Friday, June 30, 2023

శ్రీ కృష్ణ గోవిందా

నీలమేఘ శ్యాముడు
నీరజ దళ నేత్రుడు
సామజవర గమనుడు
సరసిజ దళ నేత్రుడు
సామ గాన లోలుడు
భక్తజన మం దారుడు 
జగదేక సుందరుడు 
షోడోశ కళా పరిపూర్ణుడు 
శంఖచక్ర పీతాంబరుడ
శిఖిపించ మౌళి
హరి శ్రీహరి శరణు.

శివోహం

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడు
కలియుగ ప్రత్యక్ష దైవం
ఆపదమొక్కులవాడు అనాధ రక్షకుడు
విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు
అంతటా తానుకాక మరొకరు ఎలా
కనిపిస్తారు...

ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా
ఓం నమో నారాయణాయ

శివోహం

శివా!సగం సగం అంటావు
ఆ సగమూ నీవే అంటావు
అలా ఎలా అంటావు
మహేశా . . . . . శరణు .

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు
మారినవారు మరల మారలేదు
కానీ, 
నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా!!
ఏదారిలో నడుపుతావో? నీదయ శివా...
మహాదేవా శంభో శరణు.

Thursday, June 29, 2023

శ్రీమాత్రే నమః

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది. ఆమె పార్వతి, ఉమ, ఇంద్రాణి, పరాశక్తి, ప్రత్యంగిదేవి. అన్ని రూపాలూ ఆమెవే. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అందుకే ఆమె ఆది పరాశక్తి అయింది.

అమ్మ పిలిస్తే పలుకుతుందీ అంటే, అయ్య పిలిస్తే పలకడని కాదు. అయ్య ప్రత్యేకత వేరు. అమ్మ ప్రత్యేకత వేరు. అమ్మ అందరికీ అమ్మే. అసలు అమ్మ అనే పదమే ప్రేమ స్వరూపం. అందువల్ల అమ్మ ఆ ప్రేమ స్వరూపి, ఆనంద స్వరూపి, కరుణా స్వరూపి దయామయి. అందువల్ల అమ్మ నామ స్మరణ ప్రేమమయమే. అందుకే సాయిబాబా ప్రేమ గరించి విశిష్టంగా చెప్పేవారు. తోటివారిని ప్రేమించమని చెప్పడంలో రహస్యం ఇదే. అందుకే ఆయన రాబోయే కాలంలో ప్రేమ సాయిగా వస్తానని చెప్పారు కూడా. మనస్సు శాంతిగా ఉండాలన్నా, బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు-ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి. అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణ సదాచారాలనే ఐదింటిలో ఒకటైన ధర్మ స్వరూపంగా అమ్మ చిదాకాశ స్వరూపిణిగా వెలుగొందుతోంది.

శివోహం

శివా!అడుగు అడుగునా నినుగంటున్నా
అద్వైత మెరుగగ పయనిస్తున్నా
ద్వైతం దగ్ధమవనీ అద్వైతం అలవడనీ
మహేశా . . . . . శరణు

శివోహం

శివ...
నా కర్మకు సంపూర్ణ బాధ్యత నాదే...
అందుకే కష్టాలను ఇష్టంగా ని ఆశీస్సులుగా ప్రసాదంగా భావిస్తు ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా నీ ప్రసాదంగా నిన్ను స్మరించి సేవించి తరించే శుభ తరుణంగా కర్మ ఫలితం అనుభవించే మహద్భాగ్యం గా ఆ బాధలను సంతోషంగా స్వీకరిస్తాను...
కానీ ఒకటే కోరిక తండ్రి నీ సన్నిధిలో ఉంటూ నిరంతరం కొనసాగే భక్తి భావ సంపదను ఎన్ని జన్మల కైనా సరిపోయే భక్తి జ్ఞాన వైరాగ్య భావ సంపదను మాత్రం అనుగ్రహించు...
మహాదేవా శంభో శరణు.

ఓం శరవణ భవాయ నమః

నిప్పుల్లో  కాలిస్తే బంగారం లోని మలినాలు తోలగినట్టుగా...
మనలోని అరిషడ్వర్గాలు దూరం చేసే మహామంత్రాం...
ఓం శరవణ భవాయ నమః

Wednesday, June 28, 2023

తొలిఏకాదశి శుభాకాంక్షలు

సర్వలోక నాయకా
శ్రీ ఆశ్రిత రక్షకా
శ్రీ సర్వసంపద దీపికా
శ్రీ దేవి వల్లభా
శ్రీ అభయప్రధాతా
శ్రీ పద్మనాభా
శ్రీ వేణునాదామృతా
శ్రీ వేంకటేశ్వరా శరణు...

ఆద్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

జై శ్రీమన్నారాయణ

భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే మనసు, బుద్ధి అన్నీ ఆయనకే ఆర్పిస్తాడు. నిర్భయంగా ఉంటాడు. మృత్యువుకు భయపడడు. భగవంతుని చరణాలు వీడడు. అతనికి శోకమనేది తెలియదు. జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించడం వల్ల శోకమనేది దరి చేరదు. భగవంతుని శరణు వేడడం వల్ల్ల మనలో గూడు కట్టుకుని ఉన్న సంశయాలన్ని పటాపంచలవుతాయి. ముక్తి అనే ఒకటే భావన మిగిలిపోతుంది. సందేహాలు దూరమవుతాయి. శరణాగతుడైన భక్తుడు ఎప్పుడూ పరీక్షలకు గురవడు. భగవంతునికితనను తాను దత్తం చేసు కున్న తరువాత భక్తుణ్ని పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు. కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు.

జై శ్రీమన్నారాయణ.

శివోహం

శివా!నీ సాంగత్యం కోరి
నీ సామీప్యానికి చేరి
సాయుజ్య ప్రాప్తికై పరితపిస్తున్నా.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
అజ్ఞానపు చీకటుల నుండి
విజ్ఞాన ధ్యానజ్యోతివి నీవని నీచెంతకు చేరాను
అగుపించినట్లే అనిపించింది అంతలోనే
మరుగైపోతున్నావు...
బరువు బాధ్యతల నిన్ను మరచినవేళ నన్ను ముందుండి నను నడిపించవా..
నీవే నాగురువుగా.భావించి
ఆగమేఘాల నీ ఆలయానికి చేరుకున్నాను
చేయూత నీయవయా శివా...
మహాదేవా శంభో శరణు.

Tuesday, June 27, 2023

శివోహం

జీవన దాత...
మోక్ష ప్రదాత...
విధాత ఐనా పరమశివుడి నామ స్మరణ అనే చిన్న నిప్పు రవ్వ తో పెద్ద పెద్ద గడ్డి కుప్ప లాంటి పాపపు భారం క్షణం లో భస్మం అయిపోతుంది..
నమ్మి చూడు ముందుండి నడిపిస్తాడు మహాదేవుడు...
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 26, 2023

శివోహం

శివా!నా మౌనంలో శతకోటి సందేహాలు
నీ మౌనంలో అనంతకోటి సమాధానాలు
మౌనమే మధురమాయె మరెన్నో తెలుసుకొనగ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
ఏమిటి నీ లీల...
అంతా శూన్యంలాగే అనిపిస్తుంది...
ఎక్కడో ఓ మూల భయం, ఆందోళన ఏమీ సాధించలేదు అనే బాధ...
ఓ మంత్రం రాదు, పూజ చేతగాదు గురూపదేశం లేదు, సాధనలేదు ఇక ఈ కట్టె ఇలా కాలిపోవాలసిందే నా...
కలలో కలంలో తప్ప ఇలలో కనిపించవా కపాలధారీ...
మహాదేవా శంభో శరణు.

శివోహం

ఈ మానవ శరీరమనే శకటంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి.
ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, June 25, 2023

శివోహం

శివా!మరలా మరలా ముగిసేలా
మరణం జననం నాకేల
మరలా సాగుట మరి ఏల
మహేశా . . . . . శరణు .

Saturday, June 24, 2023

నా తండ్రి మణికంఠ

దివ్యమైన
అద్భుతమైన
ఆనందకరమైన
అపురూపమైన
తన సుందర రూపాన్ని
సర్వఅలంకార
అలంకృత
మందహాస మంగళమోహన విగ్రహాన్ని  దర్శింప
జేసి ఎందరి జన్మజన్మలను తరింప జేశాడో నా మణికంఠుడు.
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

వేగంగా పరుగెత్తే కాలం
మారుతున్న జీవన చిత్రం
ఊపిరి సలుపనిపనుల్లో 
ఎవరికివారు మునకలేస్తున్నారు
పెరుగుతున్న ఆర్థిక బంధాలు
తరిగిపోతున్న హార్దిక బంధాలు
శిథిలమౌతున్న ఆప్యాయతలు
నీరుకారుతున్న సంబంధాలు
ఉరుకుపరుగుల జీవితాలు
బీటలు వారుతున్న అనుబంధాలు
కాల చట్రంలో బందీలు
మరుగున పడుతున్న రక్తబంధాలు
ఎవరికి వారే యమునాతీరే
ఎవరి బాధలు వారివే
పంచుకునే తీరికలేదు
నిన్ను తలచుకునే అవకాశం లేదు
హరి ఏమి ఈ మాయ....
శ్రీహరి శరణు...

ఓం నమో నారాయణ...
ఓం నమో వెంకటేశయా...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

కల్మషమనస్సుల కలిజగత్తులో అంతా పాపభీతే 

ప్రాయశ్చిత్తంకోసం మదిలో నీ నామ స్మరణ...

మహాదేవా శంభో శరణు. 

శివోహం

శివా!ప్రతి ఆశ్రమము నాకు పెద్ద బాలశిక్ష,
ప్రతి శ్వాసలో నిలిచేను నీదైన రక్ష
ఈ పలుకులన్నీ నీవొసగిన జ్ఞాన భిక్ష.
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుణ్ణి తలవని రోజు దుర్దినం...
తలిచిన రోజు సుదినం...
దైవాన్ని తలచుకోవాలంటే నమ్మకం మొదటి మెట్టు ఎంత విశ్వాసమో అంత ఫలితం...
అందుచేత మన కష్టసుఖాలకి ,భగవంతుణ్ణి పూజించడానికి లంకె పెట్టగూడదు....
లోన ఉన్న అంతర్యామికి , బయట మనం అనుభవించే భౌతిక కర్మలఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేదు..
మన సంచిత కర్మల ఫలితం మన ఈ కష్టాలు సుఖాలు...
అంతే గాని దైవం మూలకారణం కాదు కదా...
చూసే చూపులో, భావించే మనసులో దైవాన్ని ఆరాధించే తత్వం దాగి ఉంటుంది...
తపన, సాధన,,సత్సంగం, దైవానుగ్రహం తోడైతే తప్ప హృదయంలో దైవాన్ని స్థిరంగా ఉంచుకోడం సాధ్యం కాదు కదా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, June 23, 2023

శివోహం

శివా!శత్రు సంహారాన నెగ్గు పినాకము
వామ హస్తమున దాల్చి విహరించు నీవు
నాలోని శత్రువులనణచగా రమ్ము .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!"నేను"కానిది కాలి బూడిద అయింది
ఆ బూడిద నీ అభిషేకానికి  సిద్ధమయ్యింది
సిద్ధించనీవయ్యా సకల సిద్ధి ప్రదాతా
మహేశా . . . . . శరణు .

శివోహం

పునరపి జననం...
పునరపి మరణం...
దీనికి తరుణోపాయం శివోహం అంటూ చిత్తశుద్ది తో శివ భజన చేస్తూ ఉండడమే...
అన్యదా శరణం నాస్తి...
త్వమేవ శరణం మమ...
తస్మాత్ కారుణ్య భావేన...
రక్ష రక్ష పరమేశ్వర అంటూ  దేవదేవుడు మహాదేవుని శరణాగతి చేయడమే...
ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, June 22, 2023

శివోహం

నీలి కొండ చేరినాము మాధవా
                  నిన్ను చూసి మురిసినాము మాధవా
చెంత చేరి నిలిచినాము మాధవా
          మా చింతలన్ని మరచినాము మాధవా 
మాధవా నీలి మాధవా.

ఎన్నాళ్ళగ విన్నాము ఇన్నాళ్ళకు కన్నాము
ఎంత గొప్ప వాడివయా మాధవా
దివ్యమైన నీ రూపం చూడలేని మాకళ్ళు
చీకటింటి లోగిళ్ళు మాధవా.     
జన్మ జన్మ పాపాలు జగతిలోన శోకాలు
తొలగునులే నిన్ను చూడ మాధవా
మాధవా నీలి మాధవా...

చిత్రమంత విన్నాము చిత్తరువులు కన్నాము
కర చరణము కానలేదు మాధవా
దారుశిల్పమన్నారు ధరణి చిత్రమన్నారు
దాగివుంది నీ తేజం మాధవా
భోగపురి ఈ పురి భోజింపగ నీకు సరి
భజియింతుము మరి నిన్నే మాధవా
మాధవా నీలిమాధవా

నీలి చక్రమున్నది నింగినంటు చున్నది
నీ తేజమునే చాటుతోంది మాధవా
నీ పతాకపు రెపరెపలు గాలికెదురు తిరిగేను
నీ చిత్రమైన లీల యిది మాధవా
తీరు తెలుసుకున్నాను పేరు తలచుకున్నాను
నిన్ను కొలుచు భాగ్యమీయి మాధవా
మాధవా నీలిమాధవా

శివోహం

శివ...
నా మనసు చేసిన పుణ్యమే కదా మనసున నిను నిలుపుట...
కరములు చేసిన పుణ్యమే కరుణాంతరంగా నిను కొలవడం...
దేహము చేసిన పుణ్యమే దేవాధిదేవునికి దాసానుదాసుడనవుటం...
పెదవులు చేసిన పుణ్యమేనీ నామ స్మరణ చేయడం...
హ్రుది చేసిన పుణ్యమే శివ శివ సదా జపించటం...
కనులు చేసిన పుణ్యమే పార్వతి పరమేశ్వరుని కనులార తిలకించటం...

మహాదేవా శంభో శరణు...

కన్నయ్య

కృష్ణా....
నా ప్రేమ బంధం ప్రణయ బాంధవ్యమై నీ బాహుబంధాలలో పరవశిస్తూ బందీ కమ్మంటుంటే బరువైన నా గుండె నీకు ఎన్నో ఊసులు చెప్పమంటోంది కృష్ణా...
నా మది నీ ముందు పరచమంటోంది...
నన్ను నీలో విలీనమవమంటోంది...
నన్ను నీకే అర్పించమంటోంది...
నా మౌనం వెనుక ప్రేమను..
నా హృదయం మాటున దాగిన నా ప్రేమ ఘోషను నీలో దాచుకోమంటోంది...
నీ హృదయాన్ని నాకు అర్పణ చేస్తావో...
నీవే నా చెంత చేరి నా శ్వాసకు ఊపిరి పోస్తావో నీ దయ కన్నయ్యా...

నా తండ్రి మణికంఠ

దేహం పాపం చేయదు...
పాపం చేసేది మన ఆలోచనలు...
గంగమ్మ దేహాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది...
మన అలోచనలను కాదు...
అంతరశుద్ది చేసుకోవాక్సింది మనకు మనమే...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా!అంతటా ఉన్నావని అక్కడ ఇక్కడ వెతికితే
ఓ జానెడు దూరాన అంతరాన ఉన్నావని తెలిసింది
ఆ దారిని చూపించు నా తోడుగా పయనించు.
మహేశా . . . . . శరణు .

శివోహం

సర్వేశ్వరా...
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ మాత్రం ఓపిక లేని సహించలేని దుర్భర  దిన దిన చెరసాల జీవితం అవుతోంది...
నీవున్నావు అంతా చూస్తూ ఉన్నావు...
మా ఆర్తి మొర వింటున్నావు
మా దీన గాథ నీవు ఆలకిస్తు ఉన్నవని కూడా తెలుసు...
నేరక చేసిన మా అపరాదాలు అన్నీ దయచేసి క్షమించు...
నీకు శరణాగత వత్సలుడవు  కదా నీకు తెలియనిది ఉంటుందా ఉంటుందా తండ్రి...
చీమ అయినా నీ ఆజ్ఞ లేకుండా మనగలదా...
మహాదేవా శంభో శరణు.

Wednesday, June 21, 2023

శివోహం

మెదడుంటే  సరిపోదు శరీరానికి హృదయం ఉండాలి...
పూలకు వర్ణాలుంటే సరిపోదు పరిమళాలు ఉండాలి...
పండ్లకు పరిమాణం ఉంటె సరిపోదు మాధుర్యం ఉండాలి...
నిత్యా పూజ చేస్తే సరిపోదు భగవంతుడి మీద భక్తి ఉండాలి.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!అర్ధ భాగమిచ్చావో అర్ధ భాగమై వచ్చావో
అమ్మతో సగమై వుంటూ ఆపై సగము..
హరి కందించి, హరిహర మూర్తిగ తెలిసావా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివుడు...
పలు నియమాలతో పూజలు కోరుకొడు...
వివిధ నైవేద్యల నివేదన కోరుకొడు...
భక్తి స్మరిస్తూ చిటికెడు విభూది, దోసెడు నీళ్లు,ఒక్క మారెడాకు తో పూజిస్తే చెంతనే కొలువై ఉంటాడు...
ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, June 20, 2023

అయ్యప్ప

భగవంతుడు అంతటా ఉంటాడు...
కాని ఎందుకో శబరిమలై వాసుడు హరిహర తనయుడు అయ్యప్ప సన్నిధానం లో  భక్తులు పొందే ఆనందం త్రుప్తి ఎనలేనివి...
పంభ నుండి సన్నిధానం వరకు అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ వందల
మందితో నడుస్తుంటే  దొరకునా ఇటువంటి సేవా అనిపిస్తుంటుంది...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

జ్ఞానంతో  చెప్పే వారి మాటలు వినకపోయిన పర్వాలేదు...
కానీ...
అనుభవంతో చెప్పే వారి మాటలు వినాలి...
ఎందుకంటే జ్ఞానం కన్న అనుభవం గొప్పది...

ఓం గం గణపతే నమః

శివోహం

శివ శంకరా...
అభయంకరా...
నేను చెబితే గానీ నీకు తెలియని విషయమా ఇది...
నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే... చదవగలిగేది నీవే...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Monday, June 19, 2023

శివోహం

సుఖం కలగాలంటే పుణ్య కార్యాలు చేయాలి...
ఎందుకంటే పాప కార్యాలు దుఃఖాన్ని కలిగించి నరకాన్ని చూపిస్తాయి...
ముక్తి కావాలంటే పరమాత్మ శరణాగతి చేయాలి...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!పెక్కు మాటల నడుమ
మౌనం చేస్తోంది ఒంటరి పోరాటం
మౌనానికే నీవు మద్దత్తు పలుకుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుని సృష్టిలో అంతా పవిత్రము...
యదార్థము ,సత్యము ,జ్ఞానమయము మరియు  శాశ్వతమైన బ్రహ్మ పదార్థం కూడా...
కాలచక్ర భ్రమణ ధర్మం వలన పదార్థంలో  ధర్మం లో శరీరంలో జగతిలో కలిగే  పరిణామాలు మనసులోని అనేక  ఆలోచనల వల్ల అనేక రూపాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటున్నాయి
కానీ బ్రహ్మ మొక్కటే...
పరబ్రహ్మ మొక్కటే...

ఓం శివోహం...సర్వం శివమయం.

Sunday, June 18, 2023

శివోహం

శివ...
మాయ మంత్ర, తంత్రాలు, మదిలోకి చేరకుండా...
మనసులోని ఆలోచనలు వక్రమార్గం పోకుండా...
మదిలో తలపులు మమేకంగ ఉండి అనేకం కాకుండా... 
మాయాలోకంలో మనస్సు మారకుండా ఏకాగ్రతతో ఉంచుతున్న నీకె శరణు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!శత్రు సంహారాన నెగ్గు పినాకము
వామ హస్తమున దాల్చి విహరించు నీవు
నాలోని శత్రువులనణచగా రమ్ము .
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుడు ఇచ్చిన దానితో మనం త్రుప్తి పడాలి...
అది మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా భావించాలి...
ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఎలా ఇవ్వాలో అతడికి తెలుసు...
మనకున్న సంపద ఐశ్వర్యం ,కీర్తి వినోదం సుఖాలు భగవద్ అనుగ్రహాలు అది గుర్తించ కుండా ఏ కొంచెం కష్టం కలిగినా నాకే ఈ కష్టం భగవంతుడు ఎందుకు కలిగించాలి అని నిందిస్తూ ఉంటారు...
జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు సంభవించినా భగవంతున్ని తప్పు పట్టడం మనం చేసే మరొక తప్పు అతని ప్రేమ అందరికి సమానమే అందరు అతని పిల్లలే అందులో హెచ్చు తగ్గులు ఏ కన్నతండ్రి అయినా చూపిస్తాడా అలా భావించి పరమాత్ముని మనసారా శరణు వేడాలి.

ఓం శివోహం...సర్వం శివమయం.

Saturday, June 17, 2023

హనుమా

రామ యనుచు ఒక్క సారి పలికి మరచినా...
హనుమ నిన్ను మరువడయ్య కాచు చుండును...
రాముడెవ్వరనుచు లోన చర్చ చేసిన...
సచిదనంద గురువుగా హనుమ మారును...

జై శ్రీరామ్ జై హనుమాన్.
జై శ్రీమన్నారాయణ.

శివోహం

నేను జన్మ జన్మాంతరము...
సుదీర్ఘ  ప్రయాణం చేస్తూ అలుపెరుగని ఒక  బాటసారిని...
నా ధ్యేయం  నీ సన్నిధిలో  చేరడమే...
ఈ జన్మలో  ఈ శరీరం మోహన్ అన్న పేరుతో పిలువబడుతూ ఆది అంతు లేని  ప్రయాణం చేస్తూ ఉంది...
గమ్యం తెలియని  నా జీవనం నా ఈ అనంతమైన యాత్ర నీతో అనుసంధానం చెందేవరకూ ఈ  యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందేనా శివ...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా  మార్చి ఆనందంగా ఆడుకుంటూ లీలగా వినోదిస్తూ నాలో అంతర్యామిగా ఉంటూ నాతో కర్మలు చేయిస్తూ ,అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో అయిపోయింది అంటూ చివరకు తెరదించేస్తు ఉంటావు...
మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు ఇదంతా ఏమిటి స్వామీ...
అంతులేని ఈ కథకు అంతు పలకవా తండ్రి...
ఇక జనానమరణ ఆట ఆడడం నా వల్ల కాదు...
అలసిపోతూ ఉన్నా ఈ జీవుడికి ఈ జీవన చక్ర పరిభ్రమణ వలయంలో నుండి విముక్తిని ప్రసాదించు తండ్రి....
నీ పాద కమలాల ముందు శరణాగతి చేస్తున్న ఈ దీనుడిని కరుణించు తండ్రి...
నీవే తప్ప అన్యమేరగని నాకు వేరే దిక్కు లేదు...
మహాదేవా శంభో శరణు.

అమ్మ

కరుణా సాగారి...
కాళి కపాలిని...
జగదో ధారిణి
అంబ దుర్గ...
మంచు కొండలపై నుండు మహేశ్వరీ...
బ్రహ్మాండ ములకెల్ల నీవే అండా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

Friday, June 16, 2023

శివోహం

శుభ కర్మలను ఆచరిస్తూ సుఖ సంపదను కోరుతున్నాను...
శారీరక  మానసిక  సన్తాపములకు  గురి  అవుతున్నాను...
అజ్ఞాని అయిన నేను ఐహిక సుఖాలపై ఆశక్తి వీడి  జ్ఞానము పొందు ఇచ్చగలవాడవని శరణు కోరుతున్న...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! కాయాన్ని కట్టబెట్టావు
జ్ఞానాన్ని దాచిపెట్టావు
యాచిస్తున్నా జ్ఞాన భిక్షపెట్టు
మహేశా ..... శరణు.

Thursday, June 15, 2023

అమ్మ

ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు పంచమహాభూతములతో కలసి, పంచభూతాత్మకమైన శరీరములు అనగా సకల జీవులయందు తానుంటూ, జననము, వృద్ధి, క్షయము అనెడి సంసారమును ఏర్పరచి, చక్రముత్రిప్పినట్లు త్రిప్పుచున్నది యని మనుస్మృతియందు గలదు. గనుకనే *భవచక్రప్రవర్తినీ* యని అనబడినది.
అమ్మ దయ అంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః.

శివోహం

శివా!ఈ అడ్డుకళ్ళే మోక్షానికి అడ్డు
నిలువు కన్ను తెరచుకొనగ గడ్డు
అడ్డు తొలగనీ గడ్డు ముగియనీ
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...