయాలో నాకు తెలిసి వచ్చింది,
నేను ఎవరో ,?నేను ఏమిటో ,నా స్తోమత వేషం భాష స్థాయి , విషయం అంతా మెల్లిగా __నాకు అర్థం అయింది
వెంటనే నేను , ధరించిన ప్యాంటు షర్టు తీసేసి ,
మూల గా కవర్లో ఉంచిన నా ఒరిజినల్ రైతు దుస్తులు దరించాను
వారు చూస్తూ వుండగానే కవర్ లో అందమైన మెత్తని శాలువా ను కూడా పెడుతూ వారికి అందించాను
వారు నాకు ఇచ్చిన ఉత్తరం ఉన్న కవర్ ను మాత్రం భద్రంగా బనియన్ జేబులో దాచుకుని , అక్కడున్న ప్రతీ ఒక్కరికీ, నమస్కారం చేస్తూ తిరిగి వచ్చాను
ఇపుడు నాకు ఎంతో ఆనందంగా మనసు హాయిగా. తృప్తిగా అనిపించింది ,
నాది కాని దానిని ,ఇక్కడినుండి తీసుకుని పోవడానికి నాకు ఏం అధికారం ఉంది _?
కనీసం , అదృష్ట వశాత్తూ ,నాలోని మానవత్వం మేల్కొంది_! ,,
అదృష్ట వంతు న్ని నేను _!
పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాను ,_!
ఇదంతా నేను కోరి కోరి తెచ్చుకున్న సమస్య నే కదా _!
నాకు ఇదంతా చేయాల్సిన ,ఒకరిని యాచించాల్సిన అవసరమా ,?
ఈ చేత్తో నేను ఎంతమందికి అన్నం పెట్టాను ,?! ఎందరికి సహాయం చేశాను ,, ?!
ఓ యజమాని _! ఓ దైవమా _!, నీ మిత్రుని , ఈ పేద రైతుని, అతి సామాన్యుడి తెలియక చేసిన చిన్న అపరాధాన్ని దయతో మన్నించు ,_!"
అంటూ ఆశ్రుపూ రిత నయనాలతో , పశ్చాత్తాప హృదయంతో ,నేరం చేసిన వాడిలా , కంటికి కనపడని ఆ భాగ్యవంతుు నికి మనసులో క్షమాపణ చెపు తుంటే _ కాస్తా నా మనసు తేలిక పడింది ,,
నిజమే నేను వచ్చిందీ ,__ ఇంద్ర భవ నాన్నీ తలపించే ఈ అందాల సౌధంలోకి __ఒక సామాన్య గ్రామస్తునీ వలె వచ్చాను
కానీ ,
ఇందులో , నాది కాని ఏ వస్తువు పైనా కూడా ఇక్కడినుండి నాతో తీసుకు పోయె అధికారం ఉండదు కదా_!""
అని అనుకుంటూ నేను చేసిన మూర్ఖత్వం _పిచ్చి పనికి సిగ్గు పడుతూ ,నన్ను ప్రేమతో దయతో ఆదరించిన వారీకందరకు కృతజ్ఞతగా నమస్కారం తెలియజేస్తూ నా ఊరికి నేను తిరిగి వచ్చేశాను __!
ఇక్కడికి ఈ కథ అయిపోలేదు _!
ఇద కథా ప్రారంభం మాత్రమే __!!
__ ఇది ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్ యజమాని గురించిన వ్యవహారం
అందులో నా అతిథులు ఏ కొంత మందో అరుదుగా ఉంటారు కదా _!
మరచిపోలేని చేదు అనుభవం ఇది _!! చిత్రమైన ఈ అనుభవాన్ని , నా తిరుగు ప్రయాణం పొడవూ తా,,, జ్ఞాపకం చేసుకుంటూ ,,నాలాంటి , పల్లెటూరి రైతు , బీద వాడు కడు పేద వాడు , ఇలాంటి ధన వంతు ల భోగ భాగ్యాలను ఇలా దగ్గరనుండి చూస్తూ ఉంటే , ఇలాంటి వికారాలు ,విపరీత బుద్ది కలగడం కూడా సహజం కదా అనుకున్నాను ,_!
నిజానికి ఇది ఆ దేవుడు నా నిజాయితీకి పెట్టిన పరీక్ష ,, గా భావించాను నేను _!
ఇందులో నెగ్గాను_ గెలిపించా డు , ఆ పై వాడు దైవ కృప వలన __!
అంటూ చేతులు జోడించి నింగిలో ప్రకాశిస్తూ ఉన్ టీ ఉన్న ఆ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి కి భక్తితో కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారాలు సమర్పించు కున్నాను ,,
__ ఇల్లు చేరాక , జరిగిన విషయాలు , పీడకలలా మరచి పోయె ప్రయత్నం చేశాను , నాకు
ఒక గుణ పాఠం బోధ పడింది
భగవంతుని కరుణ వల్ల,,
నా నిజాయితీ మంచితనం పై నాకు మరింతగా నమ్మకం ఏర్పడింది ,
వారం రోజులయ్యాక ,మనసు స్థిమితం అయ్యాక , పొలం పనులలో విశ్రాంతి దొరికాక ,ఒకరోజు ,నా భార్యా పిల్లల సమక్షంలో , జాగ్రత్తగా దాచిన ఆ పెద్దాయన ఇచ్చిన ఉత్తరం తీశాను చూడగానే భయమేసింది ,__!
"" అమ్మో _!చాలా పెద్దగా ఉంది అది ,__!
ఏదో బ్యాంకు కెళ్తే ,అక్కడా సంతకం పెట్టడం ,,కొన్ని ,పేర్లు చదవడం , వరకూ వచ్చు ,__ నాకు _!
అంతేగానీ, ఇంత పెద్ద ఉత్తరాలు చదవడం నాకు సాధ్యం కావడం లేదు__!!
అయితేనేం
నా భార్య పద్మావతి తెలివి గలది , పదవ తరగతి వరకూ చదివింది ,
ఆవిడకు ఇచ్చాను ఉత్తరం , __!
"" నీవు చదవమని ""అంటూ _!
ఆమె సిగ్గు పడుతూ,,
""మీకు రాసిన ఉత్తరం నేను చదవడం ఏంటి ,? నేను చదవను _;
అంది
"లేదు_! లేదు _! , ఇంకా,నీవు ఎంటి ? నేను ఎంటీ? ఆ పెద్దాయన దయ వలన, నీ చదువు ఈ విధంగా ,ఇలా మనకు ఉపయోగ పడుతు న్నందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది , సుమా ,, కాస్తా చదివి పెట్టు _!
కానీ నిదానంగా ,, అంత పెద్ద ధనవంతుడు రాసిన ఉత్తరం కదా ,,_! ఏం రాశాడో ,ఏమో _?
పైగా ,ఇంటికెళ్ళాక ,మన కుటుంబ సభ్యుల మధ్య చదువుకోమని చెప్పాడు ,కూడా !! ప్రత్యేకంగా ,
చదువు పద్మా _!"
అంటూ నేను ప్రోత్సహించటం తో ,ఆమె నవ్వుతూ ఉత్సాహంగా ఆసక్తితో ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది ,_
( ఇంకా ఉంది )
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా
పద్యాలు
గాలి తాకున క దలాడు ఆకు వోలె__
ఏల భీతిల్లెదవు_ హరిణేక్షణ _ నీ కడ నేను లేనే _!
"దొండ పండ ని భ్రమసి కొరుక వచ్చు చిలుక _!
తెలియకున్నది ,!దేవి_! నీ అధర కాంతి _!"
"ఏది తన చేతిలో లేదు "యనునే గానీ_
ఏది ఏమైన చేయుచు_ వగచు చుండు_!
ఏది చదివిన_ వినిన అర్థంబు గానీ _
ఏది జగమున ఉండు ? మనుజ చిత్తంబు గాక _!""_
"కనుల ముందున్నది_ మాయ మగుట వింత _!
కనని వేషాలు కనుట_ మరొక్క వింత_!
కనని వినని భావాల_ చింత వింత _!
కనని సత్యము_ తానునిత్య" మనుట వింత _!"
""ఏమీ చేయుదు ,? నా మాట మనసు వినదు ,_!
"ఏమి తెలియని కోతి వలె , గెంతు చుండు_!"
" ఏమి చేసినను _ తిక్క గా , వెక్కి రించు _!"
""ఏమి చేయక యున్న ,నెత్తిపై మొట్టు చుండు __!""
"ఎంత బావుండు _!? నేన లా చేసి యున్న _!?
ఎంత పని చేసితి ? నా మతి కాలి పోనూ _!?
ఎంత అవునన్న _ కొంతైనా కాక పోయే_!??
ఎంత అనుకొన్న నేమీ, చేయి దాటినాక _!""
""నిన్ను పూజించి కొలువ నా చేత కాదు _!
""నిన్ను ధ్యానించి స్మరియించ వీలు కాదు _!"
""నిన్ను ఊహించి భావించ నా తరము కాదు_!""
""నిన్ను పట్టుట , కృష్ణ , ఆ విధము చెపుమా _!!""
""నేను హీనుడ!దీనుడ! ,పిరికి వాడ _!
నేను ఎరుగను " ఏది, అని తెలియ నోడ!
నేను ఎవరిని ? అని ఎపుడు తలచనొడ,_!
నేను అనునది " విషమని తెలియ నోడ _!!""
నాకు తెలుసును ,, నా జన్మ గొప్ప దనియు
నాకు తెలి సెను , పశువును కాను నేను!
నాకు తెలిసిన వన్నియు వట్టి బూటక ములు!
నాకు తెలుపుము కృష్ణ _! నిను పట్టి వేడు విధము""
కృష్ణ నీ చూపులో కరుణ , కలచి వేయు _!
""కృష్ణ _! నీ రూపమే తలచ మేను మరతు _!"
""కృష్ణ _! నీ నామ గా""నమున మది మత్తెక్కి పోవు _!"
""కృష్ణ _! ఎందుకు నీవే నా ఆత్మ కావూ ??""
""అత్మ తెల్లన , శుద్ధ మానస సరోవరమ్ము _!
పాలు వెన్నెల , తెల్లని వెండి కాంతి _!
శార దా దేవి చల్లని భావ మహిమ__!
సత్య మహింస లు _ తెల్లని పూలు కావే _!!""
మాయ ఈ జగము అని నాకు తెలియ ద య్యా_
మాయ లో బ్రతుకు మాదని తెలియ న య్యా _!
మాయ కాదిది బ్రహ్మ మని ఎరుగ నయ్యా__!
మాయ ఏదియో కృష్ణ,ఆ మర్మ మేదో చెపు మా !!""
""కష్టము నాదు జన్మము _!
""కష్టము కోసమే పుడితి_నేననే__!
""కష్టము నష్ఠమౌ నెపుడు?? _?
కష్టము కృష్ణా_!నీవు కృప జూప కుండి నన్_!!""
కడలి కెరటాల వడి వలె , రాత్రి పగలు __!
""క్రమ్మి వేయుచు నుండే,తేరుకొకమునుపే _!!
కనికరమ్మింత చూప దు,_నిను తలచ నీదు __!!""
కరుణ జూపుము , కృష్ణా_! విధి కాటు పడక ముందే __!"
""వానలు ,ఎండలున్ _ తిరుగు కాలము _!
""వారధి ,గాలులు, చావు పుట్టుక ల్_!
""వాడిగ వచ్చు చు పోవుచుండే_! నేను నీ వాడిని గానే _!
వారి బారి బడనీక _కృష్ణా_! కృపన్ నను జేరి కావుమా _!""
""ఎన్ని నటన లు చేసితి నింత వరకూ__!
""ఎన్ని నటన లు చేయ వలె,దీని కంతు లేదే _!
""ఎన్ని నటనలు నటనా గ్రేసర,_ నే జేతు నయ్య ?
ఎన్ని జన్మలు నటియించ నీ కృప కలుగు కృష్ణా ?""
ఎన్ని మారులు నీ గుడికి వచ్చి యుంటి?
ఎన్ని మారులు నీ ముందు నిలిచి యుం టి?
ఎన్ని మారులు మరవక దలచి యుం టి ?
ఎన్ని మారుల అటు జేయ కృష్ణ_! నీ కృపను గొందునేను?
నిన్ను నుతియించు ప్రతి రోజు , శుభ దినమ్ము _!
నిన్ను నుతియింప కున్న అది ,దుర్ధినమ్ము _!
నిన్ను నుతియింప నేరని నోరు , పశువుకు మూతి గాదె _!
నిన్ను నుతియింప గల నెట్లు ?నీ కరుణ లేక __?
నేను పాడె ద , నీ నామ మద్భుతము గా_!
నేను ఆడె ద , మై మరచి అలుపు దీర_!
నేను వే డె ద, తనివార,నోటి తీట దీర_!
నేను చే సెద, ఏదైన,కృష్ణ_! నీవు దయ జూపినంత __!!"
"నన్ను నీ వాడని చెప్పు , పద్మ నాభా_!"
నన్ను నీ వాడిగా ప్రకటించు ! రాధ ప్రియుడా_!
నన్ను నీ వాడని ,నీవు నమ్ము వరకూ__
నన్ను నేనును , ఏ నాడు క్షమి యించ బోవ , కృష్ణా_!
""నిన్ను దలచిన ప్రతి క్షణ ము సార్ధకమ్ము _!
"నిన్ను దలచిన జన్మ యేజన్మ నిజము _!
""నిన్ను దలచని ప్రతి జీవిబ్రతుకు రణము _!
నిన్ను దలచిన కృష్ణా_! వృథా కాదు, ఈ జగమ్ము _!""
ఏమి జేసితి, కృష్ణా_! నీ కొరకు నేను __!"?
ఏమి జీసితి,_? నను నీవు జూచు కొరకు _!"?
ఏమి జేసిన వినిపించు ,నీకు నాది ఆర్తి ?
ఏమి చేయు దు _? కృష్ణా, నీ కృప లేక యున్న _!""
నీవు నిరాకార నిర్గుణ రూపివి _!
సచ్చిదానంద విశ్వాత్మ భావుకు డ వు _!!
నేను దీ నత తో ,కర్మల మోయు చుండ__!
నిన్ను భావింతు నెట్లు? నా బరువు తగ్గించు వరకు __!""
""నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి _
నరము తెగిపో వు వేదన కల్పించి నా వు _!
నర ము బంధించలేని కృష్ణ ప్రేమ నిచ్చి__
నరము నారాయణా అని పలుకు కృప ను ఇమ్మా _!""
ఇచ్చె డీ హస్తము గొప్పది_
ఇచ్చె డి వాడె పు డు , దివ్య తత్వము వాడే _!
ఇచ్చె డి దొడ్డ గుణమ్ము తెలియక __
ఇచ్చె డీ వారి నిందించుట , కృష్ణ_!నీకు నచ్చదు కాదా _??""
""జరిగినది , జరుగ నున్నది _
జరి గెడునది , నేవెరుంగు దువు _!"
"*జరిగిన నా జీవిత కాలము జరుగదు కద, మరల_!
విలువ తెలియుట ఎటులో _??"
తెలియును భూమియు,గ్రహములు
తెలియును అవి ఆగకుండ భ్రమియించు ట యున్ __!
తెలియును నీవు నను తింపుట_
తెలియును నీకిది ఆటని_!
నిజమే దో తెలియ జేయుము, కృష్ణా _!""
"ఆత్మ సమర్పణ భావము_
ఆత్మలో పరమాత్మ గనుట_
ఆత్మలో _నిను శోధించి తరచి,_
ఆత్మలో నిను దర్శించుట, నీదు దయతో గా దే _!""
ఎంత ముద్దు రా , నీ నగు మోము కృష్ణ_!?
ఎంత ముద్దుర, దొంగ నవ్వు , కృష్ణా?
ఎంత ముద్దు రా, నీ చల్లని చూపు కృష్ణా?
ఎంత ముద్దు రా, నీ కాంతి రూపు కృష్ణా?"
"నిన్ను తన బిడ్డ డని మురిసే యశోద మాత_!
నిన్ను తన ప్రాణమని యెంచే ధన్య చరిత _!
నిన్ను తన స్తన్య పానమున పెంచి పెద్ద చేయ,,
నిన్ను తనయుడు గ పొం దిన ఆమె భాగ్య మెంతో ??
నంద రాణీ కి అల్లారు ముద్దు కొడుకు _!
నంద రాణీ కి ఒడిలో నిదురిం చు కొడుకు _!
నంద రాణీ ని మురిపిం చు వరాల కొడుకు _!
నంద రాణీ కి కొడుకు వా, నిజము చెపు మా ??""
"కృష్ణ,!నీ రాధ, నీ కొరకు వేగు చుండే_!
కృష్ణ_! తన శ్వాస నిట్టూర్పు సెగలు చూడు _!"
కృష్ణ_! తన ప్రాణము నీ కొరకు నిలుపు _!
కృష్ణ_! ఆమె అచేతన దీన స్థితిని చూడు _!""
సా విరహే తవ ధీనా , రాధా
"" కృష్ణా_! నీవు లేకుండ _నీ రాధ జీవించ లేదు _!
కృష్ణా! ,నిరతము నీధ్యాసతో తన శ్వాస వదులు _!
కృష్ణా_! తానెటు చూసినా, నీ రూపు తలచు _!
""కృష్ణ,, ఆమె దుఖము మాటలో ఎటుల చెపుదు ??"
""ఎటుల ఓర్తువు , నీ రాధ దీనత ను కృష్ణా _!
ఎటుల కరుగ దు నీ కటిన చిత్త మింక _!
ఎటుల దయ జూ తు వయ్య, మా చెలిని , సఖి నీ_!
కృష్ణ, చిత్తరు వోలె మారిన ఆమె తీరు చూడు _!""
కృష్ణ,నిను స్మరియించ మీరా బాయి గానూ
కృష్ణ, నిను స్తుతియించ సూర దాసు గాను
కృష్ణ నిను భావించ చైతన్య ప్రభువు గానూ
కృష్ణా, నిను సుంతైన తెలియని అల్ప జీవి నేను _!
ఎంత ఎలుగెత్తి పిలిచిన నను జూతు వయ్య
ఎంత దీనత వేడిన నీవు దయ చేతు వయ్య
ఎంత పాడిన నీ లీల తరుగ దయ్య
ఎంత గోలిన నా మొర ,,నీవు విందు వయ్య"_!
కృష్ణ, నీ ప్రేమలో రాధ ఎంత మురిసే_!?
కృష్ణ, నీ తత్వ మెట్లు గోపికల కెట్లు తెలిసే_!?
కృష్ణ, నీ భక్తి యమునమ్మ ఎట్లు గ్రోలే?
కృష్ణా, నీ చరణ ముల వ్రజ భూ మి ఎట్లు ధన్యమయ్యే_!""
లోకములో బాధలన్నీ
యోగము తో నీకు అర్పించిన ,,
వ్యాధులు నిక్కము మాయము _!
కృష్ణా, నీవే దిక్కు అని
గురి ఉంచిన చాలు కృష్ణా _!""
మేము నేర్చితి విద్య లనేక ముగను,_!
మేము ఆర్జించిన ఆర్థిక, సాంకేతికత ను
మేము పొందిన సంస్కార గౌరవముల,,
భక్తి మీరగ నీకనిన ,అవి మాకు శక్తి కృష్ణా__!"
బాధ లేనట్టి మనుజుడు కానరా డు,
బాధ పడువాడు ఎన్నడూ బాగు పడడు
బాధ లేకున్న వాడసలు మనిషి కాడు
బాధ పెట్టుట కృష్ణ,మాకు నీ పరీక్ష కాదా
""నీవు రాధవు కాలేవు , కృష్ణ! ఎపుడు __!""
రాధ హృదయా న గల కృష్ణు ని కదిలించలేవు _!
రాధ నీవుగా , మాధవుడు నేనై,
ఎన్ని వేషాలు మార్చిన , నను గెలవ లేవు కృష్ణా_!""
స్త్రీకి మాత్రమే తెలుసు ఆత్మ సర్పణమ్ము _!!
స్త్రీకి మాత్రమే సాధ్యము , తన విభుని గెలు వ _!
స్త్రీ కి మాత్రమే సహనము , సహజ గుణము _!
స్త్రీ వి నీవై న గానీ, తెలియదు, ఆమె గొప్ప తనము _!"'
""రాధ హృదయా న , మాధవు డొక డే ఉండు _!
రాధ మనసంత మాధవ మయము నిజము _!
రాధ డెందము అందము , మాధవుని కొరకే _!
రాధ మాధవుల అనుబంధ మపురూప అద్భుతమ్ము _!!"
దూరము తన తలిదండ్రులు ,
దూరము తోబుట్టు పుట్టి నింటి వారంద రు తగన్ ,
దూరము వారైరి దగ్గర , ఆడ కూతురి విధిలో ,
దూరము దగ్గర చేసిన ,నిను దూరు దునా,కృష్ణా,_!
ప్రేమ కొనియాడు దు నా _!!"
""సుఖమనిన కాదు ,_ధనము లు _!
_సుఖము లు కావు _మేడ ల్ మిద్దెల్_!
సుఖము తిని తిరుగుట కాదు _!
సుఖ మనగ నీతో చనుట, సుఖ దాతా , కృష్ణా _!
""కష్టము నిను గని తలచుట__!
_కష్టము నిను విడిచి మనుట _!,కష్టము తలపన్ _!
కష్టము నిను గుర్తెరుగుట_! ఈ కష్టము ఇష్టము చేయుము ,_!
కష్ట నివారణ _!ముగ్ద మోహన కృష్ణా _!!
వీడు అబద్దాల కోరు,_! వీడి సిగ తరగా !
_ వీడు పుట్టుకతో నే అబద్ధము _ తట్టలు తట్టలుగ పలుక పుట్టెను_!
,అది నాలికనా_? తాటి మట్టా_? ఎందుకు వీడికి నోరును ,_ఇస్తివి_?
ఇది ఏమి ఆటర కృష్ణా ,?
"క్రీ_!" యనుచు ఉచ్వాసము ,
"ష్ణా_! యనుచు నిశ్వాస ము ,
క్రి__!" యని ఊపిరి పీల్చు చు
"ష్ణా_!" యని బయటకు వదలు చు ,
శ్వా స లో నీ ధ్యాస ను నిలిపిన ,
సాధ్యము కాదా,నిన్నుపట్ట ముగ్ధ మోహన కృష్ణా_!""
వెన్న దొంగ వని నిన్నందురు !
నీ హృదయము వెన్న గ, తెలియగలేరు _!
వెన్నవన్నెల చిన్నెల రేడా _!
వెన్న ల వెన్నెల కన్నా మిన్నా __!
,నీవే , కన్నా,_! నీవే మిన్నా_!"" _!"
విషమును విషమని అందురు ,
విషయము కూడా విషమ ట _!
విషము విషయ వాసన యను
విషయము ఎరిగించ రా దా, విషయ విహారి _!
పూతన స్తన్యము గ్రోలీ, దాని
పాతకములు దునిమి ముక్తి నొసగి తివంట !
ఆ "పూతన "గ నను పుట్టించుము , _!
_కోపమున నీకు విషము కుడిపి , మరణించుటకున్ _!!"
తెలియదు ఇది నీ మాయ ని_!
తెలియదు లోకమంత నీ మాయా మయమని_!
తెలియదు నా అజ్ఞానమే మాయనీ _!
తెలియదు నిను మరచుట మాయని _!
తెలుపుము ఆ మాయా జ్ఞానము _!
,తెలుపుము ఆ తెర తొలగు విధానము _!,
తెలుపుము కృప జేసీ,
కృష్ణ,!"మాయా తీతా _!""
తెలియను _ నా జీవనము ,!
తెలియను_నీ చిత్ర విచిత్ర మాయా మహిమన్ _!
తెలియను _ఇది మాయా జగమని _
తెలియను _ నీవింత గొప్ప మాయావి వనీ _!
తెలిసీ తెలియని జ్ఞానము ,
నీ మాయే కాద ,?ముగ్ద మోహన కృష్ణ _!"
"జగమే నిత్యము ,_సత్యము_!
"ఈ జగమే బ్రహ్మము ,నాకు పరమ ధామము కూడా _!
జగముల కుక్షిలో ను నుచి_ జగముల నేలె డి స్వామీ_!"
నీ జగతిలో _నేనేమి టో_!? ఈ జగమెరుగుట ఎలాగో _?
జగదీశ్వర ఎరకజేసి కావర కృష్ణా _!""
"నా ప్రక్కన ఉందువు కానీ,, నాకు నీవు కనపడ వు _!
నాతో నే పని చేయింతువు _ నాకు తెలియకుండ నీవు _!
నా ప్రతి పనికి సాక్షీగ ఉంటూ, నా పని పట్టు చుందువు _ కదా _!!
నా కిప్పుడు తెలిసే నూ, నీవెంత వింత పనివాడవొ కృష్ణా !"
"భాగవతము "వింటే, మనము "బాగవుతము " అని తెలుసు_!
" భాగవతుల" సాంగత్యము _! మనల బాగు చేయు నని తెలుసు _!
ఈ భాగోతము ఏమిటో ? ఈ బాగవుట ఎందుకో_?
బాగుగ నను చేయుట కై_ బాగుగ వివరించు కృష్ణా_!
నేను బాగు పడంగన్_!"
"హరే _!"యనిన తొలగింతువు పాపము_!
"కృష్ణా _! " అనిన రక్షింతువు _!
"హరే కృష్ణ" తో మరి దగ్గరరౌదు వు !
"హరే కృష్ణ," పిలుపెంత మధుర మో_?
""హరే కృష్ణ _!" అని
నిను పిలిచెద కృష్ణా_!""
_!"
""సుఖమనిన కాదు ,_ధనము లు _!
_సుఖము లు కావు _మేడ ల్ మిద్దెల్_!
సుఖము తిని తిరుగుట కాదు _!
సుఖ మనగ నీతో చనుట,
సుఖ దాతా , కృష్ణా _!
""కష్టము నిను గని తలచుట__!
_కష్టము నిను విడిచి మనుట _!,కష్టము తలపన్ _!
కష్టము నిను గుర్తెరుగుట_!
_ఈ కష్టము ఇష్టము చేయుము ,_!
కష్ట నివారణ _!ముగ్ద మోహన కృష్ణా _!!
26-05-2023
Thursday, May 25, 2023
శివోహం
శివోహం
శివోహం
Wednesday, May 24, 2023
శివోహం
శివోహం
శివోహం
శివోహం
Tuesday, May 23, 2023
శివోహం
శివోహం
Monday, May 22, 2023
శివోహం
Sunday, May 21, 2023
Saturday, May 20, 2023
Friday, May 19, 2023
శివోహం
Thursday, May 18, 2023
శివోహం
శివోహం
Wednesday, May 17, 2023
శివోహం
శివోహం
శివోహం
శివోహం
Tuesday, May 16, 2023
శివోహం
Monday, May 15, 2023
శివోహం
శివోహం
శివోహం
Sunday, May 14, 2023
శివోహం
శివోహం
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
-
శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది. నిన్ను చేరే దారిలో భయమేమి కలగక...