శివా!మనసు విప్పి చెప్పలా నా మాట
మనసైన వాడివి నా మనసెరుగవా
ఓ కంట చూడు నా కన్ను విరిసేలా
మహేశా . . . . . శరణు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా!రేయెండ రెక్కను తీసి
పూదండగ సిగలో పెట్టి
శాపానికి శాంతి నొసగేవు .
మహేశా . . . . . శరణు
శివా!కనులు తెరచి చూద్దామని నేను
కనులు మూస్తే వద్దామని నీవు
ఎదురు చూపే ఇద్దరిదీ
మహేశా ..... శరణు
శివా!కోర్కెలను బిడ్డకు నన్ను తల్లిని చేయకు
మూర్ఖపు బుద్ధులు నా వెంటపడనీకు
ఈ కింకరునిపై నీ కరుణ జారిపోనీకు .
మహేశా . . . . . శరణు.
శివా!నీలకంఠుడవో నీలమేఘ శ్యాముడవో
ఏదైననేమి పలురూపాల ప్రభవించు....
నీవే కదా మముగాచు విభుడవు....
మహేశా . . . . . శరణు .
శివా!
బెంగటిల్లాలని ఉందీ...
ఎందుకూ అని అడగకండి...
ఎందుకో నాక్కూడా తెలీదూ...
కారణం లేని బెంగ కూడా ఓ బెంగేనా అనీ అడగకూ...
అదే చెప్పుకోలేనంత పెద్ద బెంగ కాదు అలా అని చిన్నది కూడా కాదు...
ఎప్పుడూ ఈలాగే నీ దరినే ఉంచేసుకో ఈశ్వరా..
ఇంకో జన్మ అంటూ నన్ను ఏ దరికీ పంపించకు ఈ బంధాలకు బంధీని చేయకు
అసలు ఈ లోకానికి నేను సరిపడనూ.
శివ నీ దయ.
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
అంతరంలో ఏదోతెలియని దిగులుతో ఉన్నది వదిలేసి లేని దాని కోసం బ్రమసి నిరంతరం వెంటరాని వాటి కోసం విలపిస్తాము...
నువ్విచ్చిన ఈ మేనును మమతలమాలగామార్చి నీ పదముల చెంతచేరాను.
ఉన్నదని ఉరుకులు లేవు.
ఏమి లేదని వేదన లేదు...
నేను కోరిన నువ్వు నా చెంతన
ఉండగా నాకెందుకు చింతన.
శివ నీ దయ.
లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...